newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో ఆరో కరోనా పాజిటివ్ కేసు

18-03-202018-03-2020 15:21:30 IST
Updated On 18-03-2020 15:45:41 ISTUpdated On 18-03-20202020-03-18T09:51:30.318Z18-03-2020 2020-03-18T09:51:24.695Z - 2020-03-18T10:15:41.049Z - 18-03-2020

తెలంగాణలో ఆరో కరోనా పాజిటివ్ కేసు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనాను నియంత్రించేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా కరోనా మాత్రం విజృంభిస్తూనే వుంది. తాజాగా ఆరవ కేసు పాజిటివ్‌గా తేలింది.  ఇటీవలే యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్‌ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రపంచవ్యాప్తంగా లక్షా 90 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 7,900 మందికి పైగా మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల్లో 80 వేల మంది ఇప్పటికే కోలుకున్నారు. ఇక భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు 137కు పైగా నమోదుకాగా ముగ్గురు మరణించారు. హైదరాబాద్ లో అన్ని ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి నిరోధానికి చర్యలు చేపట్టారు. అయితే తెలంగాణ సచివాలయంలో మాత్రం ఉద్యోగులు  బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. కనీసం తమకు హ్యాండ్ శానిటైజర్లు కూడా లేవని ఉద్యోగులు అంటున్నారు.  

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 1,83,579 పాజిటివ్‌ కేసులు నమోదవగా 7,900 మందికి పైగా మరణించారు. పాకిస్తాన్‌లో 212 కేసులు నమోదు కాగా బుధవారం తొలి మరణం నమోదైంది. వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న ఇరాన్‌లో కరోనా కేసుల సంఖ్య 988కి పెరగ్గా 135 మంది మరణించారు. స్సెయిన్‌లో తాజాగా 2000 కొత్త కేసులు నమోదవగా మొత్తం పాజిటివ్‌ కేసుట సంఖ్య ఏకంగా 11,000కు ఎగబాకింది.కరోనా వైరస్‌ వ్యాప్తిని పర్యవేక్షిస్తున్న డబ్ల్యుహెచ్‌ఓలో ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ రిపోర్ట్స్‌ వచ్చాయని అధికారులు ధ్రువీకరించారు. ఇక వైరస్‌కు కేంద్రమైన చైనాలో 80,881 కేసులు నమోదవగా మిగిలిన దేశాల్లో 94,000 కేసులు నమోదయ్యాయి.

ఇటు తెలంగాణలో బస్సులు, మెట్రో రైళ్ళలో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. బస్సుల్లో శానిటైజర్లు ఉపయోగిస్తున్నారు. మెట్రో స్టేషన్లలోనూ శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. విదేశాల నుంచి జిల్లాకు తిరిగొచ్చిన వారికి 14 రోజుల గృహ నిర్బంధం నోటీసులు జారీ చేయాలని నెల్లూరు కలెక్టర్‌ వీరపాండియన్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ఈమేరకు ప్రకటన విడుదల చేశారు.

కరోనా వైరస్‌ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కరోనాపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వదంతులు నమ్మవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని కోరారు. కరోనా వ్యాపించకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. ఈరోజు వరకు అనంతగిరి హరిత రిసార్ట్స్ లోని కరోనా వైరస్ ఐషోలేషన్ సెంటర్లో కరోనా వ్యాధిలేని 53 మంది వ్యక్తులు అబ్జర్వేషన్ లో ఉన్నారు.

వీరిని 14 రోజులు ఒకే రూమ్ లో ఉంచి అబ్జర్వేషన్ లో పెడుతున్నారు.ఈ సమయంలో వీరిలో వైరస్ పాజిటివ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. అనంతగిరి హరిత రిసార్ట్స్ తో పాటు వికారాబాద్ లోని మహావీర్ ఆసుపత్రిలో కూడా ఐషోలేషన్ సెంటర్ ను ఏర్పాటు చేసారు. అనంతగిరి హరిత రిసార్ట్స్ లో ఉన్న 53 మంది కరోనా వైరస్ సోకినవాళ్లు కాదు కాబట్టి వికారాబాద్ ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా కల్పిస్తున్నారు.

కరోనా వైరస్ పై ఆందోళన కలిగించే వార్తలు రాసి దుష్ప్రచారం చేయవద్దని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు ఎక్కువ మంది ఉన్న పబ్లిక్ ప్లేస్ లలో తిరగవద్దంటున్నారు. ఎవరికి వారు శుభ్రత పాటించి ఇతర వ్యక్తులకు దూరంగా ఉంటే ఈ వ్యాధిని త్వరగా అరికట్టవచ్చని వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమి బసు సైతం కోరుతున్నారు. 

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   11 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   7 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   10 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   12 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   14 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   16 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   17 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   19 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   19 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle