newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో కరోనా పరీక్షలు ఎక్కడ చేస్తారంటే?

16-06-202016-06-2020 10:23:31 IST
Updated On 16-06-2020 11:18:57 ISTUpdated On 16-06-20202020-06-16T04:53:31.365Z16-06-2020 2020-06-16T04:53:10.217Z - 2020-06-16T05:48:57.721Z - 16-06-2020

తెలంగాణలో కరోనా పరీక్షలు ఎక్కడ చేస్తారంటే?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు సేవలకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నప్పటికీ ఫీజులను ఏ మేరకు వసూలు చేయాలనే విషయమై ప్రభుత్వం తాజాగా స్పష్టత ఇచ్చింది. అదేవిధంగా ప్రైవేటు ల్యాబ్‌లు కరోనా పరీక్షలు చేసేలా వెసులుబాటు కల్పించింది. కరోనా పరీక్షకు రూ. 2,200 ఫీజును ఖరారు చేసింది. అలాగే ప్రైవేటు ఆస్పత్రుల్లో అందించే చికిత్సలో భాగంగా రోజుకు ఐసోలేషన్‌ ఫీజు రూ. 4 వేలు, ఐసీయూలో వెంటిలేటర్‌ అవసరం లేకుండా రోజుకు రూ. 7,500, ఐసీయూలో వెంటిలేటర్‌ అవసరం ఉంటే రోజుకు రూ. 9 వేలుగా ధరలు ఖరారు చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు.

తెలంగాణాలో కరోనా పరీక్షలు చేసే ప్రైవేటు ల్యాబ్స్ ఏవంటే..? 

* జూబ్లీ హిల్స్‌లోని అపోలో హాస్పిటల్స్ లాబొరేటరీ సర్వీసెస్

* హిమాయత్ నగర్ లోని విజయ డయాగ్నొస్టిక్ సెంటర్

* చర్లపల్లిలోని విమ్తా ల్యాబ్స్

*అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ లిమిటెడ్, డయాగ్నొస్టిక్ లాబొరేటరీ బోయినపల్లి

*పంజాగుట్టలోని డాక్టర్ రెమెడీస్ ల్యాబ్స్

*మేడ్చల్ లోని పాత్‌ కేర్ ల్యాబ్‌లు..

*లింగంపల్లిలోని అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ అండ్ ల్యాబ్ సైన్సెస్

*న్యూ బోయినపల్లిలోని మెడ్సిస్ పాత్లాబ్స్...

*సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్ ల్యాబ్ మెడిసిన్ విభాగం..

 *మేడ్చల్, మల్కాజ్ గిరిలో బయోగ్నోసిస్ టెక్నాలజీస్..

 * బంజారా హిల్స్‌లో టెనెట్ డయాగ్నోస్టిక్స్

* మాదాపూర్‌లోని మ్యాప్మిజెనోమ్ ఇండియా లిమిటెడ్.. 

* బంజారా హిల్స్‌లోని విరించి హాస్పిటల్

 * సికింద్రాబాద్లోని కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్

* లెప్రా సొసైటీ-బ్లూ పీటర్ పబ్లిక్ హెల్త్ అండ్ రీసెర్చ్ సెంటర్, చర్లపల్లి

* సికింద్రాబాద్‌లోని లూసిడ్ మెడికల్ డయాగ్నోస్టిక్స్ 

* బంజారా హిల్స్‌లోని స్టార్ హాస్పిటల్‌ లో ల్యాబ్ 

వీటితో పాటు ప్రభుత్వ రంగంలోని ఆస్పత్రులు, ల్యాబ్స్ ఇవే!

 * గాంధీ మెడికల్ కాలేజీ, సికింద్రాబాద్

* ఉస్మానియా మెడికల్ కాలేజ్, హైదరాబాద్

*  సర్ రోనాల్డ్ రాస్ ఆఫ్ ట్రాపికల్ & కమ్యూనికేషన్ డిసీజెస్, హైదరాబాద్

* నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాద్

* ఇనిస్టిట్యూట్ ఆఫ్  ప్రివెంటివ్ మెడిసిన్ హైదరాబాద్

* ESIC మెడికల్ కాలేజ్, హైదరాబాద్

* కాకతీయ మెడికల్ కాలేజీ, వరంగల్

* సెంటర్ ఫర్ సెల్యులార్ & మాలిక్యులర్ బయాలజీ, హైదరాబాద్

* సెంటర్ ఫర్ డిఎన్ఎ ఫింగర్ ప్రింటింగ్ & డయాగ్నోస్టిక్స్, హైదరాబాద్ 

* రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆదిలాబాద్

 

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   an hour ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   an hour ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   2 hours ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   2 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   4 hours ago


hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

   17 minutes ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   7 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   20 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle