newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో కలకలం రేపిన 'దొంగలతో దోస్తీ' కథనం!

23-02-202023-02-2020 11:11:47 IST
2020-02-23T05:41:47.386Z23-02-2020 2020-02-23T05:40:05.928Z - - 16-04-2021

తెలంగాణలో కలకలం రేపిన 'దొంగలతో దోస్తీ' కథనం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రముఖ దినపత్రిక తెలంగాణ, హైదరాబాద్ సిటీ ఎడిషన్ లో శనివారం రాసుకొచ్చిన దొంగలతో దోస్తీ కథనంపై రాష్ట్రంలో కలకలం రేగింది. ముఖ్యంగా రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ నుండి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు సజ్జనార్, అంజనీ కుమార్, మహేష్ భగవత్, డీజీలు, డీఐజీలు, డీసీపీలు అందరూ సమావేశమై మీడియా సమావేశం నిర్వహించి తీవ్రంగా ఫైర్ అయ్యారు.

దేశంలోనే అత్యున్నతమైన పోలీస్ గా పేరున్న తెలంగాణ పోలీసులనే దొంగలతో అంటగడతారా అంటూ తీవ్రంగా రెచ్చిపోయారు. ఈ  కథనంపై న్యాయపరమైన చర్యలకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని సీపీలు తెలిపారు. రాష్ట్రంలో భద్రతలను మెరుగుపరచడంతో పాటు ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థగా దేశంలోనే తాము మొదటి స్థానంలో ఉన్నామని అధికారులు చెప్పుకొచ్చారు.

ఇక హోంమంత్రి మహమూద్ అలీ అయితే ఇది కేవలం పోలీస్ వ్యవస్థకే కాదని రాష్ట్ర ప్రజలందరినీ అవమానించినట్లేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏర్పడ్డాక ఉన్నతమైన వ్యవస్థగా రాష్ట్ర పోలీస్ వ్యవస్థను రూపొందించామన్నారు. 

సదరు పత్రిక కథనంపై ఎడిటర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన హోంమంత్రి లేదంటే ఏకంగా వెయ్యి కోట్లకు పరువు నష్టం దావా వేసేందుకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. అయితే అసలు రాష్ట్ర పోలీస్ వ్యవస్థే ఇంతగా స్పందించేంతగా ఆ కథనంలో ఏముందా అన్న చర్చలు రాజకీయ వర్గాలలో సహజంగానే ఎక్కువగా కనిపించింది.

Image result for దొంగలతో దోస్తీ

ఆ పత్రిక బ్యానర్ కథనంగా రాసుకొచ్చిన ఆ కథనంలో రాష్ట్రంలో కొందరు పోలీస్ అధికారులు కాసులకు కక్కుర్తి పడుతూ దొంగలు, కబ్జా దారులు, రాజకీయ నాయకులతో కలిసి అంటకాగుతూ అడ్డగోలుగా సంపాదించుకుంటున్నారని వెల్లడించారు.

అలా సంపాదించినా ఆ సొమ్మునే మళ్ళీ నేతలకు ముడుపులుగా చెల్లించి పదోన్నతులు పొందుతున్నారని రాసుకొచ్చింది. వీళ్ళ తీరుతో పరువు బజారున పడుతుందని భావించిన రాష్ట్ర పోలీస్ శాఖ పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తుందని.. అయినా అలవాటు పడిన అధికారులు బెదరకపోవడంతో నానాటికీ ఇది పెరుగుతుందని.. దీని ప్రభావంతో రాష్ట్ర పోలీస్ శాఖపై ప్రజలలో నమ్మకం పోతుందని రాసుకొచ్చింది.

అయితే, ఇదంతా గాలి వార్తగా ఏమీ రాయలేదు. మొత్తం రాష్ట్రంలో అవినీతికి పాల్పడి సస్పెండ్ అయిన అధికారులు, డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసిన అధికారులు, విధుల నుండి తప్పించిన మొత్తం ఆరుగురు అధికారులను ఉటంకిస్తూ కథనం రాసింది. వీరంతా నిజంగా పట్టుబడిన అధికారులే కావడం గమనార్హం. మరి ఆ విషయాన్నే ఆ పత్రిక హైలైట్ చేసింది. కానీ అధికారులు మాత్రం తీవ్రంగా స్పందించారు. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి!

 

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   6 minutes ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   14 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   10 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   12 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   14 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   17 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   18 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   20 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   21 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   21 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle