newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో ఒక్క రోజే 872 కరోనా కేసులు.. సరికొత్త రికార్డు

23-06-202023-06-2020 09:32:45 IST
Updated On 23-06-2020 10:23:27 ISTUpdated On 23-06-20202020-06-23T04:02:45.363Z23-06-2020 2020-06-23T04:02:33.850Z - 2020-06-23T04:53:27.394Z - 23-06-2020

తెలంగాణలో ఒక్క రోజే 872 కరోనా కేసులు.. సరికొత్త రికార్డు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్రంలో కరోనా కేసులు దడపుట్టిస్తున్నాయి. గత ఐదు రోజులుగా ఏ రోజుకారోజు అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. సోమవారం 3,189 నమూనాలను పరీక్షించగా.. 872 మందికి పాజిటివ్‌ వచ్చింది. అంటే.. 27.34 శాతం పాజిటివ్‌ రేటు. ప్రతి గంటకూ సగటున 36 మంది వైరస్‌ బారిన పడినట్టు. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో ఈస్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో జూన్‌ 6న అత్యధికంగా 33 శాతం పాజిటివ్‌ రేటు నమోదు కాగా.. ఆ తర్వాత ఇదే అత్యధికం.

తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతుండటం రాష్ట్ర ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో సోమవారం కొత్తగా 872 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,674కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. 

రాష్ట్రంలో ఇప్పటివరకు 4,005 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. నేడు కరోనాతో మరో 7 మంది మృతిచెందడంతో మొత్తం మృతుల సంఖ్య 217గా నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,452 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 713 ఉన్నాయి.

రాష్ట్రంలో సోమవారం నమోదైన 872 కేసుల్లో అత్యధికంగా 713 ఒక్క గ్రేటర్‌లో నమోదైనవే. అమీర్‌ పేట ప్రాంతానికి చెందిన కార్పొరేటర్‌కు కూడా వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. రంగారెడ్డిలో 107, మేడ్చల్‌లో 16, సంగారెడ్డిలో 12, వరంగల్‌ రూరల్‌లో 6, మంచిర్యాలలో 5, మెదక్‌, కామారెడ్డిలలో 3, జనగాం, మహబూబాబాద్‌, కరీంనగర్‌లలో రెండేసి చొప్పున, వరంగల్‌ అర్బన్‌లో ఒక కేసు నమోదయ్యాయి. 

వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8674కు చేరింది. కాగా, ఈ నెలలో ఇప్పటివరకూ 5976 కేసులు నమోదయ్యాయి. సోమవారం 274 మంది డిశ్చార్జ్‌ అయ్యి ఇళ్లకు చేరుకున్నారు. దీంతో కోలుకున్నవారి సంఖ్య 4005కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4452 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక మరణాల విషయానికి వస్తే.. కరోనా కారణంగా సోమవారం ఏడుగురు కన్నుమూశారు. దీంతో మరణాల సంఖ్య 217కు చేరింది. 

టెస్టులు పెరిగే కొద్దీ..పాజిటివ్ రేటు వృద్ధి

రాష్ట్రంలో టెస్టులు పెరిగే కొద్దీ పాజిటివ్‌ రేటు భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఉదాహరణకు.. శనివారం పాజిటివ్‌ రేటు 17 శాతం ఉండగా, ఆదివారం అది 22 శాతంగా, సోమవారం 27.34 శాతంగా నమోదైంది. గత ఐదు రోజుల సగటు చూస్తే.. 22 శాతంగా నమోదు అయింది. జూన్‌ 17న రాష్ట్రంలో కేసుల సంఖ్య 5675 ఉండగా, జూన్‌ 22 నాటికి అది 8674కు చేరింది. కేవలం ఆరు రోజుల్లో 2999 కొత్త కేసులు. 

కరోనాపై పోరులో తొలివరుస యోధులైన పోలీసులు, వైద్యులపై కరోనా పంజా విసురుతోంది. కరోనా బారిన పడిన కాలాపత్తర్‌ ఏఎస్సై (47) గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారంమరణించారు. దీంతో, కరోనాతో మృతి చెందిన పోలీసుల సంఖ్య ఐదుకు చేరింది. ఇప్పటికే పోలీసుల్లో 180 మందికి పైగా కరోనా బారిన పడడం.. వారిలో ఐదుగురు మరణించడం ఖాకీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. అలాగే.. వైద్యులు కూడా భారీగా వైరస్‌ బారిన పడుతున్నారు. తాజాగా వరంగల్‌ ఎంజీఎంలో ఏడుగురు పీజీ వైద్యులకు వైరస్‌ సోకింది. 

ఏపీలో కొత్తగా 443 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం కొత్తగా 443 కరోనావైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,372కి చేరింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 16,704నమూనాలు పరీక్షించగా 443 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 44 మందికి, విదేశాల నుంచి వచ్చిన 7 మందికి కరోనా సోకినట్లు హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది.

గడిచిన 24 గంటల్లో 83 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 4435కు చేరుకుంది. కరోనాతో ఇవాళ ఐదుగురు మరణించడంతో మృతుల సంఖ్య 111కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4826 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle