newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

తెలంగాణలో కలకలం రేపుతున్న వైసీపీ ఎమ్మెల్యే భూకబ్జా?

30-12-201930-12-2019 13:00:51 IST
Updated On 30-12-2019 13:08:16 ISTUpdated On 30-12-20192019-12-30T07:30:51.644Z30-12-2019 2019-12-30T07:30:48.855Z - 2019-12-30T07:38:16.189Z - 30-12-2019

తెలంగాణలో కలకలం రేపుతున్న వైసీపీ ఎమ్మెల్యే భూకబ్జా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలంగాణలోని హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తుఫ్రాన్ పేట శివారు.. యాదాద్రి వద్ద 40 ఎకరాల భూమి చుట్టూ కందకం తవ్వించేసి ఆ తన భూమితనదేనని పెద్ద బోర్డులు కూడా పెట్టించారు.

అయితే ఈ భూమి తమదేనని రెండు రాష్ట్రాలకు చెందిన కొందరు ప్రజలు అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు. నిజానికి వీళ్లంతా ఆ భూమిని అధికారికంగా కొనుగోలు చేసిన వాళ్లే. వివాదంగా ఉన్న ఈ భూమిలో సుమారు ఇరవై ఏళ్ల క్రితమే శివప్రియనగర్ 2 పేరుతో కర్నూలుకు చెందిన ఓ రియల్టర్ వెంచర్ వేశారు. అందులో మొత్తం ఎనిమిది వందలకు పైగా ప్లాట్లు చేశారు.

ఇప్పుడు మార్కెట్ ప్రకారం ఆ భూమి వందకోట్లకు పైగా ఉంటుందని అంచనా కాగా ఆ నలభై ఎకరాలను అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంతమంది కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆ భూమి తమదేనని 80ల్లోనే భూమిని కొనుగోలు చేసానని.. అయితే 2008లో తన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నానని చెప్తున్నారు.

వివాదంగా మారిన ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం వద్దకు వెళ్లినట్లుగా తెలుస్తుంది. ఆ భూమిలో ఇరవై ఏళ్ల క్రితం వెంచర్ వేసిన రియల్టర్ కూడా గతంలో ఇలానే ఒక స్థలాన్ని ఇద్దరికీ ముగ్గురికి అమ్మిన కేసులలో ఇరుకున్న వ్యక్తేనని చెప్తున్నారు. అదే మాదిరి ఈ నలభై ఎకరాల భూమిలో కూడా రియల్టర్ చేతివాటం చూపించాడేమో అనే వాదనలు వినిపిస్తున్నాయి.

అయితే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి.. ఏకంగా నలభై ఎకరాల భూమిలో ఇరవై ఏళ్ల క్రితమే వెంచర్ వేసి కొనుగోళ్లు జరిగినా తెలుసుకోనేంత స్థితిలో ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందునా వెంచర్లో ప్లాట్లు కొన్నవాళ్లంతా ఇరవై ఏళ్ల క్రితమే కొన్నామంటుంటే.. వెంచర్ వేసిన రియల్టర్ సదరు ఎమ్మెల్యేకి మాత్రం 2008లో రిజిస్ట్రేషన్ చేసినట్లుగా చెప్తున్నారు.

వెంచర్ వేసిన సమయం.. విక్రయాల సమయంలో అక్కడ భూమి విలువ చాలా తక్కువ. ఇప్పుడు యాదాద్రి పునర్నిర్మాణం.. అక్కడ జరిగిన అభివృద్ధి తర్వాత అక్కడ భూమికి చాలా డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో ఆ వెంచర్ లో ప్లాట్లు కొన్నవాళ్ళు అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతుంటే సదరు ఎమ్మెల్యే కూడా భూమి తనదేనని.. ఇప్పుడు కూడా తమ స్వాధీనంలో ఉందని.. పత్రాలను ఎలాగైనా నిరూపించుకుంటానంటున్నారు. చూడాలి తెలంగాణ ప్రభుత్వం ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుందో!

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle