తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!
31-05-202031-05-2020 19:28:08 IST
2020-05-31T13:58:08.372Z31-05-2020 2020-05-31T13:57:20.220Z - - 22-04-2021

కేంద్రం జూన్ 30 వరకూ లాక్ డౌన్ విధించింది. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా లాక్ డౌన్ పొడిగింపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం నిన్న లాక్ డౌన్ 5.0 పై తీసుకున్న నిర్ణయాన్ని ఏకీభవిస్తూ తెలంగాణలో జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే లాక్ డౌన్ నిబంధనలు సడలించింది. కేవలం ఈ లాక్డౌన్ కంటైన్మెంట్ జోన్లకే పరిమితం చేసింది. కేంద్రం కర్ఫ్యూ వేళల్లో సూచించిన మార్పులకు అనుగుణంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ప్యూ వేళల్లో మార్పులు చేసింది. అలాగే అంతరాష్ట్ర రాకపోకలపై నిషేదం ఎత్తివేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక కేంద్రప్రభుత్వ సడలింపులన్ని యథాతథంగా అమలవుతాయని తెలిపింది తెలంగాణ సర్కార్. లాక్ డౌన్ 5.0 లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం సడలింపుల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కంటెయిన్మెంట్ జోన్ల వెలుపల ప్రస్తుత పరిస్థితులు. జూన్ 7వరకు యథాతథంగా కొనసాగుతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆస్పత్రులు,ఔషధ దుకాణాలు మినహా ఇతర దుకాణాలు రాత్రి 8 గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. అంతర్రాష్ట్ర ప్రయాణాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలపై విధించిన ఆంక్షలను ఎత్తివేసింది. ఇక మాల్స్ హోటల్స్ రెస్టారెంట్లలో డైనింగ్ ఫెసిలిటికి కూడా తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో డెలివరీకి మాత్రమే అనుమతినివ్వగా ఇప్పుడు ఆంక్షలు సడలించింది. అయితే సినిమాహాళ్ళు,జిమ్,ఆడిటోరియం,ఫంక్షన్ హాల్స్ పై మాత్రం నిషేధం కొనసాగనుంది. కంటెయిన్మెంట్ జోన్లలో జూన్ నెలాఖరు వరకు లాక్డౌన్ యథాతథంగా అమల్లో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సూచించిన సడలింపులను అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కంటైన్మెంట్ జోన్లలో కట్టుదిట్టంగా లాక్ డౌన్ ను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు కేసీఆర్.

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
6 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
9 hours ago

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
12 hours ago

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
13 hours ago

ఏందయ్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే
13 hours ago

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మరి రాష్ట్రాల మాటేంటి
11 hours ago

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..
21-04-2021

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!
a day ago

కాంగ్రెస్ కి ఇంకా ఆశలు ఉన్నట్లున్నయ్
21-04-2021

తిరుపతి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ తప్పదా
21-04-2021
ఇంకా