తెలంగాణలో ఆన్లైన్ పాఠాలకు యూట్యూబ్ ఛానెల్
22-06-202022-06-2020 08:59:56 IST
Updated On 22-06-2020 09:03:38 ISTUpdated On 22-06-20202020-06-22T03:29:56.440Z22-06-2020 2020-06-22T03:29:25.106Z - 2020-06-22T03:33:38.144Z - 22-06-2020

తెలంగాణలో విద్యాసంవత్సరం ప్రారంభించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పదవ తరగతి పరీక్షలు రద్దయ్యాయి. సప్లిమెంటరీ పరీక్షలు ఇక వుండవనే సంకేతాలు వచ్చాయి. పరీక్షకు ఫీజు కట్టినవారంతా పాస్ అయినట్టే కాబట్టి అందరికీ మెమోలు సిద్ధం చేసే పనిలో విద్యాశాఖ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. కాబట్టి సప్లిమెంటరీ భారం వారిపై వుండదు. అదే విధంగా డిగ్రీ, పీజీ పరీక్షలు లేవు. ఏటా జూన్ రెండవవారం స్కూళ్ళు ప్రారంభం అయ్యేవి. కానీ ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా విద్యాసంవత్సరం ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్ధులకు ఆన్ లైన్ పాఠాలు నిర్వహిస్తున్నాయి వివిధ పాఠశాలలు. కరోనా వల్ల బోధన, పరీక్షల విధానంలో పెనుమార్పులు సంభవించాయి. పరీక్షలు నిర్వహించడం కష్టంగా మారడంతో ప్రభుత్వాలు విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే లాక్డౌన్ సడలింపు అనంతరం కూడా విద్యా సంస్థలను ప్రారంభించే పరిస్థితులు లేకపోవడంతో విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలోనూ భారీగా నష్టపోయే ప్రమాదముంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఆన్లైన్ తరగతులను నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం తెలంగాణ విద్యాశాఖ ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ను సైతం ఏర్పాటు చేసినట్టు సమాచారం. జూన్ చివరి వారం నుంచి యూట్యూబ్ ద్వారా ఆన్లైన్ తరగతులు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. తొలుత పదో తరగతి విద్యార్థులతో ప్రారంభించి ఆ తర్వాత మిగిలిన తరగతులకు కూడా అమలు చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. అనుభవం కలిగిన ఉపాధ్యాయులు వీడియోల ద్వారా పాఠాలు బోధిస్తారు. ఈవీడియోలను యూట్యూబ్ లో అప్ లోడ్ చేయనున్నారు. దీని ద్వారా లక్షలాదిమందికి ఈ వీడియోలు చూసి వివిధ రకాల పాఠాలను నోట్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలుంటే వాటిని మరోసారి చూసుకోవచ్చు. ఈ యూట్యూబ్ ఛానెల్ ద్వారా రికార్డెడ్, లైవ్ ద్వారా టీచర్లు పాఠాలను బోధించేలా ఏర్పాట్లు చేశారు. అలాగే ఆన్లైన్ పాఠాల కోసం ఓ వెబ్సైట్ను కూడా ప్రారంభించే ఆలోచనలో విద్యాశాఖ ఉన్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో ఈ విషయాలపై పూర్తి స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. కరోనా కారణంగా విద్యాసంవత్సరం నష్టపోకుండా తల్లిదండ్రుల సూచనలతో అధికారులు వివిధ రకాల చర్యలు తీసుకుంటున్నారు. పదవ తరగతి పాసైన విద్యార్ధులకు ఇంటర్మీడియెట్ కు సంబంధించి ఆయా కాలేజీలు ఆన్ లైన్ ద్వారా పాఠాలు బోధిస్తున్నాయి. కార్పోరేట్ కాలేజీలు ఈ విషయంలో ముందున్నాయి.

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు
33 minutes ago

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి
26 minutes ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్
an hour ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!
2 hours ago

తిరుపతిలో కొనసాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్
5 hours ago

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెపరేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేనట్లే
3 hours ago

సభ్య సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామని అక్కా
6 hours ago

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
20 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
16-04-2021

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
21 hours ago
ఇంకా