తెలంగాణలో కరోనా లేదు.. వస్తే యుద్ధం చేసి తరిమేద్దాం
07-03-202007-03-2020 16:30:27 IST
Updated On 07-03-2020 16:43:59 ISTUpdated On 07-03-20202020-03-07T11:00:27.065Z07-03-2020 2020-03-07T11:00:22.926Z - 2020-03-07T11:13:59.454Z - 07-03-2020

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణ మృదంగం చేస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ బాధితుల కోసం కేంద్రం సాయంతో గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎం కేసీయార్ కరోనా వైరస్ పై సుదీర్ఘంగా మాట్లాడారు. కరోనాపై అసత్యాలు, దుష్ప్రచారాలు చేయడం సరికాదన్నారు. కరోనా రావొద్దు అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని సీఎం అన్నారు. రాష్ట్రానికి కరోనా వైరస్ రాదు.. రానివ్వం కూడా అని సీఎం తేల్చిచెప్పారు. ఈ వైరస్ ఇక్కడ పుట్టినది కాదు, ఒక వేళ వచ్చినా.. రూ. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి అయినా కరోనాను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. 130 కోట్ల మంది ఉన్న దేశంలో 31 మందికే కరోనా వచ్చిందన్నారు. ఈ 31 మంది కూడా దుబాయ్, ఇటలీ లాంటి ఇతర దేశాలకు పోయి వచ్చినా వారే అని సీఎం తెలిపారు.మన రాష్ట్రంలో కరోనా లేనప్పడు మాస్క్‌లు ఎందుకు? అని కేసీఆర్ ప్రశ్నించారు. 22 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే కరోనా వైరస్ బతకదని సీఎం కేసీయార్ సభలో చెప్పారు. మన దగ్గర 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది.. అలాంటప్పుడు ఆ వైరస్ ఎలా బతుకుతుందని సీఎం ప్రశ్నించారు. మాస్క్ కట్టుకోకుండానే కరోనాపై యుద్ధం చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. వైరస్ లక్షణాలు ఉన్నవారికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారని, ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు. కరోనా విషయంలో వదంతులు వ్యాప్తిచేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా సీఎం కేసీయార్ మాట్లాడారు. కాంగ్రెస్ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు హైదరాబాద్ లో కరోనా వ్యాప్తిచెందే అవకాశం లేదన్నారు సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్. కరోనా వైరస్‌పై ఐటీ కంపెనీల ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సజ్జనార్ శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వివిధ ఐటీ కంపెనీల సీఈవోలు, హైసియా మెంబర్స్, సొసైటీ ఫర్ సైబరాబాద్‌సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధులు హజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ వదంతులు వ్యాప్తిచేసేవారికి హెచ్చరికలు జారీచేశారు. ఐటీ కారిడార్‌లో పరిస్థితి ప్రశాంతంగా ఉందన్నారు. కరోనాపై ఏవైనా అపోహలుంటే సైబరాబాద్ పోలీసులను సంప్రదించాలని సూచించారు.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
12 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
8 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
10 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
13 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
15 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
17 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
18 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
19 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
20 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
21 hours ago
ఇంకా