newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

‘‘తెలంగాణలో అసలు ప్రభుత్వం ఉందా?’’

18-05-201918-05-2019 16:30:18 IST
2019-05-18T11:00:18.466Z18-05-2019 2019-05-18T10:50:35.552Z - - 20-09-2019

‘‘తెలంగాణలో అసలు ప్రభుత్వం ఉందా?’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇంటర్మీడియెట్ విద్యార్దుల ఆత్మహత్యలు, హాజీపూర్ శ్రీనివాసరెడ్డి అకృ‌త్యాలు. అంబేద్కర్ విగ్రహాల విధ్వంసం వంటి ఘటనలు జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వంలో చలనం లేదని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. విపక్షాలన్నీ కలిసి నిరసన వ్యక్తంచేసినా సీఎం కేసీఆర్ గానీ, కొడుకు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గానీ స్పందించడం లేదని విమర్శించారు. హాజీపూర్ లో దారుణమయిన ఘటనలు జరిగినా, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్నారు. ఇంత జరుగుతున్నా గవర్నర్ నరసింహన్ స్పందించడం లేదన్నారు. 

హాజీపూర్ బాధితులను పరామర్శించాలన్న కనీస ధ్యానం సీఎంకి లేకపోవడం సిగ్గుచేటన్నారు. తన మనవడికి బాగా లేకుంటే ఆస్పత్రికి వెళ్ళే తీరిక ఉన్న సీఎంకి, జనం బాధలు పట్టడం లేదన్నారు. ఎంపీ కవిత రెండో కుమారుడు ఆర్య తీవ్ర జ్వరంతో ఈ నెల 15వ తేదీ నుంచి రెయిన్‌ బో హాస్పటల్‌లో చికిత్స పొందుతుంటే కేసీఆర్‌ స్వయంగా హాస్పటల్‌కి వెళ్లి మనవడిని పరామర్శించారన్నారు.

ఈఘటనను వీహెచ్ ప్రస్తావించారు. కవిత కొడుకు లాంటివారే తెలంగాణ పిల్లలు కాదా అన్నారు. ఇంటర్ వివాదంలో ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్దుల తల్లిదండ్రులను పరామర్శించకపోవడం దారుణం అన్నారు వీహెచ్. అలాగే హాజీపూర్ ఘటన తర్వాత తమ పిల్లల్ని స్కూలుకి పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడిపోతున్నారన్నారు. 

ముగ్గురు బాలికలను పొట్టనబెట్టుకున్న సీరియల్‌ కిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డిని ఉరితీయాలంటూ హాజీపూర్‌ గ్రామస్తులు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేయడంపై వీహెచ్ మండిపడ్డారు. శనివారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో దీక్ష చేస్తున్న30మందిని అరెస్టు చేసి హైదరాబాద్‌లోని జవహర్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారని, తమకు న్యాయం చేయమని అడిగితే అరెస్ట్ చేయడం ఏంటన్నారు వీహెచ్.

ముగ్గురు బాలికలు శ్రావణి, మనీషా, కల్పన ఆత్మలు శాంతించాలంటే నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేయాలని హాజీపూర్‌ గ్రామస్తులు డిమాండ్‌ చేశారని, తమ పిల్లల్ని పాతిపెట్టిన బావిలోకి దిగి నిరసన తెలుపుతున్నా మంత్రులు స్పందించడంలేదన్నారు. 

ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం చేయాలని, బాధిత కుంటుంబాకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని వీహెచ్ డిమాండ్ చేశారు. అలాగే ఇంటర్మీడియెట్ ఫలితాలకు మనస్తాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడినవారికి  నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహాల ధ్వంసం చేసినవారిని శిక్షించాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై స్పందించే కేటీఆర్ కు తెలంగాణలో సమస్యలు పట్టడం లేదన్నారు. అసలు తెలంగాణలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. ప్రజల ఉసురు ప్రభుత్వానికి తగులుతుందన్నారు. 

Police Spoiled Hajipur Villagers Indefinite Hunger Strike Over Girls Murders - Sakshi


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle