తెలంగాణలో కరోనా ఉధృతికి కారణాలివేనా?
15-05-202015-05-2020 09:13:02 IST
Updated On 15-05-2020 10:49:34 ISTUpdated On 15-05-20202020-05-15T03:43:02.755Z15-05-2020 2020-05-15T03:41:22.985Z - 2020-05-15T05:19:34.230Z - 15-05-2020

వలస కూలీలు.. మర్కజ్ .. ఈరెండింటి చుట్టే తెలంగాణలోని కరోనా కేసులు తిరుగుతున్నాయి. తెలంగాణలో 1414కి చేరాయి కరోనా పాజిటివ్ కేసులు. ఇప్పటివరకూ 34 మంది మరణించారు. గత కొంతకాలంగా రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. దీనికితోడు ఇంతకాలం మర్కజ్ అనుకుంటే ఇప్పు డు వలస కూలీల సమస్య వచ్చిపడిందని మంత్రి ఈటల ఆవేదన చెందుతున్నారు. దీనికి తగ్గట్లుగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికుల్లో కొందరికి పాజిటివ్‌గా తేలింది. మంచిర్యాల, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు లాకడౌన్‌ను ఈ నెల 29 వరకు పొడిగించిన నేపథ్యంలో తాజా పరిస్థితులపై సీఎం భేటీ కానున్నారు. కరోనా నియంత్రణ, లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ సమీక్ష జరుపుతారు. కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో కేసీఆర్ భేటీ అయి తెలంగాణలో సమగ్ర వ్యవసాయ విధానంపై చర్చించనున్నారు. గతంలోనే ఆయన ఈ విషయం ప్రకటించారు. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ లాభ నష్టాలను కూడా బేరీజు వేయనున్నారు. ఏయే రంగాలకు లాభవెూ ఆర్థిక నిపుణులు పరిశీలిస్తున్నారు.రేపటి సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం లాకడౌన్పై తీసుకున్న నిర్ణయాలపై సుధీర్ఘంగా చర్చించనున్నారు. ఈ నెల 19వ తేదీన దేశంలో సరికొత్త రూపంతో 4.0 లాకడౌన్‌ను అమలు చేస్తామని ప్రధాని నరేంద్రవెూడీ వెల్లడించారు. కొత్త లాకడౌన్ నిబంధనలు ఎలా ఉండబోతున్నాయి, దాని పరిణామాలు రాష్ట్ర ప్రయోజనాలకు ఏ మేరకు సహకరిస్తాయన్న అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. తెలంగాణపై విరుచుకుపడుతున్న కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల ఆర్ధిక ప్యాకేజీ, ఎంఎస్ఎంఇలకు ప్రకటించిన రూ.3 లక్షల కోట్ల ప్యాకేజీతో తెలంగాణకు ఏ మేరకు ప్రయోజనం చేకూరనుందన్నది కూడా అధ్యయనం చేస్తున్నారు. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజీలో వివిధ రంగాలకు చేయూతనిచ్చే అంశాలపై కూడా సిఎం కెసిఆర్ కూలంకషంగా చర్చించనున్నారు. కేంద్రం పరిమిత సంఖ్యలో రైళ్లను నడుపుతుండడం వల్ల తలెత్తున్న సమస్యలు చర్చకు రానున్నాయి. దీని వల్ల రాష్ట్రంలో కరోనా వైరస్ పెరగడానికి దారితీస్తున్న పరిస్థితులపై కూడా ఈ సవిూక్షలో లోతుగా చర్చించనున్నారు. ఇదిలా ఉండగా కేంద్రం ఒకవైపు లాకడౌన్‌ను అమలు చేస్తూనే వివిధ రంగాలకు అనేక సండలింపులను ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో కూడా వివిధ రంగాలకు సడలింపులు ఇవ్వడం వాటికి సంబంధించిన నిబంధనలపై చర్చించి ఉన్నతస్థాయి సమావేశంలో సిఎం కెసిఆర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ ఇప్పట్లో తగ్గే అవకాశాలు ఏ మాత్రం కనిపించకపోవడంతో ఇక దానితో కలిసి జీవించే అంశాలపై కూడా లోతుగా సమాలోచనలు చేయనున్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపు యాభై రోజులుగా లాకడౌన్‌ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్నీ గణనీయంగా కోల్పోయింది. ఈ నేపథ్యంలోనే సిఎం కెసిఆర్ ఈ నెల 5వ తేదీన నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వైన్స్ షాపులు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరుచుకునేందుకు అవకాశం కల్పించింది. అలాగే ఆర్టిఎ, స్టాంప్స్ అండ్ రిజిస్టేషన్ శాఖ వంటి శాఖలు కూడా పనిచేస్తాయని సిఎం కెసిఆర్ చెప్పారు. క్రమక్రమంగా రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ తెరుచుకుని, యథావిధిగా విధులను నిర్వహిస్తున్నాయి. ఆదాయ మార్గాలు మరింతగా పెంచుకునేందుకు ఆర్టీసీ బస్సులను నడిపే విషయం లో కూడా సిఎం కెసిఆర్ కీలక నిర్ణయం వెల్లడించనున్నారు. రెండునెలలుగా పెద్దఎత్తున ఆదాయాన్ని కోల్పోతున్న ఆర్టిసిని ఆర్ధిక నష్టాల నుంచి బయటపడేసేందుకు వీలైనంత త్వరగా బస్సులను నడపాలని భావిస్తున్నారు.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
11 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
7 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
9 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
12 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
14 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
15 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
17 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
18 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
19 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
19 hours ago
ఇంకా