newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

తెలంగాణలో ఎమ్మెల్యేలను వదలని కరోనా వైరస్

15-06-202015-06-2020 08:52:25 IST
Updated On 15-06-2020 11:19:03 ISTUpdated On 15-06-20202020-06-15T03:22:25.550Z15-06-2020 2020-06-15T03:22:16.323Z - 2020-06-15T05:49:03.053Z - 15-06-2020

తెలంగాణలో ఎమ్మెల్యేలను వదలని కరోనా వైరస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే వుంది. తెలంగాణా కరోనా పాజిటివ్ కేసులు 237 నమోదయ్యాయి. పాజిటివ్ కేసులు హైదరాబాద్ లో 195గా వున్నాయి. కరోనా వల్ల ముగ్గురు మృతి చెందగా.. ఇప్పటి వరకు 185 మంది మృతి చెందారు. గ్రేటర్లోనే కేసులు ఎక్కువగా నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. తెలంగాణలో కరోనా రక్కసి ప్రజాప్రతినిధులను కూడా వదలడంలేదు. తాజాగా, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కరోనా బారినపడ్డారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది.

దాంతో ఆయన చికిత్స కోసం హైదరాబాదు బయల్దేరారు. ఎమ్మెల్యేకి కరోనా నిర్ధారణ కావడంతో ఆయన కుటుంబసభ్యులకు పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, తెలంగాణలో కరోనా సోకిన రెండో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. ఇంతకుముందు జనగాం శాసనసభ్యుడు ముత్తిరెడ్డికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.

ఇంతకుముందే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. వారం రోజుల క్రితం జలుబు, దగ్గు రావడంతో ముత్తిరెడ్డి  వైద్యులను సంప్రదించారు. ఈనెల 11వ తేదీన ప్రైవేట్‌ ఆస్పత్రిలో కరోనా పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలింది. దీంతో అదే ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కాగా, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడం రాష్ట్రంలో ఇదే తొలికేసు. మరోవైపు తాను ఆరోగ్యంగానే ఉన‍్నానని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముత్తిరెడ్డి భార్య నియోజకవర్గ ప్రజలకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు.

హైదరాబాద్ లోని ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా మహమ్మారి ప్రవేశించింది. రోజుకో డిపార్ట్ మెంట్లో కరోనా బయటపడుతోంది. మేయర్ బొంతు రామ్మోహన్ రెండవసారి కరోనా టెస్ట్ చేయించుకున్నారు. నెగిటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. జీహెచ్ఎంసీ హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగికి పాజిటివ్ రావటంతో ఆ ఫ్లోర్ లో కూడా ఉద్యోగులు విధులకు రావటం లేదు.

మిగతా ఫ్లోరలో కూడా ఉద్యోగులు భయం భయంగానే విధులకు హాజరవుతున్నారు. సీఎంవో  కార్యాలయం కూడా మూసేశారు. 30 మందికి టెస్టులు చేశారు. బేగంపేట మెట్రో కార్యాలయంలో కొనసాగుతున్న సీఎంవోలో ఓ ఉన్నతాధికారి పీఏకు పాజిటివ్ రావటంతో ఆ భవనం మొత్తాన్ని మూసేశారు. కొన్ని రోజుల పాటు డ్యూటీలకు రావొద్దని ఉద్యోగులను ఆదేశించారు. అధికారులు కూడా ఇంటి నుంచే ఫైళ్లు క్లియర్  చేస్తున్నారు.

మంత్రి హరీశ్ రావు పీఏకు పాజిటివ్ రావడంతో ఆయన హోం క్వారంటైన్ కు వెళ్లారు.  తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కరోనా ఎఫెక్ట్ ఎక్కువగానే ఉంది. ఇప్ప టికే యాదాద్రి జెడ్పీ సీఈవోకు పాజిటివ్ రావడంతో హోం క్వారంటైన్ లో ఉన్నారు. యాదాద్రి కలెక్టర్  అనితా రామచంద్రన్ కూడా ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు.

సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామి రెడ్డి ఏర్పాటు చేసిన మీటింగ్ కు హాజరైన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. కలెక్టర్   ముందు జాగ్రత్తగా హోం క్వారంటైన్ కు వెళ్లారు. ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ రెండు జిల్లాల కలెకరేట్లలో ఉద్యోగుల హాజరు కూడా తగ్గిపోయింది.  ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గన్ మెన్ కు పాజిటివ్ రావటంతో ఆయన కార్యాలయానికి రానని, వారం పాటు కమిషన్ కార్యాలయం మూసేస్తున్నట్లు ప్రకటించారు. 

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

   3 hours ago


ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

   5 hours ago


సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

   7 hours ago


బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

   8 hours ago


పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

   8 hours ago


థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

   9 hours ago


కక్షసాధింపు ఏమాత్రం కాదు..

కక్షసాధింపు ఏమాత్రం కాదు..

   9 hours ago


తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

   9 hours ago


నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

   13-06-2021


జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

   13-06-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle