newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో కరోనా అదుపు తప్పుతున్నట్లే.. ఒక్క రోజే 499 పాజిటివ్ కేసులు

20-06-202020-06-2020 07:23:34 IST
Updated On 20-06-2020 10:48:53 ISTUpdated On 20-06-20202020-06-20T01:53:34.554Z20-06-2020 2020-06-20T01:53:32.035Z - 2020-06-20T05:18:53.972Z - 20-06-2020

తెలంగాణలో కరోనా అదుపు తప్పుతున్నట్లే.. ఒక్క రోజే 499 పాజిటివ్ కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో శుక్రవారం రికార్డు స్థాయిలో 499 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,526కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. 

శుక్రవారం కరోనాతో ముగ్గురు మరణించగా.. మొత్తం మృతులు సంఖ్య 198గా నమోదైంది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 3,352 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,976 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఒక్కరోజే ఇంత పెద్ద మొత్తంలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 329, రంగారెడ్డి జిల్లాలో 129 ఉన్నాయి.

రాష్ట్రంలో కరోనా కేసులు ఏరోజుకారోజు రికార్డులు దాటిపోతున్నాయి. మరీ ముఖ్యంగా కరోనా టెర్రర్ సృష్టిస్తోంది. తెలంగాణలో శుక్రవారం ఒక్క రోజే 499 కొత్త కరోనా కేసులు రికార్డయ్యాయి. ఈ కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 6,525కి పాజిటివ్‌ కేసులు చేరాయి. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి 198 మందిని పొట్టన పెట్టుకుంది. అధికారులు లెక్కల ప్రకారం 2976 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 3352 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 129 కరోనా కేసులు నమోదయ్యాయి.

Telangana Has 499 New Positive COVID 19 Cases And Total Cases Are ... 

ఈ కేసులు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌ను వణికిస్తున్నాయి. గురువారం 302 కేసులు నమోదయ్యాయి. నిన్నటి రికార్డును ఇవాళ బద్దలు కొడుతూ హైదరాబాద్‌లో 329 కేసులు నమోదయ్యాయి. ఒకే రోజు ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. 

రెండు రోజులుగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 300 మార్కును కరోనా కేసులు దాటేస్తున్నాయి. ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో 4526కు కరోనా కేసులు చేరాయి. దీంతో గ్రేటర్ వాసులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో టెస్టుల సంఖ్య పెంచడంతో కరోనా కేసులూ భారీగా నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. 

తెలంగాణలో ఇప్పటివరకు 50,569 కరోనా టెస్టులు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పుట్టినరోజు, పెళ్లి వేడుకలు, అంత్యక్రియల్లో కరోనా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఏపీలో మరో 376 కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 376 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 6230కు చేరుకుంది. తాజాగా 17,609 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 376 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 

గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 82 మంది కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ కాగా, నలుగురు మరణించారు.దీంతో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 96కు చేరింది.ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని 3065 మంది డిశ్చార్జ్‌ కాగా, ప్రస్తుతం 3069 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి. 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   13 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   13 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   17 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   19 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   14 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   21 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   a day ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   14 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   16 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle