newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో ఆగని కరోనా.. 2734 కొత్త కేసులు

01-09-202001-09-2020 13:46:32 IST
Updated On 01-09-2020 17:33:12 ISTUpdated On 01-09-20202020-09-01T08:16:32.025Z01-09-2020 2020-09-01T08:16:29.516Z - 2020-09-01T12:03:12.628Z - 01-09-2020

తెలంగాణలో ఆగని కరోనా.. 2734 కొత్త కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం... రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,734  కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో తొమ్మిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,325 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,27,697కు చేరింది. తెలంగాణలోని ఆసుపత్రుల్లో 31,699 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 95,162  మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 836కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 347 కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒకే రోజు 58,264 టెస్టులు చేయగా.. ఇప్పటి వరకు 14,23,846 శాంపిల్స్‌ పరీక్షించినట్లు వివరించింది. 

878 శాంపిల్స్‌ రిపోర్టులు రావాల్సి ఉందని, పది లక్షల జనాభాకు 38,358 మందికి టెస్టులు చేస్తున్నట్లు పేర్కొంది. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీలో 347 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా.. తర్వాత అత్యధికంగా రంగారెడ్డిలో 212, నల్గొండ 191, ఖమ్మం 161, భద్రాద్ది కొత్తగూడెం 117, నిజామాబాద్‌ 114, వరంగల్‌ అర్బన్‌ 112, సిద్దిపేట 109, సూర్యాపేట 107, కరీంనగర్‌లో 106 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. 

మరోవైపు తెలంగాణలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. రాష్ట్రంలో ఆక్సిజన్‌ అందక ఎవరూ చనిపోకూడదనే ఉద్దేశంతో భారీగా లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకులను నెలకొల్పాలని వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌కు భారీగా డిమాండ్‌ ఏర్పడింది. సిలిండర్ల ద్వారా ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నా అప్పుడప్పుడు అనుకోని అవాంతరాలు ఏర్పడుతున్నాయి. 

దీంతో ప్రభుత్వ ఆధ్వర్యంలోని 22 ఆస్పత్రులు, ఇతర బోధనాస్పత్రుల్లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకులను ఏర్పాటు చేయనుంది. అలాగే కొన్నింటి సామర్థ్యాన్ని పెంచాలని భావిస్తోంది. దీంతో అదనంగా 4,500 పడకలకు లిక్విడ్‌ ఆక్సిజన్‌ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. దీని ద్వారా ఆయా ఆస్పత్రులకు ఇక పైప్‌లైన్ల ద్వారా నిరంతరంగా ఆక్సిజన్‌ అందుబాటులో ఉండనుంది. వారం రోజుల్లో హైదరాబాద్‌లోని టిమ్స్, కింగ్‌ కోఠి, ఛాతి, ఉస్మానియా సహా మొత్తం 9 ఆస్పత్రుల్లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ను అందుబాటులోకి తీసుకొస్తారు. ఆ తర్వాత కొండాపూర్‌ ఏరియా ఆస్పత్రి, మహబూబ్‌నగర్‌ బోధనాస్పత్రి, ఆదిలాబాద్‌ రిమ్స్, సంగారెడ్డి బోధనాస్పత్రి ఇలా 22 చోట్ల అందుబాటులోకి తెస్తారు.

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   14 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   11 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   13 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   17 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   20 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   21 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle