newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో ఒక్కరోజే 199 కేసులు.. అదుపు తప్పుతున్న తెలుగు రాష్ట్రాలు

01-06-202001-06-2020 08:46:56 IST
Updated On 01-06-2020 09:38:13 ISTUpdated On 01-06-20202020-06-01T03:16:56.712Z01-06-2020 2020-06-01T03:16:54.409Z - 2020-06-01T04:08:13.668Z - 01-06-2020

తెలంగాణలో ఒక్కరోజే 199 కేసులు.. అదుపు తప్పుతున్న తెలుగు రాష్ట్రాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 199 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2698 కి చేరింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 122, రంగారెడ్డి 40, మేడ్చల్‌ 10, ఖమ్మం 9, మహబూబ్‌నగర్‌, మెదక్‌, జగిత్యాలలో 3 చొప్పున, వరంగల్ అర్బన్‌ 2, సూర్యాపేట, నిర్మల్, యాదాద్రి, జనగాంలో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్టు ప్రజారోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. వలసదారుల్లో ముగ్గురికి కరోనా నిర్ధారణ అయినట్టు వెల్లడించారు. ఇవాళ ఐదుగురు కరోనా బాధితులు ప్రాణాలు విడువడంతో.. మొత్తం మృతుల సంఖ్య 82కు చేరింది. తాజాగా 16 మంది కోలుకోవడంతో.. వైరస్‌ బారినపడి కోలుకున్నవారి మొత్తం సంఖ్య  1428 కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 1188 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ అధికారులు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు.

లాక్ డౌన్ సడలించిన కారణంగా తెలంగాణలో కరోనా వైరస్ కేసులు పెరగడం సహజ పరిణామమేనని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించిల 24 గంటలు కాకముందే తెలంగాణలో కరోనా కేసులు పోటెత్తుతుండటం విశేషం. పైగా రాష్ట్రంలో కరోనా కేసులు 12 జిల్లాలకు పాకాయి. ఇంతవరకు ఒక్క కేసుకూడా నమోదు కాని రెండు జిల్లాల్లో కూడా తాజాగా కోవిడ్-19 కేసులు నమోదు కావడం గమనార్హం. ఆదివారం వలసదారుల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. మొత్తం మీద తెలంగాణ ఆదివారం కరోనా కేసుల విషయంలో ఏపీని అవలీలగా అధిగమించేసింది.

ఏపీలో ప్రమాద ఘంటికలు.. రోజుకు వందకేసులు

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాష్ట్రంలో కరోనా అదుపు తప్పుతోంది. నానాటికీ వైరస్‌ విజృంభిస్తూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గత 5రోజుల నుంచి సగటున రోజూ వందకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇదే సమయంలో లాక్‌డౌన్‌ సడలింపులతో వైద్యవర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మార్చిలో రాష్ట్రంలోకి ప్రవేశించిన నాటినుంచి పరిశీలిస్తే ప్రతి నెలా కేసుల సంఖ్య భారీగా పెరుగుతూనే ఉంది. మార్చి 13న నెల్లూరులో తొలి కరోనా కేసు నమోదయింది. ఆ నెల 31వరకూ రాష్ట్రంలో కేవలం 44 కేసులు నమోదయ్యాయి. తర్వాత ఏప్రిల్‌ 30నాటికి వాటి సంఖ్య 1,403కి చేరింది. అంటే ఒక్క ఏప్రిల్‌లోనే 1,359మందికి వైరస్‌ సోకింది. ఇక మే నెలలో ఏకంగా 2,168 కేసులు వెలుగులోకి వచ్చాయి. వీరిలో విదేశాల నుంచి వచ్చిన 111మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 418మంది ఉన్నారు.

లాక్‌డౌన్‌ పూర్తిస్థాయిలో అమలులో ఉండగానే 80రోజుల వ్యవధిలో రాష్ట్రంలో కేసుల సంఖ్య 3వేలు దాటేసింది.ఇప్పుడు ప్రభుత్వం లాక్‌డౌన్‌కు భారీ సడలింపులు ఇచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి కూడా అనుమతులు ఇస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వరుసగా ఐదు రోజుల నుంచి 134, 128, 85, 131, 110 కేసులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌కు సడలింపులు ఇస్తే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఏపీలోని దాదాపు అన్ని జిల్లాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. కర్నూలులో అత్యధికంగా 700మందికి పైగా వైరస్‌ సోకింది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో 5 రోజుల వ్యవధిలో సుమారు 120 కేసులు బయటపడ్డా యి. ఇదంతా ఆరోగ్యశాఖ విడుదల చేస్తున్న లెక్కలు మాత్రమే. ఇవికాకుండా మరిన్ని కేసులు ఉంటాయని సమాచారం. విజయనగరం, ప్రకాశం మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో వంద కేసులు పైగా నమోదయ్యా యి. ఢిల్లీ మర్కజ్‌ వల్ల కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కేసులు భారీగా పెరిగాయి. శ్రీకాళహస్తి ఉదంతంతో చిత్తూరులో కేసులు అధికంగా నమోదయ్యాయి. తూర్పుగోదావరి, నెల్లూరు, చిత్తూరులో జిల్లాల్లో కో యంబేడు కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే కరోనా ఇప్పట్లో అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. తొలి 500 కేసుల నమోదుకు మాత్రం 33 రోజులు వ్యవధి పట్టింది. ఆ తర్వాత ప్రతి 500 కేసులు కేవలం సగటున 9 రోజుల వ్యవధిలోనే నమోదయ్యా యి. ఏప్రిల్‌ 20 నుంచి మే 5వరకూ రాష్ట్రంలో కరోనా బీభత్సం సృష్టించింది. మళ్లీ అలాంటి పరిస్థితి ఇప్పుడు మొదలయింది. మే 24నుంచి కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. జూన్‌లో పరిస్థితి అదుపు తప్పేలా కనిపిస్తోందని, 15 తర్వాత 500 కేసుల మార్కును దాటేసే అవకాశాలున్నాయని నిపుణులు నిర్ధారిస్తున్నారు. 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   13 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   9 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   11 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   16 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   18 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   19 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle