newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో కరోనా కోవిడ్ సెంటర్లివే.. తగ్గని కేసులు

02-09-202002-09-2020 18:22:25 IST
Updated On 02-09-2020 18:43:43 ISTUpdated On 02-09-20202020-09-02T12:52:25.144Z02-09-2020 2020-09-02T12:49:10.562Z - 2020-09-02T13:13:43.204Z - 02-09-2020

తెలంగాణలో కరోనా కోవిడ్ సెంటర్లివే.. తగ్గని కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే వుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వం కోవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. జిల్లాల్లో కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో హైద‌రాబాద్‌లోనే అధికంగా కోవిడ్‌ కేర్‌ సెంటర్లుండగా ప్ర‌స్తుతం అన్ని జిల్లాల్లో నెలకొల్పినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. క‌రీంన‌గ‌ర్ మంథ‌నీలోని జేఎన్‌టీయూ కాలేజి, వ‌రంగ‌ల్ ప‌ర‌కాల‌లోని పాలిటెక్నిక్ కాలేజి, ఖమ్మంలోని శారద ఇంజనీరింగ్‌ కాలేజీ స‌హా ప‌లు స్కూళ్లు, కాలేజీలు, హాస్ట‌ళ్లలో ప్ర‌భుత్వం కోవిడ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేసింది.

తాజాగా తెలంగాణలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,892 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 10 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసులు 1,30,589 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు మరణాల సంఖ్య 846కు చేరుకుంది. ఇక దేశ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 77.02 శాతంగా ఉండగా.. రాష్ట్రంలో 74.5 శాతంగా ఉంది. భారత్‌లో మరణాల రేటు 1.76 శాతంగా ఉండగా.. తెలంగాణలో 0.64 శాతంగా ఉంది. గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 59,491 పరీక్షలు నిర్వహించామని మొత్తం పరీక్షల 14,83,267 కు చేరిందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారిన పడినవారు పలువురు ఇంట్లోనే ఐసోలేషన్‌లో తీసుకుంటున్నారు. వీరంతా అక్కడే కరోనాకు చికిత్స పొందుతున్నారు. అలాంటివారికి ప్రభుత్వం కరోనా కిట్లను అందిస్తోంది. అయితే స్వ‌ల్ప‌ క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌వారు, ఇంట్లో స‌రైన వ‌స‌తి లేనివారు కోవిడ్ కేంద్రాల్లో ఉండవచ్చ‌ని అధికారులు తెలిపారు. అంతేకాకుండా నొవాటెల్, రెడిసిన్, ది మ‌నోహ‌ర స‌హా ప‌లు స్టార్ హ‌ట‌ళ్లు ఇప్ప‌టికే కోవిడ్ కేంద్రాలుగా ఏర్పాట‌య్యాయి.

ఒక్క హైద‌రాబాద్‌లోనే 14 ప్రభుత్వ కోవిడ్‌ కేర్‌ సెంటర్లుండగా, 13 ప్రైవేట్ కేంద్రాలున్నాయి. అయితే ఈ రెండింటిలోనూ వైద్యులు ఎప్ప‌టిక‌ప్పుడూ ప‌ర్య‌వేక్షిస్తూనే ఉంటారు. అంబులెన్స్ సౌక‌ర్యం సైతం అందుబాటులో ఉంటుంది.  ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 31,699 యాక్టివ్‌ కరోనా కేసులుండగా వారిలో 24,598 మంది హోం ఐసోలేష‌న్‌లోనే ఉంటున్నారు. 

జిల్లాల్లోనూ కరోనా వదలడం లేదు. గ్రామాలు, పట్టణాల్లో కరోనా వీరవిహారం చేస్తోంది. గ్రామస్తులను ఆందోళన కలిగిస్తోంది. రెండు రోజుల క్రితం దేవరకద్ర మండలం గోపన్‌పల్లిలో ఏకంగా 40మందికి పాజిటివ్‌ వస్తే.. సోమవారం కోయిలకొండ మండలంలోని వెనకలితండాలో 36మంది, మంగళవారం 27మందికి వైరస్‌ సోకడం స్థానికంగా కలకలం రేపింది. భూత్పూర్‌ మండలంలోని నెహ్రూనగర్‌లోనూ 20మందికి పాజిటివ్‌ వచ్చింది. పల్లెల్లో ఈ వైరస్‌ పెరగడానికి కారణం రోజువారీగా గ్రామం నుంచి పట్టణాలకు రాకపోకలు సాగిస్తున్నందువల్ల కరోనా వస్తోంది. 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   3 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   4 hours ago


ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

   an hour ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   3 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   5 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   6 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   6 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle