newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

తెలంగాణలో ఇక పెద్ద‌న్న పాత్ర‌ బీజేపీదే..!

10-11-201910-11-2019 09:09:29 IST
2019-11-10T03:39:29.374Z10-11-2019 2019-11-10T03:39:11.769Z - - 22-02-2020

తెలంగాణలో ఇక పెద్ద‌న్న పాత్ర‌ బీజేపీదే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయంగా ఎద‌గాల‌ని భావిస్తున్నా భార‌తీయ జ‌న‌తా పార్టీ వేగం పెంచింది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్ కంటే ప్ర‌భుత్వ వ్య‌తిరేఖ‌ ఆందోళ‌న‌ల్లో ముందుంటోంది. ప్ర‌భుత్వంపై పోరాడాల్సిన కాంగ్రెస్ అంత‌ర్గ‌త క‌ల‌హాలు, స‌రైన మార్గ‌ద‌ర్శ‌కం లేక స‌త‌మ‌త‌మ‌వుతుండ‌గా బీజేపీ మాత్రం స‌మ‌స్య ఉన్న ప్ర‌తీ చోట పోరాటానికి సై అంటోంది.

ఇప్ప‌టికే వ‌రుస చేరిక‌ల‌తో తెలంగాణ‌లో బీజేపీ బ‌లం పుంజుకుంటోంది. ఇదే స‌మ‌యంలో ప్ర‌జా ఉద్య‌మాల్లోనూ దూకుడుగా వెళుతోంది. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల స‌మ్మె ప్ర‌ధాన స‌మ‌స్య‌గా ఉంది. 37 రోజులుగా జ‌రుగుతున్న ఆర్టీసీ కార్మికుల‌కు టీఆర్ఎస్‌, ఎంఐఎం మిన‌హా అన్ని పార్టీలూ మ‌ద్ద‌తు ఇచ్చాయి. ప్ర‌జ‌ల్లోనూ కార్మికుల‌కు మ‌ద్ద‌తు ల‌భిస్తోంది.

అన్ని పార్టీలూ మ‌ద్ద‌తు ఇస్తున్నా బీజేపీ ఆర్టీసీ కార్మికుల‌కు ఎక్కువ‌గా అండ‌గా నిలుస్తోంది. స‌మ్మె మొద‌లైన నాటి నుంచీ బీజేపీ ఆర్టీసీ కార్మికుల ఆందోళ‌న‌ల్లో చురుగ్గా పాల్గొంటోంది. ఎక్క‌డిక‌క్క‌డ ఆందోళ‌న‌లు జ‌రుపుతోంది. క‌రీంన‌గ‌ర్‌లో అయితే ఆ పార్టీ ఎంపీ బండి సంజ‌య్ కార్మికుల త‌ర‌పున ఆందోళ‌న‌లో పాల్గొని పోలీసుల దాడికి సైతం గుర‌య్యారు.

ఇక‌, ఆర్టీసీ కార్మిక జేఏసీ పిలుపునిచ్చిన ఛ‌లో ట్యాంక్ బండ్‌ విజ‌య‌వంత‌మైంది. నిర్భందాలు, ఆంక్ష‌లు ఉన్నా ఆర్టీసీ కార్మికులు, వివిధ పార్టీల నేత‌లు ట్యాంక్ బండ్‌పైకి చేరుకోగ‌లిగారు. ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం అవ‌డంలోనూ బీజేపీ కీల‌కంగా క‌నిపిస్తోంది. బీజేపీ ఎంపీ స‌హా చాలా మంది నేత‌లు, క్యాడ‌ర్ ఆర్టీసీ కార్మికుల‌కు మ‌ద్ద‌తుగా ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు.

అన్ని పార్టీలూ ఆర్టీసీ కార్మికుల‌కు మ‌ద్ద‌తుగా ఆందోళ‌న‌ల్లో పాల్గొంటున్నా బీజేపీ త‌మ స్వంత పార్టీ కార్య‌క్ర‌మం అన్న‌ట్లుగా, మొక్కుబ‌డిగా కాకుండా ఆర్టీసీ కార్మికుల ప‌క్షాన పోరాడుతోంది. ఇదే స‌మ‌యంలో ఈ పోరాటంలో ముందుండాల్సిన కాంగ్రెస్ మాత్రం కొంచెం వెనుక‌బ‌డింది. హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక త‌ర్వాత పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి యాక్టీవ్‌గా లేరు.

ఇక‌, కీల‌క నేత‌లు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, రేవంత్ రెడ్డి అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. బీజేపీ కేంద్రంలోనూ అధికారంలో ఉండ‌టంతో ఆర్టీసీ జేఏసీ నాయ‌కుల‌కు ఆ పార్టీ అండ‌గా ఉండ‌టంతో బ‌లంగా ముందుకెళుతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు జేఏసీ నాయ‌కులు బీజేపీ నేత‌ల‌తో స‌మావేశ‌మై తాజా ప‌రిణామాల‌పై చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.

అంద‌రి ఉద్యోగాలు తీసేస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్పినా కార్మికులు వెన‌క్కు త‌గ్గ‌క‌పోవ‌డానికి బీజేపీ త‌మ‌కు అండ‌గా ఉంటుంద‌నే న‌మ్మ‌కం ప్ర‌ధాన కార‌ణం. త్వ‌ర‌లోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా ఆర్టీసీ జేఏసీ నేత‌లు క‌లిసి స‌మ్మె, త‌ర్వాతి పరిణామాల‌ను వివ‌రించే అవ‌కాశం ఉంది. మొత్తంగా బీజేపీ దూకుడు చూస్తుంటే కాంగ్రెస్‌ను వెన‌క్కు నెట్టేయ‌డానికి ఎక్కువ స‌మ‌యమేమీ ప‌ట్టేలా లేదు.

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   an hour ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   2 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   3 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   4 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   4 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   5 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   6 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   7 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   7 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   8 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle