newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

తెలంగాణలో గులాబీదే హవా

20-05-201920-05-2019 07:58:39 IST
Updated On 27-06-2019 14:45:48 ISTUpdated On 27-06-20192019-05-20T02:28:39.861Z20-05-2019 2019-05-20T02:28:27.266Z - 2019-06-27T09:15:48.628Z - 27-06-2019

తెలంగాణలో గులాబీదే హవా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. దేశమంతా ఎగ్జిట్‌పోల్స్‌ హడావుడి మొదలైంది. అయితే, దేశంలోని అన్ని ప్రముఖ సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కే అత్యధిక సీట్లు గెలుస్తుందని అంచనా వేశాయి. గులాబీ పార్టీకి కనీసం 12 నుంచి గరిష్ఠంగా 16 స్థానాలు రావొచ్చని సర్వే సంస్థలు వెల్లడించాయి. కాంగ్రెస్‌కు ఒకటి నుంచి రెండు స్థానాలు రావొచ్చని తెలిపాయి. ఒక్క లగడపాటి ఎగ్జిట్‌పోల్‌ మినహా మిగతా అన్ని సంస్థలు బీజేపీకి తెలంగాణలో ఒక స్థానం దక్కుతుందని అంచనా వేశాయి.

ఒకసారి ఎగ్జిట్ పోల్స్ ఎలా వచ్చాయో చూద్దాం..

* ఆర్జీ ఫ్లాష్‌ టీం టీఆర్ఎస్ పార్టీకి 14-16 సీట్లు వస్తాయని చెప్పగా, కాంగ్రెస్ పార్టీకి 0-2, ఎంఐఎంకి 1 సీటు వస్తుందని తెలిపింది.

*న్యూస్‌18 అయితే టీఆర్ఎస్ పార్టీకి 12-14సీట్లు వస్తాయని చెప్పగా, కాంగ్రెస్ పార్టీకి1-2  సీట్లు,  బీజేపీ 1-2 సీట్లు, ఎంఐఎం పార్టీకి 1 వస్తుందని తెలిపింది.

*టుడేస్‌ చాణక్య సర్వేలో టీఆర్ఎస్ పార్టీకి 12-16, కాంగ్రెస్ పార్టీకి 1-2, బీజేపీ 1-2  ఎంఐఎంకి 1 సీటు రావచ్చు. ఇతరులు1

*టైమ్స్‌ నౌ టీఆర్ఎస్ పార్టీకి 13, కాంగ్రెస్ పార్టీకి2, బీజేపీ1,ఎంఐఎం1 సీటు దక్కించుకోవచ్చు

*సీ ఓటర్‌ టీఆర్ఎస్ పార్టీకి14, కాంగ్రెస్1,బీజేపీ1 ఎంఐఎం1 సీటు దక్కించుకోవచ్చు

*ఇండియా టుడే సర్వే ప్రకారం టీఆర్ఎస్ పార్టీకి 10-12సీట్లు, కాంగ్రెస్1-3,  బీజేపీ1-3 ఎంఐఎం-1 సీటు గెలవచ్చు

*ఎన్డీటీవీ టీఆర్ఎస్ పార్టీకి 12,కాంగ్రెస్2, బీజేపీ 2,ఎంఐఎం 1 సీటు దక్కించుకోవచ్చు.

ఆదినుంచీ సారు..కారు...పదహారు..ఢిల్లీలో సర్కార్ అనే నినాదంతో ఉన్నారు సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉండడంతో ఢిల్లీ సర్కార్ వట్టి మాటే. 16 సీట్ల టార్గెట్లో ఒకటి రెండు తగ్గవచ్చు. కానీ ప్రాంతీయ పార్టీల్లో మాత్రం కేసీఆర్ ప్రత్యేక స్థానం పొందే అవకాశం ఉంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle