newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణను వణికిస్తున్న వైరస్.. 58వేలు దాటిన కేసులు

29-07-202029-07-2020 11:58:31 IST
Updated On 29-07-2020 12:54:00 ISTUpdated On 29-07-20202020-07-29T06:28:31.705Z29-07-2020 2020-07-29T06:27:50.488Z - 2020-07-29T07:24:00.881Z - 29-07-2020

తెలంగాణను వణికిస్తున్న వైరస్.. 58వేలు దాటిన కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తన ప్రతాపం చూపుతోంది. తెలంగాణలో కరోనా వైరస్ వణికిస్తోంది. గత కొద్ది రోజులుగా గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ వైరస్ ఉధృతి కొనసాగుతుండడంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాల్లో నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య కూడా భారీగానే నమోదు అవుతుండటంతో ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.  మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు నమోదైన కరోనా కేసుల బులిటెన్ విడుదల చేసింది ప్రభుత్వం.

తెలంగాణలో కొత్తగా 1764 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 58,906కు చేరింది.  మంగళవారం 842 మంది కరోనా నుంచి కోలుకోగా మొత్తం 43,751 మంది డిశ్చార్జ్ అయ్యారు. 14,663 మంది చికిత్స పొందుతున్నారు. మంగళవారం 12 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 492కు చేరింది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 18,858 కరోనా టెస్టులు చేశారు.

మరోవైపు తెలంగాణలో కరోనా పరీక్షలు తీరుపై  సీఎస్ సోమేష్ కుమార్ పై ప్రశ్నల వర్షం కురిపించింది హైకోర్టు. హెల్త్ ప్రిన్సిపల్  సెక్రటరీ, జీహెచ్ఎంసీ కమిషనర్ హైకోర్టు కు హాజరయ్యారు. నేరుగా విచారణకు హాజరైన ఎస్ సోమేష్ కుమార్ వివరాలు అందచేశారు. కరోనా కేసులు పెరుగుతుంటే నివారణకు ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎందుకు తక్కువ టెస్టులు చేస్తున్నారని. కరోనా పరీక్షలు ఎందుకు జరపడం లేదని ప్రశ్నించింది. 

మారుమూల జిల్లాల్లో కరోనాతో అనేకమంది చనిపోతున్నారని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలు లేవని హైకోర్టు ఆక్షేపించింది. ఆక్సిజన్ అందక ఇటీవల 38మంది చనిపోయారని హైకోర్టు పేర్కొంది. హెల్త్ బులిటెన్ లలో తప్పులు వస్తున్నాయని పత్రికలు అంటున్నాయని, కరోనా కేసుల వివరాలు పట్టిక వేసి వివరాలు చూపాలని ఆదేశించింది. హెహెల్త్ బులిటెన్ లో తప్పులు ఇస్తే ఊరుకునేది లేదని స్పష్టంచేసింది హైకోర్టు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఫీజులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని, ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ పై నిఘా ఉంచాలని కోర్టు సూచించింది. 

రాష్ట్రంలో ఉన్న బెడ్స్ ఎన్ని, వెంటిలేటర్స్ ఎన్ని..? పేదవాళ్ళ కోసం ఫంక్షన్ హాల్స్, కమ్యూనిటీ సెంటర్స్ వాడండని ఆదేశించింది. ప్రతిరోజు కరోనా కేసుల సమగ్ర వివరాలు మీడియాకు ఇస్తామన్నారు సీఎస్. ICMR , WHO గైడ్ లెన్సు పక్కాగా పాటించాలని ఆదేశించింది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle