newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో కరోనా.. ముందుకో అడుగు, వెనక్కు 4 అడుగులు!

18-04-202018-04-2020 14:37:30 IST
Updated On 18-04-2020 14:38:51 ISTUpdated On 18-04-20202020-04-18T09:07:30.428Z18-04-2020 2020-04-18T09:07:28.622Z - 2020-04-18T09:08:51.608Z - 18-04-2020

తెలంగాణలో కరోనా.. ముందుకో అడుగు, వెనక్కు 4 అడుగులు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యవహారంలో ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకేస్తే నాలుగు అడుగులు వెనక్కు పడుతుంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వం పూర్తిస్థాయి కట్టడికి టార్గెట్స్ పెట్టుకోవడం.. ఆ సమయానికి రాష్ట్రంలో కేసుకు సంఖ్య మరింత పెరిగి టార్గెట్ సంగతెలా ఉన్నా మరికాస్త ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం ఈనెల 20 నుండి కేంద్రం కొన్నిటికి లాక్ డౌన్ సడలింపుకి అవకాశం ఇచ్చింది.

అయితే ఇప్పుడు దానిని తెలంగాణలో అమలు చేయాలా వద్దా అన్నా ఆలోచనలో పడేసింది. గురువారం నాటికే రాష్ట్రంలో కేసుల సంఖ్య 700 చేరగా శుక్రవారం ఒక్కసారిగా 66 కేసులు పాజిటివ్ గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా ప్రభావం ఎంతగా ఉందో మరోసారి రుజువైంది. అయితే ఆదివారం క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రంలో పరిస్థితిపై చర్చించి 20 తర్వాత లాక్ డౌన్ ప్రకటనలో మార్పులు చేయనున్నారు.

కానీ ఇప్పుడున్న పరిస్థితిని చూస్తుంటే ఎలాంటి సడలింపు లేకుండా మే 3 వరకు లాక్ డౌన్ ఉత్తమమే అనే మాటలు వినిపిస్తున్నాయి. నిజానికి తెలంగాణలో ఏప్రిల్ తొలి వారం నాటికే కరోనా ఫ్రీ రాష్ట్రంగా చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ అనుకోకుండా మర్కజ్ ప్రార్ధనకు వెళ్లిన వారి రూపంలో ఆ ఆశ ఆవిరైంది. ఇది ఒక్క తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా భారీగా కుదుపుగా మారిపోయింది.

తెలంగాణ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసి వారిని ట్రేస్ చేసి ఎక్కడిక్కడ వారికి ఉన్న లింకులను పట్టుకుని మొత్తాన్ని కంట్రోల్ లోకి తెచ్చుకున్నారు. ఇక కనీసం ఏప్రిల్ 20 నాటికి రాష్ట్రంలో కరోనాను అదుపులోకి తెచ్చుకోవాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. కానీ ఆ ఆశను కూడా వమ్ము చేస్తూ గురు, శుక్రవారాలలోనే 116 కేసులు నమోదయ్యాయి.

ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే శుక్రవారం వరకు 409 కేసులు నమోదై వైరస్ విజృంభిస్తున్నట్లుగా తాజా లెక్కలు చెప్తున్నాయి. దీంతో ప్రభుత్వం మరో టార్గెట్ కూడా విఫలమైనట్లేనని చెప్పుకోవాలి. ఈనెల 20 తర్వాత పలు రంగాలలో సడలింపు ఉంటాయని అనుకున్నా ఇప్పుడు మరింత కఠినం అవసరం అనేలా పరిస్థితులు మారిపోయాయి.

దీనిపై ఇప్పటికే శుక్రవారం హైకోర్టు తీవ్ర ఆందోళన వక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా ప్రభావం ఎలా ఉంది? టెస్టింగ్‌ కిట్లు ఎన్ని ఉన్నాయో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో 67 వేల టెస్టింగ్‌ కిట్లే ఉన్నాయని ప్రభుత్వం నివేదికలో పేర్కొనగా.. పెద్ద సంఖ్యలో ఉన్న హాట్‌స్పాట్లలోని ప్రజలకు ఎలా పరీక్షలు చేస్తారని ప్రశ్నించింది. దీనిపై ఈ నెల 24 లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

ఈక్రమంలో ఆదివారం క్యాబినెట్ చర్చ ఏ విధంగా సాగనుంది? సీఎం కేసీఆర్ లాక్ డౌన్ సడలింపుపై ఏ నిర్ణయం తీసుకున్నారన్నది ఆసక్తిగా మారింది. కేంద్రం ఇచ్చిన సడలింపులను రాష్ట్రంలో కూడా అమలు చేస్తారా? లేక రాష్ట్రంలో మరింత కఠినం చేస్తారా? పెరుగుతున్న కేసులను ముందే గుర్తించిన లెక్కలోకి వేస్తారా? లేక సామజిక సంక్రమణ లెక్కలోకి తెస్తారా? అన్నదానిపై అందరు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

 

 

 

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   an hour ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   14 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   10 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   13 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   15 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   17 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   19 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   20 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   a day ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle