newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో ఇక ఎడాపెడా టెస్టులు.. ఏడులక్షల టెస్టులకు రెడీ!

23-07-202023-07-2020 07:51:14 IST
Updated On 23-07-2020 08:03:11 ISTUpdated On 23-07-20202020-07-23T02:21:14.975Z23-07-2020 2020-07-23T01:49:48.627Z - 2020-07-23T02:33:11.209Z - 23-07-2020

తెలంగాణలో ఇక ఎడాపెడా టెస్టులు.. ఏడులక్షల టెస్టులకు రెడీ!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్రవ్యాప్తంగా జ్వరం వచ్చిన వారందరినీ గుర్తించి త్వరగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించాలని ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య, ఆరో గ్య శాఖ కార్యదర్శి ముర్తజా రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ కరుణాకర్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ జ్వరం వచ్చిన వారిని వీలైనంత త్వరగా గుర్తించి పరీక్షలు చేయించాలన్నారు. త్వరగా వైరస్‌ నిర్ధారణ జరిగితే ప్రాణ నష్టం జరగకుండా చూడవచ్చన్నారు.  

రాష్ట్రవ్యాప్తంగా ఏడు లక్షల ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కరోనా టెస్ట్‌లు చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ భారీ ఏర్పాట్లు చేసింది. మొదట్లో 2 లక్షల కిట్లు తెప్పించగా, ఆ తర్వాత ఇప్పుడు విడతల వారీగా మరో ఐదు లక్షల యాంటిజెన్‌ కిట్లను తెప్పించింది. జ్వరం వచ్చిన వారందరికీ యాంటిజెన్‌ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటివరకు 65 వేల యాంటిజెన్‌ టెస్టులు నిర్వహించినట్లు వైద్య,ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)లో కరోనా టెస్టులు ప్రారంభం అయినట్లు అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఆర్టీపీసీఆర్‌ టెస్టులతో చాలా ఆలస్యం అవుతోంది. వాటి ఫలితాల కోసం కనీసం రెండు మూడు రోజుల పాటు ఎదురుచూడాల్సి వస్తోంది. దాంతో ఆర్టీపీసీఆర్‌ కంటే యాంటిజెన్‌ టెస్టులకే సర్కారు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో కేవలం అరగంటలోనే ఫలితం వస్తుంది. దాంతో కరోనా సోకిన వారిని వెంటనే గుర్తించి, ఐసోలేషన్‌ చేసేందుకు వీలు కలుగుతుంది. అందుకే ఆర్టీపీసీఆర్‌ స్థానంలో యాంటిజెన్‌ టెస్టులను విస్తృతంగా చేయనున్నారు. ప్రస్తుతం రోజుకు సగటున 13–14 వేల మధ్య టెస్టులు చేస్తున్నారు. వాటిలో 90 శాతం మేరకు యాంటిజెన్‌ పరీక్షలే ఉంటున్నాయి.  

యాంటిజెన్‌ టెస్టులకు డిమాండ్‌ పెరగడంతో వాటిని ప్రైవేట్‌లోనూ నిర్వహించేందుకు ఐసీఎంఆర్‌ అనుమతి ఇచ్చింది. అందుకోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో రాష్ట్రంలో అర్హత కలిగిన అన్ని ఆసుపత్రులు, డయాగ్నొస్టిక్‌ సెంటర్లలోనూ యాంటిజెన్‌ పరీక్షలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. పైగా అత్యవసర సర్జరీలకు ముం దు యాంటిజెన్‌ టెస్టులు తప్పనిసరిగా చేయాల్సి ఉన్నందున సర్కారు కూడా అంగీకారం తెలిపింది. అయితే పాజిటివ్‌ కేసుల వివరాలను వైద్య ఆరోగ్యశాఖకు తెలియజేయాల్సి ఉంటుంది.    

 

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   an hour ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   an hour ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   2 hours ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   3 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   4 hours ago


hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

   26 minutes ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   7 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   20 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle