newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణకు మావోయిస్టుల డ్రోన్ల బెడద

14-03-202014-03-2020 12:01:00 IST
2020-03-14T06:31:00.015Z14-03-2020 2020-03-14T06:30:57.921Z - - 16-04-2021

తెలంగాణకు మావోయిస్టుల డ్రోన్ల బెడద
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైపు తెలంగాణ కరోనా వైరస్ బెడదతో వణుకుతోంది. మరోవైపు రాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టులు డ్రోన్లతో పొంచి ఉంటున్నారని వార్తలు. పైగా యాక్షన్ టీమ్‌లు కూడా తెలంగాణ వైపు కదిలాయని సమాచారంతో రాష్ట్ర పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు గాలింపు చర్యలను తెలంగాణ పోలీసులు ముమ్మరం చేశారు.

తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల సంచారం మరోసారి కలకలం రేపుతోంది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఏడు యాక్షన్‌ టీంలు తెలంగాణలోకి ప్రవేశించాయన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు నిఘా పెంచారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని చెన్నూరు నుంచి పాత ఖమ్మం జిల్లాలోని చర్ల వరకు గాలింపు ముమ్మరం చేశారు. 

ఈ ప్రాంతాలన్నీ నదీ పరివాహకాలే. దీంతో మావోయిస్టులు తెలంగాణలోకి ప్రవేశించాలంటే.. తప్పనిసరిగా గోదావరి నదిని దాటాలి. రెండు నుంచి మూడు కిలోమీటర్ల వెడల్పున్న నదిని దాటేముందు గట్టుకు అవతల పోలీసులు ఉన్నారో లేదో ధ్రువీకరించుకునేందుకు మావోయిస్టులు డ్రోన్లను వినియోగిస్తున్నారని సమాచారం. 

వేసవి సమీపించడం, అడవిలో ఆకులు రాలుతుండటంతో ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్‌పీఎఫ్‌ దళాలు ‘ఆపరేషన్‌ ప్రహార్‌’ పేరిట దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నాయి. వారి నుంచి తప్పించుకోవడంతోపాటు తెలంగాణలో కొత్త రిక్రూట్‌మెంట్‌ కోసం మావోయిస్టులు సరిహద్దు దాటి వస్తున్నారు. 

మార్చి ఆఖరివారంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులను సందర్శించే అవకాశాలున్నాయి. దీంతో పోలీసు డిపార్ట్‌మెంట్‌ ఈ ప్రాంతంలో అణువణువూ గాలిస్తున్నాయి.

గతేడాది జూలై 12న ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాసరావు హత్య తరువాత మళ్లీ ఇప్పుడే మావోల కదలికలు మొదలవడం గమనార్హం. ఎలాగైనా తెలంగాణలో ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోన్న హరిభూషణ్‌–శారద దంపతులే శ్రీనివాసరావు హత్యలోనూ నిందితులు కావడం గమనార్హం. దూకుడుగా వెళ్లడం, యువతను ఆకర్షించడమే లక్ష్యంగా వీరు పావులు కదుపుతున్నారు. 

దండకారణ్యంలో గుత్తికోయ తెగలకు చెందినవారే మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం సభ్యులుగా ఉన్నారు. వీరికి తెలుగుభాష కూడా రావడంతో ఇక్కడికి వచ్చి సులువుగా జనాల్లో కలసిపోవడం, రిక్రూట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. వీరిలో మావోయిస్టు పార్టీ కార్యదర్శి అగ్రనేత హరిభూషణ్, ఆయన భార్య శారద కూడా ఉన్నట్లు సమాచారం. వీరిని సులువుగా గుర్తించేందుకు వీలుగా పోలీసులు వారి ఫొటోలతో ఉన్న పోస్టర్లు చెన్నూరు నుంచి చర్ల వరకు అంటించారు. వీరి సమాచారం చెప్పినవారికి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నగదు బహుమతి కూడా ప్రకటించారు. 

పోలీసులు మావోయిస్టుల వేట సాగిస్తూనే గ్రామాల్లో తనిఖీలు పెంచారు. ఇప్పటికే ఇద్దరు ఐపీఎస్‌ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం పరిధిలో ప్రత్యేక ఆపరేషన్లలో పాల్గొంటున్నారు. ఇల్లందు మండలం పరిధిలోని బాలాజీ నగర్, బోజ్జయిగూడెం గ్రామ పంచాయతీలను శుక్రవారం ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర సందర్శించారు. స్థానిక పోలీసులతో కలసి వచ్చిన ఆయన పల్లె ప్రగతి కార్యక్రమాలు, నర్సరీలు, డంపింగ్‌ యార్డ్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఓ వైపు మావోల కోసం కూంబింగ్‌ జరుగుతుండగానే.. పోలీసు ఉన్నతాధికారి గ్రామాల పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

 

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   26 minutes ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   14 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   10 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   12 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   15 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   17 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   19 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   20 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   21 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle