newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

31-05-202031-05-2020 14:41:27 IST
2020-05-31T09:11:27.363Z31-05-2020 2020-05-31T09:11:25.233Z - - 20-04-2021

తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత పది రోజులుగా కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో దూసుకెళ్తుంది. అయితే, రెండు నెలలకుగా పైకా కరోనా, పాజిటివ్ కేసులు, జోన్లు అంటూ వినివిని విసిగిపోయిన ప్రజలు ప్రస్తుతం నమోదైన కేసుల సంఖ్యపై పెద్దగా చర్చలు పెట్టడం లేదు. కానీ తెలంగాణలో వైరస్ వ్యాప్తి ఎక్కువగానే ఉందని చెప్పేందుకు మాత్రం రోజువారీ నమోదయ్యే కేసులే ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

శనివారం ఒక్కరోజే రాష్ట్రంలో 74 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, శుక్రవారం నమోదైన 169 కేసులతో పోల్చుకుంటే శనివారం పెద్ద సంఖ్యగా కనిపించకపోవచ్చు. కానీ శనివారం రోజున రాష్ట్రంలో కరోనా ఆరుగురిని పొట్టనపెట్టుకుంది. గడిచిన 24 గంటలలో రాష్ట్రంలో కరోనా ఆరుగురు మరణించినట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. అందులో మూడు నెలల చిన్నారితో పాటు 24 రోజుల పసికందు కూడా ఉండడం విచారకరం.

కాగా, శనివారం నమోదైన పాజిటివ్ కేసుల్లో హైదరాబాద్ పరిధిలో 41, రంగారెడ్డిలో 5, మెదక్‌లో ఇద్దరు, సంగారెడ్డిలో ముగ్గురికి, మహబూబ్ నగర్, జగిత్యాలలో ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక సూర్యాపేట, వనపర్తి, వరంగల్ అర్బన్, వికారాబాద్, మేడ్చల్, నగర్ కర్నూల్, నిజామాబాద్ జిల్లాలో ఒక్కోకేసు బయటపడ్డాయి. వీరితో పాటు విదేశాల నుంచి వారిలో 5 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 9గురికి కరోనా నిర్ధారణ అయింది.

తాజా లెక్కలతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 2,499 కాగా వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 1412 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 77 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1010 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్కకేసు లేని 3 జిల్లాలలో ఒకటైన జగిత్యాలలో తొలికేసు నమోదు కావడంతో ఇక మహమ్మారి ఎంటర్ కాని జిల్లాలు రెండే.

దక్షణాది రాష్ట్రాలలో ఒక్క కేరళ మినహా మిగతా అన్ని రాష్ట్రాలలో కేసులు వేలసంఖ్యలోకి చేరి ఒకదానితో మరొకటి పోటీపడుతున్నాయి. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక వారంలో ఏపీలో కేసులు ఉదృతంగా బయటపడుతుంటే మరోవారంలో తెలంగాణ ఆ క్రెడిట్ తీసుకుంటుంది. తెలంగాణలో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు పదుల సంఖ్యలో కేసులు బయటపడుతూనే ఉన్నాయి.

నగరంతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు, అటు మహారాష్ట్రతో సరిహద్దు జిల్లాలు కూడా వైరస్ వ్యాప్తిలో ముందున్నాయి. ఇక దాదాపు రెండు నెలల లాక్ డౌన్ అనంతరం జగిత్యాలలో తాజాగా తొలి కేసు నమోదవడంతో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇక కరోనా సోకని జిల్లాలు రెండే మిగిలాయి. అయితే, ప్రస్తుతానికి జిల్లాల మధ్య రాకపోకల విషయంలో సడలింపులతో జిల్లాలకు వ్యాపించడం పెద్ద విషయమేమీ కాకపోవచ్చు.

ఇక హైదరాబాద్ నగరం విషయానికి వస్తే నగరంలో జనాభా రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఒకపక్క రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగి నగరంలో విపరీతమైన వేడి, ఉక్కపోత ఉన్నా ప్రజలు మాత్రం లెక్కచేయక పరుగులు పెడుతూనే ఉన్నారు. దీనికి తోడు రేపటి నుండి లాక్ డౌన్ లో మరింత సడలింపులు అమలుచేసే అవకాశం కనిపిస్తుంది. ఈక్రమంలో ముందుముందు ఎలాంటి పరిస్థితులు తలెత్తనున్నాయో చూడాల్సి ఉంది. 

 

 

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   12 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   12 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   16 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   18 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   13 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   20 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   20 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   13 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   14 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle