newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణకు నేటితో ఆరేండ్లు.. త్యాగ ఫలితమే నిదర్శనం!

02-06-202002-06-2020 07:02:23 IST
Updated On 02-06-2020 10:02:13 ISTUpdated On 02-06-20202020-06-02T01:32:23.216Z02-06-2020 2020-06-02T01:32:21.160Z - 2020-06-02T04:32:13.440Z - 02-06-2020

తెలంగాణకు నేటితో ఆరేండ్లు.. త్యాగ ఫలితమే నిదర్శనం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై నేటితో ఆరేళ్ళు పూర్తయింది. జూన్ 2న ఏడవ ఏడాదిలో అడుగుపెట్టబోతున్నాం. సుమారు నాలుగున్నర దశాబ్దాల పాటు వివిధ దశలలో ఉజ్వలించిన ఉద్యమాలతోనే ఈనాడు ఒక రాష్టంగా వెలుగులీనుతున్న తెలంగాణ రాష్ట్రం సిద్దించింది. ఆనాడు ఉద్యమంలో భాగంగా వందలాది మంది ప్రాణత్యాగ ఫలితమే ప్రత్యేక రాష్ట్రానికి పునాది.

ఇప్పుడు అప్పుడు అని లేకుండా సందర్భం వచ్చిన ప్రతిసారి అప్పటికే నాలుగు దశాబ్దాలుగా సాగుతూనే ఉన్న ఉద్యమానికి కేసీఆర్ అనే వ్యక్తి గులాబీ జెండా చేతపట్టి సారధిగా మారారు. ఒక ఆశయం గొప్పదైతే నడిపించేందుకు వంద కారణాలు అన్నారు మహానుభావులు. అదే సామెత తెలంగాణ ఉద్యమానికి అచ్చుగుద్దినట్లుగా సరిపోతుందేమో.

ఉద్యమం అంటే కడుపు మండిన వాళ్ళకే కాదు..  తినడానికి కడుపు నిండా ఉన్నా ఆత్మగౌరవం ఒకటుందనేలా.. తెలంగాణ గడ్డ మీద పుట్టిన వాళ్ళెవరైనా సరే.. వారు, వీరు అన్న తేడా లేకుండా అందరినీ కలుపుకుంటూ ప్రత్యేక రాష్ట్రం మా హక్కు అంటూ కొట్లాటకు దిగారు. అప్పటి వరకు ఉద్యమం అంటే కొన్ని వర్గాలకే అనుకున్న ఉద్యమాన్ని మలిదశగా మార్చేసి కేసీఆర్ ప్రాణం పోశారనే చెప్పాలి.

అది 2009 నవంబర్ 29. ప్రత్యేక తెలంగాణే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఎక్కుపెట్టిన అస్త్రం ఆమరణ దీక్ష. మలిదశ ఉద్యమంలో అదో కీలక ఘట్టం.  తెలంగాణ ప్రజల నరనరాల భక్తి చాటిచెప్పేలా స్ఫూర్తి నింపుతూ మలుపు తిరిగింది. పల్లె, పట్నం, పిల్లా, జెల్లా.. ప్రజా సంఘాలు, విద్యార్థీ, యూనియన్లు, కార్మికులు, కర్షకులు యావత్ తెలంగాణ సమాజం ఏకమైంది.

ఆ నాటి నుండి మూడేళ్ళ పాటు నిత్యయుద్ధంగా మారిన ఉద్యమాన్ని అదుపు చేయడం ఆనాటి పాలకులకు తలకు మించిన భారమయింది. దిగొచ్చిన కేంద్రం డిసెంబర్‌ 9న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించారు. కానీ మళ్ళీ కేంద్రం వెనక్కి తగ్గింది. చివరికి 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది.

అక్కడ సీన్ కట్ చేస్తే.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆనాటి ఉద్యమ సారథినే రాష్ట్ర పాలకునిగా ప్రజలు పట్టం కట్టారు. రాష్ట్రమైతే వచ్చింది.. తన మనిషిగా ముందున్న కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ముందున్న సవాళ్లు ఎన్నో. సంస్థాగతంగా స్థానిక పరిస్థితులపై పట్టుందని పేరున్న కేసీఆర్ వాటిని అధిగమిస్తూ రాష్ట్రాన్ని గాడినపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

తెలంగాణను సస్యశ్యామలం చేస్తుందని నమ్ముతున్న కాళేశ్వరం లాంటి మహాయజ్ఞాలు బహుశా ఆనాడు పోరాటం చేసిన తెలంగాణ రాష్ట్రంతోనే సాధ్యమైందేమో. ఆనాడు ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగ ఫలితమే నేటి ధాన్యాగారా తెలంగాణ ఆవిష్కృతమైందేమో. నాడు ప్రత్యేక రాష్ట్రం కోసం చిందించిన యువకుల రక్తమే నేడు కోటి ఎకరాల మాగాణిగా మారుతుందేమో. ముందున్నది మహా గడుసైతే.. నేడున్నది ఆత్మ సంతృప్తేమో!

 

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   4 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   5 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   5 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   9 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   10 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   8 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   11 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   11 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   6 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   13 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle