newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో కొత్తగా 945 కరోనా కేసులు.. కరోనా పరీక్షలు మళ్లీ ప్రారంభం

01-07-202001-07-2020 08:00:54 IST
Updated On 01-07-2020 10:01:36 ISTUpdated On 01-07-20202020-07-01T02:30:54.530Z01-07-2020 2020-07-01T02:30:51.597Z - 2020-07-01T04:31:36.364Z - 01-07-2020

తెలంగాణలో కొత్తగా 945 కరోనా కేసులు.. కరోనా పరీక్షలు మళ్లీ ప్రారంభం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా  945 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16,339కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. తాజాగా కరోనా నుంచి కోలుకున్న 1,712 డిశ్చార్జ్‌ కావడంతో.. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 7,294గా నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,795 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొత్తగా కరోనాతో మరో ఏడుగురు మృతిచెందడంతో మొత్తం మృతుల సంఖ్య 260కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 869 ఉన్నాయి. 

మంగళవారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 869 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా రంగారెడ్డి 29, సంగారెడ్డి 21, మేడ్చల్‌ 13, నిర్మల్‌ 4, కరీంనగర్‌ 2, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం, వికారాబాబాద్‌, నిజామాబాద్‌లో ఒక్కో కేసు నమోదు అయింది. జీహెచ్‌ఎంసీలో ఇప్పటివరకు 12,682 మంది కరోనా బారిన పడ్డారు. తెలంగాణలో మంగళవారం 3,457 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకూ మొత్తం 88,563 మందికి కరోనా టెస్టులు చేసినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

అవసరమైన ప్రతి వ్యక్తికీ కరోనా పరీక్షలు.. ఈటల రాజేందర్

కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలను గణనీయంగా పెంచినందున చాలామంది పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. అవసరమున్న ప్రతి వ్యక్తికి పరీక్షలు చేస్తామని, అందుకోసం 11 కేంద్రాల్లో అనుమానితుల నమూనాలు సేకరిస్తున్నామన్నారు.  పరీక్షల కోసం వస్తున్న వారు తప్పక మాస్క్‌ ధరించాలని, భౌతికదూరం పాటించాలని, లేదంటే అవే కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. 

మంగళవారం మంత్రి తన చాంబర్‌లో వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాజిటివ్‌ వచ్చిన వారు తక్కువ లక్షణాలుంటే ఇంట్లోనే ఐసోలేషన్‌ కావాలని మంత్రి సూచించారు. ఇలా ఉన్నవారికి ఉదయం, సాయంత్రం విధిగా కాల్‌ సెంటర్‌ నుండి ఫోన్‌చేసి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీయాలని అధికారులను ఆదేశించారు. అవసరం ఉన్న వారి దగ్గరకు డాక్టర్లను పంపించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు, చికిత్సకు వచ్చిన ప్రతి పేషంట్‌ దగ్గరికి డాక్టర్, నర్స్‌ తప్పకుండా రోజుకి మూడుసార్లు వెళ్లి పరీక్ష చేయాలని, పేషంట్లకు అందుబాటులో ఉండాలన్నారు. 

అన్ని జిల్లాల్లో ఉన్న మెడికల్‌ కాలేజీలను కరోనా పేషంట్లను చేర్చుకునేందుకు సిద్ధంచేయాలంటూ, ఆ బాధ్యతను కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి, కరోనా నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రవణ్‌కు అప్పగించారు. వాటి సన్నద్ధతపై రోజూ రిపోర్ట్‌ అందజేయాలని మంత్రి  కోరారు. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌), గాంధీ ఆస్పత్రుల్లో ఎంతమంది సిబ్బంది అవసరమో గుర్తించి ప్రతిపాదనలు రూ పొందించాలని సూచించారు. కరోనా పాజిటివ్‌ ఉన్న వ్యక్తిని ఎంత తొందరగా గుర్తిస్తే అంత వేగంగా వైరస్‌ వ్యాప్తినీ అడ్డుకోవచ్చన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు జనరల్‌ ఆస్పత్రి వరకు అన్నింటా అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. 

కరోనా నమూనాల సేకరణ తిరిగి ప్రారంభం

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు మంగళవారం తిరిగి ప్రారంభమయ్యాయి. సామర్థ్యానికి మించి శాంపిల్స్‌ స్వీకరించడంతో గత వారం పరీక్షలు పెండింగ్‌లో పడ్డాయి. దీంతో పరీక్షలకు విరామం ప్రకటించిన యంత్రాంగం... తిరిగి మంగళవారం పరీక్షల కోసం శాంపిల్స్‌ స్వీకరణను ప్రారంభించింది. తాజాగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 11 కేంద్రాల్లో నమూనాలు సేకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. లక్షణాలు ఉన్న వారికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. తీవ్రతను బట్టి ఆస్పత్రికి తరలించడమో లేదా హోం ఐసోలేషన్‌లో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. శాంపిల్స్‌ సేకరణ కేంద్రాల వద్ద నిబంధనలను కఠినతరం చేశారు. అనుమానితులు తప్పకుండా మాస్క్‌ ధరించడంతోపాటు భౌతికదూరాన్ని పాటిస్తేనే నమూనాలు సేకరిస్తున్నారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle