newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో కరోనా బీభత్సం.. ఆరుగురి మృతి

31-03-202031-03-2020 08:19:09 IST
Updated On 31-03-2020 09:37:37 ISTUpdated On 31-03-20202020-03-31T02:49:09.056Z31-03-2020 2020-03-31T02:49:01.159Z - 2020-03-31T04:07:37.742Z - 31-03-2020

తెలంగాణలో కరోనా బీభత్సం.. ఆరుగురి మృతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా  కల్లోలం సృష్టిస్తోంది. కరోనా కారణంగా ఇప్పటి వరకు ఆరుగురు బలయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసులు 76కు చేరాయి. ‘ఈ నెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో గల మర్కజ్‌లో మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్‌ సోకింది. అందులో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారు’ అని ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం రాత్రి ప్రకటించడంతో కలకలం రేగింది.

అందులో తెలిపిన వివరాల మేరకు.. ఇద్దరు గాంధీ ఆసుపత్రిలో, అపోలో, గ్లోబల్‌ ఆస్పత్రులతో పాటు నిజామాబాద్, గద్వాలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. వీరి ద్వారా కరోనా వైరస్‌ సోకే అవకాశం ఉందని భావిస్తున్న అనుమానితులను ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు గుర్తించి ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. వారికి పరీక్షలు నిర్వహించి, వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. 

వైరస్ సోకే అవకాశం ఉందని భావిస్తున్న అనుమానితులను ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు గుర్తించి, ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. వారికి పరీక్షలు నిర్వహించి, వైద్యం అందిస్తున్నారు. మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తున్నది కాబట్టి, ఈ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరు విధిగా తమ సమాచారాన్ని అధికారులకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తున్నది. వారికి ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించి, ఉచితంగా చికిత్స కూడా అందిస్తుంది. కాబట్టి మర్కజ్ వెళ్ళి వచ్చిన వారంతా తప్పక అధికారులకు సమాచారం అందించాలి. వారి గురించి ఎవరికి సమాచారం తెలిసినా వెంటనే ప్రభుత్వానికి తెలియ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కోరుతోంది.

No photo description available.

ఈనెలలో  రాష్ట్రం నుంచి సుమారు 1500 మంది సామూహికంగా మతపరమైన ప్రార్థనల కోసం ఢిల్లీ వెళ్లి నిజాముద్దీన్ మసీదులో జరిగిన మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనేది ఒక వైపు వాదన మరొక వాదన ఏమిటంటే... మత పరమైన ప్రార్థనకు అని చెప్పినా కేంద్రం తీసుకున్న NRC, NPR & CAA లకు సంబంధించిన విషయాలపై చర్చించి... భవిష్యత్తు కార్యాచరణపై దిశ నిర్దేశం చేసేందుకు మతపెద్దలు మీటింగ్ పెట్టారని అంటున్నారు. దీనికి కొన్ని మసీదుల నుంచి ఇక్కడ నుంచి తీసుకెళ్లారని వాదన ఉంది.

ఈ రెండు అంశాలు పక్కన పెడితే... వీరు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేటప్పుడు  హైదరాబాదులో 300 మంది, చీరాలలో 80 మంది, ఒంగోలులో 200 మంది దిగినట్లు తెలుస్తోంది. వీరుకాక విజయవాడ, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలో కూడా మరికొందరు దిగారని అంటున్నారు. వీరితో పాటుగా మిగిలిన వారు ఎక్కడెక్కడ దిగారో ఇంకా పూర్తిస్దాయిలో ఆచూకీ దొరకలేదు. రైల్వేశాఖ ద్వారా ఆ రోజు ట్రైన్ లో ప్రయాణించిన వారి వివరాలు... రిజర్వేషన్ షీట్లు ద్వారా సేకరిస్తున్నారు. రిజర్వేషన్ లేకుండా ఎక్కిన వారి వివరాలు సేకరించటం మా‌మూలు విషయం కాదు.  వీరి అడ్రెస్ కోసం అధికారులు జల్లెడ పడుతున్నారు. వీరి గుర్తింపు లో జాప్యం జరిగితే ఇటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు భారీ మూల్యం చెల్లించక తప్పదనే ఆందోళన వ్యక్తం అవుతోంది. 

విదేశాల నుంచి క్వారంటైన్ ఉన్నవారికి నెగిటీవ్ రిపోర్టులు వస్తుంటే... ఢిల్లీ నుంచి వచ్చిన వారికి మాత్రం పాజిటీవ్ రిపోర్టులు వస్తున్నాయి. వీరిలో చీరాల నవాబ్ పేట మరియు పేరాల మసీదు సెంటర్ దగ్గర వాళ్ళు అక్కడ కు వెళ్ళి వచ్చిన వారే. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, మాచర్ల, చీరాల, భీమవరం, కాకినాడలలో వెలుగులోకి వస్తున్న కేసులలో అత్యధికులు ఢిల్లీ టూర్ వారే..

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   5 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   an hour ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   4 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   8 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   11 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   12 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle