newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

తెలంగాణలో కోలుకోలేని దెబ్బ తిన్న బీజేపీ

26-10-201926-10-2019 10:43:34 IST
2019-10-26T05:13:34.653Z26-10-2019 2019-10-26T05:13:31.974Z - - 24-02-2020

తెలంగాణలో కోలుకోలేని దెబ్బ తిన్న బీజేపీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హుజూర్ నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఒక ఎత్తైతే బీజేపీ పొందిన దారుణ పరాజయం మరొక ఎత్తు అనే చెప్పాలి. ఒకరకంగా ఈ ఉపఎన్నికలో బీజేపీ ఓటమి గురించి వర్ణించడానికి మాటలు చాలవు. తెలంగాణపై బీజేపీ పెట్టుకున్న ఆశలన్నింటినీ ఒక్క దెబ్బతో తుడిచిపెట్టేసింది హుజూర్ నగర్. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో విజయం గురించి బీజేపీ ఆశించి ఉండకపోవచ్చు కానీ కనీసం కనీసమాత్రంగా ఓట్లను సాధించి పోటీలో గౌరవనీయ స్థానంలో నిలబడాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేసింది. 

అలా జరిగి ఉంటే 2023లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించి అధికారంలోకి రాగలిగే ఏకైక పార్టీగా బీజేపీ తనను తాను ప్రదర్శించుకోగలిగేది. పైగా తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా అధికారాన్ని కైవసం చేసుకోవాలని కలలు కంటున్న బీజేపీ నేతలకు అది నైతిక స్థైర్యాన్ని ఇచ్చేది. 

కానీ హుజూర్ నగర్ ఉపఎన్నిక ఫలితం బీజేపీ నేతల స్వప్నాలన్నింటినీ పూర్తిగా చెదరగొట్టేసింది. ఉప ఎన్నికలో పోలయిన రెండు లక్షల ఓట్లలో బీజేపీ అభ్యర్థి కే. రామారావుకు దయనీయంగా 1206 ఓట్లు వచ్చాయి. నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థికి కొన్నివందల మంది పార్టీ కార్యకర్తలు కూడా లేరని ఆయనకు వచ్చిన ఓట్లే తెలిపాయి.

అలాగని హుజార్ నగర్ ప్రజలకు బీజేపీ అంటే తెలియని పార్టీ కాదు. నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతాల్లో నరేంద్ర మోదీ ప్రభావం గణనీయంగానే ఉంది. కానీ బీజేపీ అభ్యర్థికి కొన్ని వందల ఓట్లకు మించి రాలేదు. దేశమంతటా అప్రతిహత విజయాలు సాధిస్తూ తెలంగాణలో మతపరంగా ఓట్లను, ఓటర్లను చీల్చి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ఆశలు పెట్టుకున్న జాతీయ పార్టీకి ఇంత తక్కువ ఓట్లు రావడం ఎంతో అవమానకరమైన విషయం అనే చెప్పాలి.

హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఒక విషయాన్ని మాత్రం తేటతెల్లం చేసింది. కనీసం మరో 10, 15 సంవత్సరాల వరకు తెలంగాణలో అధికారంలోకి వచ్చే ఆశలు బీజేపీకి కనుచూపు మేరలో లేవు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను గెల్చుకోవడం అనుకోని భాగ్యంగానే చెప్పుకోవచ్చని హుజూర్ నగర్ ఎన్నిక తేల్చి చెప్పేసింది.

నిద్ర లేచింది మొదలుకుని తెలంగాణలో పొడిచేస్తాం... చింపేస్తాం.. అని మాటల జోరు పెంచి బతికేస్తూ వచ్చిన బీజేపీ నాయకత్వం, కార్యకర్తలు తదుపరి ఎన్నికల్లో అయినా కాస్త పరువు నిలబెట్టుకునేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తే బాగుంటుందేమో మరి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో తెరాసను కానీ కేసీఆర్‌ను కానీ టచ్ చేసే పార్టీలు కానీ, నాయకులు కానీ లేరన్నది హుజూర్ నగర్ సాక్షిగా తేటతెల్లమైపోయింది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle