newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో కరోనా కేసులు.. తగ్గిన కంటైన్మెంట్ జోన్లు

12-08-202012-08-2020 18:33:16 IST
2020-08-12T13:03:16.441Z12-08-2020 2020-08-12T12:34:44.591Z - - 11-04-2021

తెలంగాణలో కరోనా కేసులు.. తగ్గిన కంటైన్మెంట్ జోన్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. అయితే తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి, మరణాల రేటులో తగ్గుదల కొనసాగుతోంది. అయితే గ్రేటర్ పరిధిలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది. గత నాలుగు రోజులుగా 500 కంటే తక్కువ కేసులు నమోదవుతుండటం ప్రజలకు కాస్త ఊరటను ఇస్తోంది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు తగ్గుతుండటంతో.. కంటైన్మెంట్ జోన్ల సంఖ్య తగ్గుతోంది.

జూలై 30 నాటికి గ్రేటర్ హైదరాబాద్‌లో 92 కంటైన్మెంట్ జోన్లు ఉండగా.. బుధవారం నాటికి 65 కంటైన్మెంట్ జోన్లు మాత్రమే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. రెండు వారాల క్రితం ఎల్బీ నగర్‌లో ఐదు కంటైన్మెంట్ జోన్లు ఉండగా.. ఆ సంఖ్య ఇప్పుడు ఆరుకు చేరింది. క్రమంగా కంటైన్మెంట్ జోన్లు బాగా తగ్గుతున్నాయి. 

గతంలో చార్మినార్ పరిధిలో అత్యధికంగా 31 కంటైన్మెంట్ జోన్లు ఉండేవి. ఇప్పుడు ప్రస్తుతం 15 కంటైన్మెంట్ జోన్లు మాత్రమే ఉన్నాయి. అటు ఖైరతాబాద్‌లో రెండు వారాల క్రితం 14 కంటైన్మెంట్ జోన్లు ఉండగా.. ప్రస్తుతం 21కి పెరిగాయి. సికింద్రాబాద్ జోన్‌లో అయితే ప్రస్తుతం ఐదు కంటైన్మెంట్ జోన్లు.. శేరిలింగంపల్లి జోన్‌లో 10 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. కాగా, గతంలో కూకట్‌పల్లి జోన్‌లో 9 కంటైన్మెంట్ జోన్లు ఉండగా.. ప్రస్తుతం 8 కంటైన్మెంట్ జోన్లు మాత్రమే ఉన్నాయి. కరోనా రికవరీ రేట్లు కూడా బాగా తగ్గాయి.

కరోనా టెస్టులు త్వరగా చేయడానికి అవకాశం కలుగుతోంది. ఈ క్రమంలో ప్రపంచంలోనే వేగవంతమైన కరోనా టెస్ట్‌ కిట్‌ను ప్రముఖ గ్లోబల్‌ బయోటెక్నాలజీ సంస్థ జెన్‌స్క్రిప్ట్ భారత మార్కెట్‌లోకి‌ లాంచ్‌ చేసింది. ఇందుకోసం ప్రేమాస్ లైఫ్ సైన్సెస్‌తో జతకట్టింది. సీ పాస్‌ సార్స్‌ సీవోవీ-2 న్యూట్రలైజేషన్‌ యాంటీబాడీ డిటెక్షన్‌ కిట్‌గా పిలిచే దీనిని సింగపూర్ ఏజెన్సీ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ నుంచి డ్యూక్-ఎన్‌యూఎస్ మెడికల్ స్కూల్ సింగపూర్, డయాగ్నోస్టిక్స్ డెవలప్‌మెంట్ హబ్‌తో కలిసి అభివృద్ధి చేశారు. దీని ద్వారా వేగంగా కరోనా టెస్ట్ చేసుకోవచ్చు. 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   16 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   12 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   14 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   19 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   21 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle