newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

‘‘తెలంగాణపై వివక్ష ప్రశ్నేలేదు.. మాకన్ని రాష్ట్రాలు సమానమే’’

17-02-202017-02-2020 07:43:52 IST
Updated On 17-02-2020 08:36:52 ISTUpdated On 17-02-20202020-02-17T02:13:52.108Z17-02-2020 2020-02-17T02:13:32.891Z - 2020-02-17T03:06:52.182Z - 17-02-2020

‘‘తెలంగాణపై వివక్ష ప్రశ్నేలేదు.. మాకన్ని రాష్ట్రాలు సమానమే’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్రప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్రం చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన నిర్మలా సీతారామన్  రాష్ట్రాలను కేంద్రం చిన్న చూపు చూస్తోందన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. ఏ రాష్ట్రాన్ని తక్కువ చేసి చూసే ఆలోచన‌ కేంద్రానికి ఉండదని, అన్ని రాష్ట్రాల విషయలో కేంద్రం వైఖరి ఒకేలా వుంటుందన్నారు. 

కేంద్రంపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను మీడియాలో చూశానని, దేశంలో రాష్ట్రాల సంఖ్య తగ్గి.. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు పెరిగాయన్నారు. కేంద్రానికి ఎక్కువ పన్నులు ఇస్తోన్న తెలంగాణను ప్రోత్సహించటం లేదని కొందరు చేస్తోన్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఖండించారు.

జీఎస్టీ నిధులు తెలంగాణ సహా.. ఏ రాష్ట్రానికి ఇవ్వలేదని, ఈ నిధులు ఇవ్వటం ఆలస్యమైన విషయాన్ని పార్లమెంట్ లో స్వయంగా వివరించానన్నారు నిర్మలా సీతారామన్. రాష్ట్రాలకు త్వరలో జీఎస్టీ బాకీలు చెల్లిస్తామన్నారు. కేంద్ర బడ్జెట్ పై వివిధ వర్గాలు, పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి హైదరాబాద్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. 

పన్నుల్లో రాష్ర్టప్రభుత్వాల వాటా తగ్గిందన్నారు. గతంలో 42 శాతం వున్న వాటా 41 శాతానికి తగ్గించి, ఆ మొత్తాన్ని కొత్త కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయించినట్టు కేంద్ర మంత్రి చెప్పారు.  తెలంగాణ పన్ను వసూళ్లలో మెరుగ్గా ఉందని ఆమె కితాబిచ్చారు. రాష్ర్టాలు నిధుల్లో తమకు రావాల్సిన వాటా ఇవ్వాలని కోరడం సమంజసమేనన్నారు. అన్ని రాష్ర్టాలు తమ వంతు వాటాను సమకూర్చుతూనే ఉన్నాయని, తాము ఏ రాష్ర్టాన్నీ తక్కువ చేసి చూడటం లేదన్నారు. 

అన్ని రాష్ట్రాలతో సామరస్యంగా ఉండటమే తమ విధానమని చెప్పారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపులు తగ్గలేదన్నారు. 2010-15 సంవత్సర కాలంలో తెలంగాణకు రూ.46,747 కోట్లు విడుదలయ్యాయని, 2015-20 కాలంలో విడుదల మొత్తం రూ.1,06,606 కోట్లని ఆర్థికశాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న వివిధ పథకాలకు కేద్రం నిధులు ఇవ్వడం లేదని సీఎం కేసీయార్ ఇటీవల విమర్శించిన సంగతి తెలిసిందే.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle