newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

11-08-202011-08-2020 10:03:40 IST
Updated On 11-08-2020 10:36:07 ISTUpdated On 11-08-20202020-08-11T04:33:40.025Z11-08-2020 2020-08-11T04:33:15.630Z - 2020-08-11T05:06:07.316Z - 11-08-2020

తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతూనే వుంది. కొత్తగా మరో 1896 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ రోజుతో తెలంగాణలో కరోనా వల్ల 645 మరణాలు.. మొత్తం 82647 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరణాల రేటు 0.78 శాతం కాగా దేశంలో మరణాల రేటు 2.00శాతంగా వుంది. రాష్ట్రంలో  పాజిటివ్ కేసుల రేటు 12.85శాతం వుంది. దేశంలో పాజిటివ్ కేసుల  రేటు 9.22శాతంగా వుంది. ఆదివారంతో పోలిస్తే టెస్టుల సంఖ్య పెరిగినప్పటికీ.. మిగతా రోజులతో పోలిస్తే తక్కువ సంఖ్యలోనే సోమవారం టెస్టులు చేశారు. ఆగష్టు 10న రాష్ట్రంలో 18,035 టెస్టులు చేశారు. దీంతో రాష్ట్రంలో టెస్టుల సంఖ్య 6.42 లక్షలు దాటింది.

సోమవారం రాష్ట్రంలో 1788 మంది కోవిడ్ బారి నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు హెల్త్ బులిటిన్ లో వెల్లడించారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 59 వేలు దాటింది.

రాష్ట్రంలో ప్రస్తుతం 22,628 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 338 కొత్త కేసులను గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో 147, కరీంనగర్ 121, మేడ్చల్ 119, వరంగల్ అర్బన్ 95, గద్వాల 85, జనగామ 71, కామారెడ్డి 71, ఖమ్మం 65, భద్రాద్రి 60, పెద్దపల్లి 66, సిద్ధిపేట 64 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కరోనా తీవ్రత ఒకింత తక్కువగా ఉన్న ఆసిఫాబాద్ జిల్లాలోనూ సోమవారం 17 కొత్త కేసులను గుర్తించారు.

కరోనా తీవ్రత నేపథ్యంలో టెస్టుల సంఖ్య పెంచారు. తెలంగాణలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్‌సీ), బస్తీ దవాఖానాల్లోనూ ఆర్‌టీ–పీసీఆర్‌ పద్ధతిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆయా కేంద్రాలకు ఆర్‌టీ–పీసీఆర్‌ కిట్లను పంపించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

ప్రస్తుతం పెద్దాసుపత్రుల నుంచి పీహెచ్‌సీ స్థాయి వరకు 1,100 పరీక్షా కేంద్రాల్లో అన్ని చోట్లా ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. యాంటీజెన్‌ టెస్టుతో అరగంటలోపే ఫలితం తెలుస్తోంది. అందులో కరోనా పాజిటివ్‌ వస్తే పూర్తిస్థాయి పాజిటివ్‌గానే గుర్తించవచ్చు. కానీ యాంటీజెన్‌ టెస్టులో నెగెటివ్‌ వస్తే దాని కచ్చితత్వం కేవలం 50 నుంచి 70 శాతమేనని ఐసీఎంఆర్‌ ప్రకటించింది.  పీహెచ్‌సీ స్థాయిలో యాంటీజెన్‌ టెస్టులు చేయించుకొని నెగెటివ్‌ వచ్చి లక్షణాలున్న వారు సాధారణంగా తిరుగుతున్నారు. దీంతో  ఆర్‌టీ–పీసీఆర్‌ కోసం తీసుకున్న శాంపిళ్లను ప్రభుత్వ ఆధ్వర్యంలోని లేబొరేటరీలకు పంపిస్తారు. వాటి ఫలితాలు 24 గంటల నుంచి రెండు, మూడ్రోజుల్లో వస్తాయని చెబుతున్నారు. 

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   12 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   13 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   13 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   17 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   18 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   16 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   19 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   19 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   14 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle