newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణకు చిరునామా టీఆర్ఎస్ పార్టీ అట

04-01-202004-01-2020 09:44:09 IST
Updated On 04-01-2020 12:22:30 ISTUpdated On 04-01-20202020-01-04T04:14:09.633Z04-01-2020 2020-01-04T04:14:01.330Z - 2020-01-04T06:52:30.062Z - 04-01-2020

తెలంగాణకు చిరునామా టీఆర్ఎస్ పార్టీ అట
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల స్వంత పార్టీ అంటున్నారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తమ పార్టీ నెరవేరుస్తుందని... అందుకే తెలంగాణ అంటే టీఆర్ఎస్... టీఆర్ఎస్ అంటే కేసీయారే అంటున్నారు హరీష్. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు నూకలు చెల్లాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. దుబ్బాక నియోజకవర్గం చీకోడ్‌లో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వమని... మున్సిపల్ ఎన్నికలు వస్తే ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయని హరీశ్ రావు అన్నారు. అందుకే కోర్టుకు వెళ్లి ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతున్నాయని అన్నారు. ఆ పార్టీలు ఎన్నికల్లో తమతో పోటీ పడటానికి భయపడుతున్నాయని హరీశ్ రావు అన్నారు. దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నా.. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాల కార్యక్రమంలో భాగంగా ఆసరా రూ.2016 పింఛను ఇస్తున్నారన్నారు.

దేశంలో ఎక్కడా లేని అనేక సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. దుబ్బాకలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మిస్తున్నామన్న హరీశ్ రావు... దాన్ని మరో నెలలో ప్రారంభిస్తామని అన్నారు. తెలంగాణలో త్వరలో కేటీయార్ సీఎం అవుతారని వస్తున్న వార్తల నేపథ్యంలో హరీష్ రావు కీలక కామెంట్లు చేశారు. ఇదిలా వుంటే మునిసిపల్ ఎన్నికల తర్వాత కానీ , అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత కానీ కేటీఆర్ పట్టాభిషేకం ఖాయం అని గట్టిగా వినబడుతోంది. 

మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ సన్నద్ధం అవుతోంది. ఈ నెల 7న మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుంది. శనివారం  పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. జరిగే ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా పార్టీ పార్లమెంటు సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు ఆహ్వానం పంపారు. తెలంగాణ భవన్‌లో ఉదయం 11.30 నుంచి సాయంత్రం 4 వరకు సమావేశం ఉంటుంది. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి పార్టీ నేతలకు కేసీయార్ మర్గదర్శనం చేస్తారు. 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   5 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   5 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   5 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   9 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   10 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   9 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   11 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   11 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   7 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   13 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle