తెలంగాణలో కొత్తగా 920 కరోనా కేసులు.. బేగం బజారు మూసివేత
26-06-202026-06-2020 06:49:00 IST
Updated On 26-06-2020 10:42:30 ISTUpdated On 26-06-20202020-06-26T01:19:00.675Z26-06-2020 2020-06-26T01:18:57.980Z - 2020-06-26T05:12:30.618Z - 26-06-2020

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గురువారం కొత్తగా 920 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,364కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి 4,688 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,446 ఉన్నాయి. నేడు కరోనాతో ఐదుగురు మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 230గా నమోదైంది. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 737 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డిలో 86, మేడ్చల్‌లో 60, కరీంనగర్లో 13, రాజన్న సిరిసిల్లలో 4, మహబూబ్‌నగర్‌లో 3, నల్గొండలో 3, ములుగులో 2, మెదక్‌లో 2, వరంగల్ రూరల్, కామారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, జనగాం, మహబూబాబాద్, ఆదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసీఫాబాద్‌లో ఒక్కో పాజిటివ్ కేసు నమోదు అయినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ అధికారులు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. హైదరాబాద్‌లో కరోనా పరీక్షలకు బ్రేక్! నగరంలో కరోనా వైరస్ పరీక్షలకు అడ్డుకట్ట పడింది. జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో 50 వేల కరోనా పరీక్షలు చేయాలన్న ప్రభుత్వ ప్రక్రియకు తాత్కాళికంగా బ్రేక్ పడింది. ఇప్పటికే సేకరించిన శాంపిళ్ల టెస్టింగ్ ప్రక్రియ పూర్తికాని కారణంగా నేడు, రేపు పరీక్షలు నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. బేగంబజారు వారంరోజులపాటు మూసివేత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ కిరాణ మర్చంట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. వారం రోజుల పాటు బేగంబజార్‌లోని కిరాణా దుకాణాలు మూసివేయనున్నారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 5 వరకు బేగంబజార్‌లో దుకాణాలు మూసివేయనున్నట్లు కిరాణా మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్న విషయాన్ని చిరు వ్యాపారులు, ప్రజలు గమనించగలరని ఆయన విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
2 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
4 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
5 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
6 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
7 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
8 hours ago

వన్ ప్లస్ వన్ ఆఫర్
6 hours ago

నా రూటే సెపరేటు
10 hours ago

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
a day ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
a day ago
ఇంకా