newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో ఆరు వేలు దాటిన కరోనా కేసులు.. ఒకే రోజు 352 పాజిటివ్స్

19-06-202019-06-2020 06:31:22 IST
Updated On 19-06-2020 10:21:28 ISTUpdated On 19-06-20202020-06-19T01:01:22.973Z19-06-2020 2020-06-19T01:01:14.942Z - 2020-06-19T04:51:28.880Z - 19-06-2020

తెలంగాణలో ఆరు వేలు దాటిన కరోనా కేసులు.. ఒకే రోజు 352 పాజిటివ్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గురువారం పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. రాష్ట్రంలో గురువారం రికార్డు స్థాయిలో 352 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,027కి చేరింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. 

నేడు మరో ముగ్గురు కరోనాతో మృతిచెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 195గా నమోదైంది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 3301 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2531 కరోనా యాక్టివ్‌ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఒక్క రోజే ఇంత భారీ మొత్తంలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజాగా నమోదైన కేసుల్లో కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 302 కేసులు ఉన్నాయి. 

ఇంతవరకు తెలంగాణలో 6,027 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 302 కేసులు, రంగారెడ్డిలో 17, మేడ్చల్‌లో 10, మంచిర్యాలలో 4, జనగామలో 3, వరంగల్ అర్బన్‌లో 3, భూపాలపల్లిలో 2, మహబూబ్‌నగర్‌లో 2, మెదక్‌లో 2, నిజామాబాద్‌లో 2, సంగారెడ్డి‌లో 2, వరంగల్ రూరల్‌, నల్గొండ, ఖమ్మంలో ఒక్కో పాజిటివ్ కేసు నమోదు అయింది. గురువారం 230 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 3,301 మంది డిశ్చార్జి అయ్యారు. ఇంకా 2,531 యాక్టివ్ కేసులున్నాయని తెలంగాణ వైద్యారోగ్య శాఖ అధికారులు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. 

ప్రజా వైద్యంలో రాజీపడే ప్రసక్తే లేదు: ఈటల

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కరోనా టెస్టు‌లకు ప్రభుత్వం నిర్వహించిన ధరల విషయంపై ప్రైవేట్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిశారు. బీఆర్కే భవన్‌లో గురువారం మంత్రి ఈటలతో‌ ప్రైవేట్‌ ఆస్పత్రుల అసోసియేషన్ సభ్యులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా టెస్టులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలు పెంచాలని ఆస్పత్రుల అసోసియేషన్‌ మంత్రి ఈటలను కోరారు. అయితే ప్రైవేట్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ వినతిని ప్రభుత్వం తిరస్కరించింది. కోవిడ్‌-19 బాధితులకు ప్రభుత్వ రేట్ల ప్రకారమే వైద్యం చేయాలని ఈటల సూచించారు. ప్రజా వైద్యంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   5 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   an hour ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   4 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   8 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   11 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   12 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle