తెలంగాణలో కొత్తగా 2,574 పాజిటివ్ కేసులు
06-09-202006-09-2020 09:47:03 IST
Updated On 06-09-2020 09:53:32 ISTUpdated On 06-09-20202020-09-06T04:17:03.613Z06-09-2020 2020-09-06T04:16:25.133Z - 2020-09-06T04:23:32.925Z - 06-09-2020

తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే వుంది. తెలంగాణలో గత 24 గంటల్లో 2,574 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి, 1,40,969కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్పటి వరకు 886 మంది మృతిచెందారని వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,40,969కు చేరాయి. వైరస్ ప్రభావంతో తాజా 9 మంది మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 886కు చేరింది. వైరస్ నుంచి కొత్తగా 2,927 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటి వరకు 1,07,530 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 32,553 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.62శాతం ఉండగా, దేశంలో 1.71శాతం ఉందని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. అలాగే రాష్ట్రంలో రికవరీ రేటు 76.2శాతంగా ఉందని చెప్పింది. 25,449 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారని తెలిపింది. శనివారం ఒకే రోజు 62,736 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. ఇప్పటికీ 17,30,389 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇంకా 3,129 శాంపిల్స్ రావాల్సి ఉందని చెప్పింది. 10లక్షల జనాభాకు 46,608 టెస్టులు చేస్తున్నట్లు వివరించింది. కాగా, తాజాగా నమోదైన 2,574 కేసులో హైదరాబాద్లో 325 నిర్ధారణ అయ్యాయి. తర్వాత రంగారెడ్డిలో 197, మేడ్చల్ మల్కాజ్గిరి 185, నల్గొండ 158, కరీంనగర్ 144, ఖమ్మం 128, వరంగల్ అర్బన్ 117, సూర్యపేట 102 అత్యధికంగా పాజిటివ్ నిర్ధారణ అయ్యాయి. కరోనా నిర్దారణ పరీక్షలు పెరిగాయి. దీంతో కేసులు అదే స్థాయిలో నమోదవుతున్నాయి.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
16 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
13 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
15 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
19 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
a day ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
a day ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా