newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో కరోనా... నివ్వెరపరిచే సీసీఎంబీ పరిశోధన ఫలితాలు

20-08-202020-08-2020 14:35:08 IST
2020-08-20T09:05:08.721Z20-08-2020 2020-08-20T09:05:01.501Z - - 20-04-2021

తెలంగాణలో కరోనా... నివ్వెరపరిచే సీసీఎంబీ పరిశోధన ఫలితాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో మొత్తం కరోనా కేసులు ఎన్ని? అదేంటి వైద్యారోగ్యశాఖ ఇస్తున్న నివేదిక చూడడం లేదా అనకండి. అన్నీ కలిపితే ఇప్పటివరకూ నమోదైన కేసులు లక్షకు లోపే కానీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సీసీసీఎంబీ, ఐఐసీటీల సంయుక్త పరిశోధనలో నివ్వెరపోయే విషయాలు బయటపడ్డాయి. తెలంగాణలో మురుగునీరు, వ్యర్థాల ఆధారంగా అంచనా వేస్తే ఆరులక్షల 60 వేలకు పైగానే కేసులు నమోదయ్యాయని తేలింది. అయితే మురుగునీటి ద్వారా వైరస్‌ వ్యాపించదని తెలుస్తోంది. 

హైదరాబాద్‌లో దాదాపు 6.6 లక్షల మందికి కరోనా వచ్చివెళ్లిపోయిందిట. కరోనా లక్షణాలు ఏవీ లేకపోవడంతో తమకు వైరస్‌ సోకిన విషయం కూడా చాలామందికి తెలియదంటున్నారు పరిశోధకులు. హైదరాబాద్‌లో కోవిడ్‌ కేసుల సంఖ్యపై సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) జరిపిన అధ్యయనంలో ఆసక్తికరమైన, ఒకింత ఆశ్చర్యానికి గురిచేసే విషయాలు వెలుగు చూశాయి.

శాస్త్రవేత్తలు నగరంలోని మురుగునీటి శుద్ధి కేంద్రాల నుంచి మానవ వ్యర్థాలు, నీటి నమూనాలు సేకరించి విశ్లేషించడంతో ఈవిభ్రాంతికరమయిన అంశాలు బయటపడ్డాయి. దాదాపు 2 లక్షల మందికి పైగా ఈ వైరస్‌ బారిన పడ్డట్టు గుర్తించారు. అయితే, నగర జనాభా ద్వారా విసర్జితమయ్యే మురుగులో 40 శాతం మాత్రమే శుద్ధి కేంద్రాలకు చేరుతోంది కాబట్టి.. మిగిలిన మురుగునూ లెక్కలోకి తీసుకుంటే సుమారు 6.6 లక్షల మందిలో వైరస్‌ ఉంటుందని అంచనా వేశారు. వీరిలో ఇప్పటికే అధికశాతం మంది వైరస్‌ నుంచి కోలుకున్నారని, ప్రస్తుతం కొద్ది శాతం మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

కరోనా బాధితుల దగ్గు, తుమ్ముల ద్వారా వైరస్‌ ఇతరులకు వ్యాప్తిస్తుంది. అయితే వీటితోపాటు మలమూత్రాల ద్వారా కూడా వైరస్‌ పరిసరాల్లోకి చేరుతుంది. వైరస్‌ బారినపడ్డ తరువాత కనీసం 35 రోజుల వరకు వీరు వైరస్‌ అవశేషాలను వ్యర్థాల ద్వారా బయటకు వదులుతుంటారు. ఈ కారణంగానే సూక్ష్మజీవుల ద్వారా వచ్చే వ్యాధులు ఎంత మేరకు విస్తరించాయో తెలుసుకునేందుకు మురుగునీటి విశ్లేషణ చేస్తారు నిపుణులు. 

సీసీఎంబీ, ఐఐసీటీ సంయుక్తంగా హైదరాబాద్‌లో ఎంతమందిలో వైరస్‌ ఉందో సుమారుగా తెలుసుకునేందుకు పరిశోధన చేపట్టగా అనేక అంశాలు బయటపడ్డాయి. హైదరాబాద్‌లో రోజుకు 180 కోట్ల లీటర్ల నీరు వినియోగిస్తున్నారు. 40 శాతం నీటిని వేర్వేరు ప్రాంతాల్లోని మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేస్తుంటారు. వీటిల్లో ప్రధానమైన కొన్ని కేంద్రాల నుంచి సీసీఎంబీ, ఐఐసీటీలు మురుగునీటి నమూనాలు సేకరించి పరిశీలించాయి. శుద్దిచేయడానికి ముందు మానవ శరీరంనుంచి వచ్చే వ్యర్ధాలలో కరోనా ఆనవాళ్లు కనిపించగా.. శుద్ధి తరువాత మాత్రం అవి కనుమరుగయ్యాయి.

ఈ పరిశోధన ద్వారా నగరంలో రెండు లక్షల మందికి వైరస్‌ సోకింది. శుద్ధిచేయని మురుగునీటిని కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ సంఖ్య 6.6 లక్షల వరకు ఉండవచ్చునని సీసీఎంబీ, ఐఐసీటీ అంచనా వేశాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఇప్పటివరకు కోవిడ్‌ బారినపడ్డ వారు 46,425 మందే. హైదరాబాద్‌లో సుమారు 6.6 లక్షల మంది కరోనా వైరస్‌ బారినపడి ఉండవచ్చునని తమ పరిశోధన చెబుతోందని.. వీరిలో లక్షణాలు లేనివారు, తత్ఫలితంగా ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం రానివారే అధికంగా ఉండి ఉండవచ్చునని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. లక్షణాల్లేని వారు ఎక్కువగా ఉండటం వల్లే ఆసుపత్రుల్లో రద్దీ సాపేక్షంగా తక్కువగా ఉందని, పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రజారోగ్య వ్యవస్థలకు వీలైందని చెప్పారు. కరోనా తీవ్రంగా వుంటే ప్రభుత్వాసుపత్రులు, ప్రైవేటు ఆస్పత్రులు ఖాళీగా వుండేవి కావన్నమాట. మొత్తం మీద ఈ పరిశోధనను బట్టి ఈ వైరస్ కనబడకుండానే కల్లోలం రేపుతోంది. బయటపడని లక్షణాలతోనే ఇంతమంది వుంటే పరీక్షలు చేయించుకునేందుకు ఆర్థిక స్థోమత లేక సాధారణ జలుబు, తుమ్ములు,దగ్గు, జ్వరాన్ని పట్టించుకోకుండా తిరిగేవారు ఇంకెంతమంది ఉంటారో కదా. 

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   14 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   14 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   18 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   19 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   15 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   a day ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   a day ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   14 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   16 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle