newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో కొత్తగా 1296 కరోనా కేసులు.. జీహెచ్ఎంసీలో తగ్గని ఉధృతి

20-07-202020-07-2020 12:02:05 IST
Updated On 20-07-2020 17:12:43 ISTUpdated On 20-07-20202020-07-20T06:32:05.334Z20-07-2020 2020-07-20T06:32:01.996Z - 2020-07-20T11:42:43.436Z - 20-07-2020

తెలంగాణలో కొత్తగా 1296 కరోనా కేసులు.. జీహెచ్ఎంసీలో తగ్గని ఉధృతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పొరుగురాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తూ రోజుకు 5 వేలకుపైగా కేసులు నమోదవుతుండగా తెలంగాణలో మాత్రం కొత్త కేసులు నిలకడగా ఉంటున్నాయి. కానీ హైదరాబాద్ నివురుగప్పిన నిప్పులా ఉందంటూ జాతీయ సర్వే పేర్కొనడంతో నగరవాసులు భయంతో కంపించి పోతున్నారు. 

రాష్ట్రంలో కొత్తగా ఆదివారం 1,296 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 45,076కు చేరింది. ఇందులో 12,224యాక్టివ్‌ కేసులున్నాయి. ఆదివారం కరోనాతో ఆరు మంది మరణించగా, ఇప్పటివరకు నమోదైన మరణాలు 415కు పెరిగాయి. ఈ రోజు కరోనా నుంచి కోలుకొని 1831 మంది డిశ్చార్జి కాగా ఇప్పటి వరకు 32,438 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

గత 24 గంటల్లో తెలంగాణలో మొత్తం 12,519 పరీక్షలన నిర్వహించామని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఏరియాల్లోనే 557 పాజిటివ్ కేసులు నమోదు కాగ, రంగారెడ్డి జిల్లాలో 111 కేసులు, మేడ్చల్లో 87 కేసులు నమోదై ప్రజలు వణికిపోతున్నారు.

తాజాగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 557, రంగారెడ్డి 111, మేడ్చల్ 87, సంగారెడ్డి 28, ఖమ్మం 5, కామారెడ్డి 67,వరంగల్ అర్బన్ 117, వరంగల్ రూరల్ 41, నిర్మల్ 1, కరీంనగర్ 27, జగత్యాల 11,  యాదాద్రి భువనగిరి 15, మహబూబాబాద్ 21, , మెదక్ 29, పెద్దపల్లి 29, మహబూబ్ నగర్ 6, మంచిర్యాల 1, నల్లగొండ 26, రాజన్న సిరిసిల్ల 19, ఆదిలాబాద్ 15, ఆసీఫాబాద్ 1, వికారాబాద్ 1, నాగర్ కర్నూల్ 13, జనగాం 5, నిజామాబాద్ 24,  ములుగు, 2, వనపర్తి 7, సిద్దిపేట 10, సూర్యాపేట 16, గద్వాల్‌ జిల్లాలలో4 కేసులు నమోదు అయ్యాయి. 

కాగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు విజంభిస్తుండటంపై కేంద్ర ఆరోగ్య శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ సైతం తెలుగు సీఎంలిద్దరికీ ఆదివారం ఫోన్ చేసి కరోనా పెరుగుదలపై వాకబు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వీలైనంత కేంద్ర సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.

 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   3 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   4 hours ago


ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

   32 minutes ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   3 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   5 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   6 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   6 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle