newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణను కుదిపేసిన కరోనా వైరస్ వార్త.. పూర్తిస్థాయిలో అప్రమత్తం

03-03-202003-03-2020 09:13:38 IST
Updated On 03-03-2020 15:33:38 ISTUpdated On 03-03-20202020-03-03T03:43:38.265Z03-03-2020 2020-03-03T03:43:18.352Z - 2020-03-03T10:03:38.031Z - 03-03-2020

తెలంగాణను కుదిపేసిన కరోనా వైరస్ వార్త.. పూర్తిస్థాయిలో అప్రమత్తం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో మరోసారి కరోనా వైరస్ ఉనికి రెండు, మూడు రాష్ట్రాల్లో బయటపడిన నేపధ్యంలో దేశ ప్రజలు వణికిపోతున్నారంటే అతిశయోక్తి కాదు. దుబాయ్ వెళ్లిన బెంగళూరు సాప్ట్ వేర్ కంపెనీ యువకుడు ఫిబ్రవరి 20న తిరిగి బెంగళూరుకు, ఫిబ్రవరి 27న హైదరాబాద్‌కు వస్తూ కరోనాను వెంటబెట్టుకొచ్చాడు అని గాంధీ ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించడంతో హైదరాబాద్‌లో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ముందుగా సికిందరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరిన ఆ యువకుడు జ్వరం తగ్గకపోవడంతో మార్చి 1న గాంధీ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో చేరి టెస్టు చేయించుకున్నారు. మార్చి 2న తనకు పాజిటివ్ అని తేలగా తన నమూనాలను పుణేకు పంపి కూడా నిర్దారించుకున్నారు.

వెంటనే కేంద్రప్రభుత్వానికి సమాచారం అందించిన డాక్టర్లు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం బాధిత వ్యక్తి ఆరోగ్య స్థితి నిలకడగా ఉందంటున్నప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఆరోగ్య శాఖ యుద్ద ప్రాతిపదినన చర్యలు చేపట్టింది. రాష్ట్ర ఆరోగ్యమంత్రి ఈటెల రాజేందర్ తన శాఖను పూర్తిస్థాయిలో అప్రమత్తం చేశారు. 

కోవిడ్‌-19 వ్యాప్తి కాకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఈటెల రాజేందర్‌ అన్నారు. రాష్ట్రంలో తొలి కరోనా వైరస్‌ కేసు నమోదైన నేపథ్యంలో మంత్రి ఈటెల కోఠిలోని వైద్య సంచాలకుల కార్యాలయంలో ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యాధి లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించి, సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కరోనా కేసు వివరాలను వెల్లడించారు.

మరొక ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, కరోనా సోకిన వ్యక్తి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చిన  బస్సులో 27 మంది ప్రయాణించినట్టు తెలిసింది. ఆ 27 మందిని ట్రేస్‌ చేస్తున్నాం. వారి కుటుంబ సభ్యుల్లో ఇప్పటికీ 80 మందిని గుర్తించాం. వారందరికీ టెస్టులు చేస్తాం. కరోనా పాజిటివ్ కేసుగా నమోదైన వ్యక్తిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స ఇవ్వాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశించారు. మున్సిపల్ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు అని ఈటల రాజేందర్ వివరించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వ్యాధి లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించి, టెస్టులు చేయించుకోవాలి. గాంధీ, చెస్ట్, ఫీవర్ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసాం. బహిరంగ ప్రదేశాల్లో దగ్గడం, తుమ్మడం లాంటివి చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలకు అవగాహన కల్పించేందుకు బ్రోచర్స్ ప్రింట్ చేసి జనసమ్మర్థ ప్రదేశాల్లో ఉంచుతాం. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు స్పెషల్‌ ఫండ్‌ అవసరమైన పక్షంలో తీసుకోండని సీఎం చెప్పారు’అని ఈటల పేర్కొన్నారు.

గత డిసెంబరులో చైనాలో పుట్టి ప్రపంచంలోని 70 దేశాలకు విస్తరించిన కరోనా వైరస్ దెబ్బకు ఇప్పటివరకు 3 వేలమంది చనిపోగా, 90 వేలమందికి వైరస్ సోకింది. ఇప్పటికే ఇరాన్‌లో ఈ వైరస్ ప్రభావంతో66 మంది చనిపోగా, 

ఇటలీలో 34 మంది, దక్షిణ కొరియాలో 22 మంది చనిపోయారు. ఇకపోతే ఆస్ట్రేలియా, అమెరికాల్లో కూడా సోమవారం కరోనా బాధితులు చనిపోయారని తొలిసారిగా ప్రకటించాయి. చైనాలో మార్చి 2న ఒక్కరోజులోనే 42 మంది చనిపోయారు. ఇంతవరకు చైనాలో కరోనా మృతుల సంఖ్య 2,912కు చేరుకుంది.

తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ, చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. దీని ప్రకారం కరోనా వ్యాధికారకమైన వైరస్‌ను జూనోటిక్ (Zoonotic) వైరస్‌గా నిర్ధారించారు. అంటే జంతువుల నుంచి మానవులుకు సోకే బాక్టీరియా, వైరస్‌లు లేక పరాన్నజీవుల ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తోందని తాజా సమాచారం.

కరోనా వైరస్‌పై తెలంగాణ హెల్ప్‌లైన్ నెం 011-23978046. ఏ చిన్న అనుమానం వచ్చినా  వెంటనే ఈ హెల్ప్ లైన్‌కు కాల్ చేసి సమాచారం పంచుకోవాలని ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా ప్రకటించింది.

 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   2 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   3 hours ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   3 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   4 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   5 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   5 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   22-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle