newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

తెలంగాణలో ఆగని కరోనా వ్యాప్తి.. మరో 43 కొత్తకేసులు

19-04-202019-04-2020 09:00:56 IST
Updated On 19-04-2020 10:05:16 ISTUpdated On 19-04-20202020-04-19T03:30:56.429Z19-04-2020 2020-04-19T03:30:54.131Z - 2020-04-19T04:35:16.025Z - 19-04-2020

తెలంగాణలో ఆగని కరోనా వ్యాప్తి.. మరో 43 కొత్తకేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. శనివారం కొత్తగా 43 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 809కి చేరింది. ఇప్పటివరకు 186 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అవగా ప్రస్తుతం 605 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. అలాగే 18 మంది కరోనా బారినపడి మరణించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా శనివారం ఒక్కరోజే 31 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని, గద్వాల 7, సిరిసిల్ల 2,  రంగారెడ్డి 2, నల్గొండలో ఒక పాజిటివ్ కేసు నమోదు అయిందని,ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.  ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు బులెటిన్‌ విడుదల చేశారు. 

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా అనుమానితులను ఎప్పటికప్పుడు క్వారంటైన్లను తరలిస్తున్నా కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. కానీ ప్రజలు మాత్రం కరోనా నిబంధనలను ఆచరించడంలేదు. ఏదో ఒక పనితో ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. దీంతో కరోనా వ్యాప్తి పెరిగిపోతోంది. కొన్ని చోట్ల అయితే కరోనా ఎలా వచ్చిందనేది కూడా తెలియని పరిస్థితి నెలకొంది. 

రాష్ట్రంలో ఇప్పటివరకు 12,269 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ శనివారం మధ్యాహ్నం ప్రభుత్వానికి అందజేసిన అంతర్గత నివేదికలో వెల్లడించింది. అందులో విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు, వారి కాంటాక్ట్‌లకు ఎంత మందికి వచ్చిందో పేర్కొంది. అలాగే మర్కజ్‌కు నేరుగా వెళ్లొచ్చిన వారిలో ఎందరికి పాజిటివ్‌ వచ్చిందో, వారి ద్వారా ఇంకెంత మంది వైరస్‌బారిన పడ్డారో కూడా వెల్లడించింది. మొత్తంగా మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారు 1,247 కాగా వారందరికీ పరీక్షలు పూర్తయ్యాయి. వారి ద్వారా నేరుగా కాంటాక్ట్‌ అయినవారు 2,593 మంది ఉండగా వాళ్లకు కూడా పరీక్షలు నిర్వహించారు.

ఇప్పటివరకు నమోదైన కేసుల్లో విదేశాల నుంచి వచ్చిన వారిలో 34 మందికి, వారి కాంటాక్టులకు 30 మందికి, అంటే మొత్తంగా 64 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇక ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారిలో 232 మందికి, వారి కాంటాక్టులకు 432 మందికి పాజిటివ్‌ వచ్చింది. మిగిలిన వారిలో ఆరోగ్య సిబ్బంది, సెకండరీ కాంటాక్టు వచ్చినవారు తదితరులు ఉన్నారు. అయితే ఆరోగ్య సిబ్బంది ఎవరనేది నివేదికలో ప్రస్తావించలేదు. కాగా, హైదరాబాద్‌లో కరోనా నియంత్రణ విధుల్లో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు తాజాగా వైరస్‌బారిన పడ్డారు. 

సర్కారుకు ఇచ్చిన నివేదికలో 172 కంటైన్మెంట్‌ ఏరియాల్లో 1.09 లక్షల ఇళ్లలో సర్వే చేసినట్లు వెల్లడైంది. 89,227 ఇళ్లలో సర్వే చేసి కాంటాక్ట్‌లను గుర్తించాల్సి ఉందని నివేదిక పేర్కొంది. మరోవైపు 33 జిల్లాల్లో 121 క్వారంటైన్‌ సెంటర్లు నడుస్తున్నాయని, వాటిలో 1,017 మంది ఉన్నారని, మరో 209 మంది శాంపిళ్లను సేకరించాల్సి ఉందని నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 3.55 లక్షల ఎన్‌–95 మాస్కులు, 2.92 లక్షల పీపీఈ కిట్లు, 17,246 టెస్టింగ్‌ కిట్లు ఉన్నాయని తెలిపింది. ల్యాబ్‌లలో ప్రస్తుతం 600కుపైగా పెండింగ్‌ టెస్ట్‌లు ఉన్నాయని తెలిపింది. 

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

   3 hours ago


తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

   8 hours ago


భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

   10 hours ago


మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

   11 hours ago


నిమ్మగడ్డ  ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

నిమ్మగడ్డ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

   11 hours ago


మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

   13 hours ago


యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

   14 hours ago


‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

   14 hours ago


తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

   14 hours ago


డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

   30-05-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle