newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో కొత్తగా 1,640 కరోనా కేసులు. ముందుముందు గడ్డురోజులు..

25-07-202025-07-2020 07:12:06 IST
2020-07-25T01:42:06.423Z25-07-2020 2020-07-25T01:42:01.655Z - - 12-04-2021

తెలంగాణలో కొత్తగా 1,640 కరోనా కేసులు. ముందుముందు గడ్డురోజులు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో శుక్రవారం కొత్తగా మరో 1,640 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 52,466కి చేరంది. ఈ మేరకు వైద్య,ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న 1,007 మంది డిశ్చార్జి కావడంతో.. ఇప్పటివరకు వైరస్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్య 40,334గా నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,677కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొత్తగా కరోనాతో 8 మంది మృతిచెందడంతో.. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 455కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీలో 683 ఉన్నాయి. 

ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే అప్పులు గ్యారంటీ.. ప్రభుత్వ వైద్యమే ముద్దు

కరోనా వైరస్ బాధితులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లొద్దని, లాక్‌డౌన్‌ నేపథ్యంలో మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటే అప్పుల పాలవుతారని వైద్య,ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్‌ శ్రీనివాసరావు అన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షల రూపాయలు చార్జ్‌ చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రస్తుతం కరోనాకు ప్రత్యేక చికిత్స లేదని, లక్షణాలను బట్టి మందులు వేసుకోవాలని, ఇది చాలా సింపుల్‌ పద్ధతి అని అన్నారు. అయితే చిన్న లక్షణం కనిపించినా డాక్టర్‌ వద్దకు వెళ్లాలని, నిర్లక్ష్యం చేస్తే పెనుముప్పుగా మారుతుందన్నారు. 

ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 8 వేలకు పైగా ఐసోలేషన్, ఆక్సిజన్, వెంటిలేటర్‌ బెడ్లు ఉన్నాయని, ప్రైవేటు ఆస్పత్రుల్లో 4,200 పడకలు ఉన్నాయని, మొత్తంగా 15 వేల పడకలు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. లక్షణాలు ఉన్న వారంతా కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, ఈ మేరకు అన్ని పీహెచ్‌సీల్లో కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. రోజూ సగటున 15 వేల పరీక్షలు చేస్తున్నామని, త్వరలో వీటిని 20–25 వేలకు పెంచుతామన్నారు.

వర్షాకాలంలో కొత్త చిక్కులు

కరోనా వైరస్‌తో కొత్త చిక్కొచ్చిపడింది. అసలే వర్షాకాలం.. జలుబు, వైరల్‌ జ్వరాలు పంజా విసిరే సమయం. ప్రస్తుతం ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో దోమలు విజృంభిస్తున్నాయి. సీజనల్‌గా వచ్చే టైఫాయిడ్, డెంగీ, మలేరియా జ్వరాలకు స్వైన్‌ఫ్లూ కూడా తోడైంది. సీజనల్‌ వ్యాధులకు..కరోనా వైరస్‌కు కామన్‌ సింప్టమ్‌ జ్వరమే. దీంతో ఎవరు ఏ జ్వరంతో బాధపడుతున్నారో గుర్తించడం కష్టం కానుంది. ఇప్పటికే గాంధీ సహా తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (టిమ్స్‌) ఆస్పత్రులను ప్రభుత్వం పూర్తిస్థాయి కోవిడ్‌ సెంటర్లుగా మార్చింది.

మున్ముందు కేసులు భారీగా పెరుగుతాయనే వైద్య ఆరోగ్యశాఖ అంచనాలతో ఇప్పటి వరకు టెస్టింగ్, ఐసోలేషన్‌ సెంటర్లుగా ఉన్న కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రి, నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రులను కూడా పూర్తి స్థాయి కోవిడ్‌ కేంద్రాలుగా మార్చుతున్నట్టు ప్రకటించడంతో ఆయా ఆస్పత్రుల్లో సాధారణ రోగులకు చికిత్సలు ప్రశ్నార్థకంగా మారాయి. మరోపక్క గ్రేటర్‌ హైదరాబాద్‌లో పరిస్థితులు గందరగోళంగా మారుతున్నాయి. ఇక్కడ మార్చి 2న తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో 1,616 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు తర్వాత వీటి సంఖ్య అనుహ్యంగా పెరిగింది. 

దీంతో జూన్‌లో 11,080 కేసులు, జూలైలోని 22 రోజుల్లోనే 21,443 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం నగరంలో రోజుకు సగటున 800–1,000 పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. బాధితుల్లో 80 శాతం మందిలో లక్షణాలు కన్పించట్లేదని అంచనా. దీంతో తమకు తెలియకుండానే వీరు వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖ కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ను నిలిపివేసింది. ఆస్పత్రుల్లోని పడకల నిష్పత్తికి మించి బాధితులు వస్తుండటంతో వైద్యులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. 

గురువారం వైద్యశాఖ ఉన్నతాధికారులు చెప్పిన వివరాలను బట్టి చూస్తే  రాష్ట్రంలో వైరస్‌ తీవ్ర రూపం దాల్చినట్టే కనిపిస్తోంది.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle