newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్... కొత్తగా 3 హైవేలు

16-08-202016-08-2020 08:14:31 IST
Updated On 16-08-2020 10:30:40 ISTUpdated On 16-08-20202020-08-16T02:44:31.816Z16-08-2020 2020-08-16T02:44:18.565Z - 2020-08-16T05:00:40.961Z - 16-08-2020

తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్... కొత్తగా 3 హైవేలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశ రవాణా రంగంలో హైవేలు కీలక పాత్ర పోషిస్తోన్నాయి. కానీ అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దగ్గర హైవేల ద్వారా రవాణా మందకొడిగా సాగుతోంది. రవాణా రంగానికి మరింత ఊతం ఇవ్వడం కోసం.. కీలక నగరాల మధ్య ప్రయాణాన్ని వేగవంతం చేయడం కోసం నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) నూతన హైవేల నిర్మాణానికి నడుం బిగించింది.

23 కొత్త హైవేల నిర్మాణానికి హైవేస్ అథారిటీ డెడ్ లైన్ విధించింది. 2025 మార్చి 25లోగా ఈ హైవేలను నిర్మించాలని నిర్ణయించింది.ఢిల్లీ-ముంబై, అహ్మదాబాద్-ధోలెరా, అమృత్‌సర్-జామ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ వేలు 2023 మార్చిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరో 9 హైవేలను 2024 మార్చిలోగా పూర్తి చేస్తారు. మిగతా 9 గ్రీన్ ఫీల్డ్ హైవేలు మార్చి 2025 నాటికి పూర్తవుతాయి.

ఈ 23 హైవేల పొడవు 7800 కిలోమీటర్లు కాగా.. వీటి నిర్మాణానికి రూ.3.3 లక్షల కోట్లు అవసరం. ఈ హైవేలు హైదరాబాద్, వైజాగ్, విజయవాడల మీదుగానూ వెళ్లనున్నాయి. ఈ హైవేల నిర్మాణానికి నిధుల కోసం ఎన్‌హెచ్ఏఐ స్పెషల్ పర్పస్ వెహికిల్స్‌ను ఏర్పాటు చేయనుంది.

నూతన హైవేల నిర్మాణం వల్ల తెలంగాణకు గణనీయంగా ప్రయోజనం చేకూరనుంది. 23 హైవేల్లో 3 హైదరాబాద్ నగరంతో కనెక్ట్ అవుతుండటం విశేషం. హైదరాబాద్ నుంచి భద్రాచలం మీదుగా విశాఖపట్నానికి ఒక హైవేను నిర్మించనున్నారు. ఇందుకోసం 221 కి.మీ. మేర కొత్తగా హైవే నిర్మిస్తారు. 2025 మార్చి నాటికి దీని నిర్మాణం పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

హైదరాబాద్-రాయ్‌పూర్ మధ్య మరో హైవేను నిర్మిస్తారు. దీని పొడవు 330 కి.మీ. ఇండోర్, హైదరాబాద్ నగరాల మధ్య 713 కి.మీ. పొడవైన హైవేను నిర్మించనున్నారు. రాయ్‌పూర్-విశాఖ నగరాల మధ్య 464 కి.మీ. పొడవైన హైవేను నిర్మిస్తారు.

తెలంగాణను తాకుతూ.. భద్రాచలం మీదుగా నాగ్‌పూర్, విజయవాడ నగరాల మధ్య 457 కి.మీ. పొడవైన హైవేను నిర్మిస్తారు. సోలాపూర్-కర్నూలు నగరాల మధ్య నిర్మించనున్న హైవే కూడా తెలంగాణ మీదుగా వెళ్లనుంది.

ఇక దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే.. 281 కి.మీ. మేర బెంగళూరు శాటిలైట్ రింగ్ రోడ్డును 2024 మార్చి నాటికి నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బెంగళూరు-చెన్నై, చెన్నై-సేలం నగరాల మధ్య హైవే నిర్మించనున్నారు.

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   10 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   14 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   11 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   15 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   13 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   18 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   17 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   20 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   16 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   20 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle