newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ ...పెరిగిన పాజిటివ్ కేసులు

18-08-202018-08-2020 10:27:06 IST
Updated On 18-08-2020 11:04:15 ISTUpdated On 18-08-20202020-08-18T04:57:06.702Z18-08-2020 2020-08-18T04:56:11.323Z - 2020-08-18T05:34:15.254Z - 18-08-2020

తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ ...పెరిగిన పాజిటివ్ కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక వైపు భారీవర్షాలు, కరోనా కేసులతో తెలంగాణ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రెండురోజుల క్రితం వరకూ తగ్గిన పాజిటివ్ కేసులు తాజాగా పెరిగాయి. వైద్య ఆరోగ్యశాఖ తాజాగా బులిటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 1682  కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో ‌హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 235 నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 93,937 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, వైరస్‌ ప్రభావంతో ఇవాళ 8 మంది మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 711కు చేరింది. 

ఇవాళ 2,070 మంది వైరస్‌ బారి నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 72,202 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 21,024 మంది మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఇంట్లో, ఐసోలేషన్‌ కేంద్రాల్లో 14,140 మంది ఉన్నారు. రికవరీలు పెరగడంతో కాస్త వత్తిడి తగ్గుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 19,579 మందికి కొవిడ్ -19 ‌పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 7,72,928 మందికి టెస్టులు చేసినట్లు పేర్కొంది. గడిచిన 24 గంటల వ్యవధిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 235, రంగారెడ్డి జిల్లాలో 166, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి జిల్లాల్లో 106 కరోనా పాజిటివ్ ‌కేసులు నమోదైనట్లు వివరించింది. భద్రాద్రి కొత్తగూడెంలో 27, ఖమ్మంలో 45, వరంగల్‌ అర్బన్‌జిల్లాలో 107, వరంగల్ ‌గ్రామీణ జిల్లాలో 20 చొప్పున, ఆదిలాబాద్‌ జిల్లాలో 18, జగిత్యాల జిల్లాలో 59, జనగామా జిల్లాలో 32, జోగుళాంబా గద్వాల జిల్లాలో 69 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో టెస్టులు తక్కువే.. కేసులు కూడా!

ఈసారి జిల్లాల్లో కేసులు పెరగడం గమనార్హం. నల్గొండ జిల్లాల్లో 38, కామారెడ్డి జిల్లాల్లో 44, సిద్దిపేట జిల్లాల్లో 47, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 47, పెద్దపల్లి జిల్లాల్లో 59, సూర్యాపేట జిల్లాల్లో 39, నిజమాబాద్‌ 94, మహబూబాబాద్‌ జిల్లాల్లో 13, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 32, నారాయణపేట జిల్లాలో 11, కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 9, మెదక్‌ జిల్లాలో 36 కేసులు వచ్చాయి.

ఇటు ములుగు జిల్లాలో 17, నిర్మల్‌ జిల్లాలో 27, సంగారెడ్డి జిల్లాలో 18, వికారాబాద్‌ జిల్లాలో 07, వనపర్తి జిల్లాలో 23, యాదాద్రి భువనగిరి జిల్లాలో 21, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 30, మంచిర్యాల జిల్లాలో 79, కరీంనగర్‌ జిల్లాలో 88, కామారెడ్డి జిల్లాలో 44, భూపాలపల్లి జిల్లాలో 19, జగిత్యాల జిల్లాలో 59, ఆదిలాబాద్‌ జిల్లాలో 18 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వైద్యారోగ్యశాఖ తెలిపింది. 

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   an hour ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   an hour ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   2 hours ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   3 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   4 hours ago


hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

   20 minutes ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   7 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   20 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle