newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

తెరాస మున్సిపల్ టికెట్ల కోసం ఏపీ మంత్రుల లాబీయింగ్..!

11-01-202011-01-2020 13:40:22 IST
Updated On 13-01-2020 13:06:09 ISTUpdated On 13-01-20202020-01-11T08:10:22.520Z11-01-2020 2020-01-11T08:10:16.184Z - 2020-01-13T07:36:09.075Z - 13-01-2020

తెరాస మున్సిపల్ టికెట్ల కోసం ఏపీ మంత్రుల లాబీయింగ్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో అన్ని పెద్ద పార్టీలలో టికెట్ల కోసం భారీ పోటీ నెలకొంది. అధికార తెరాస పార్టీలో అయితే ఇది ఇది తారాస్థాయికి చేరింది. ఆశావహులు తెరాస భవన్ చుట్టూ చక్కర్లు కొడుతూ టికెట్ల కోసం విశ్వప్రయత్నాలు చేశారు. అధికార పార్టీలో టికెట్లు దక్కని వాళ్ళు ఒకరిద్దరు ఆత్మహత్యాయత్నాలు కూడా చేశారు. చివరికి నామినేషన్ల గడువు ముగిసింది.. ఒక గండం గట్టెక్కింది.

మున్సిపల్ అభ్యర్థుల ఎంపిక కోసం తెరాస పార్టీ ఓ కమిటీని నియమించగా గెలుపు బాధ్యత మాత్రం ఎమ్మెల్యేలు.. మంత్రుల భుజాలపై మోపారు. ఈ క్రమంలోనే మంత్రులు, నేతలు కూడా వారి వర్గానికి.. అనుచరులకు టికెట్లు దక్కేలా అధిష్టానం వద్ద గట్టి ప్రయత్నాలు చేశారు. రాష్ట్రం మొత్తంగా మెజార్టీ స్థానాలలో ఆర్ధిక బలం ఉన్న వారికే టికెట్లు కేటాయించినట్లుగా కనిపించింది.

అందుకే పార్టీ కోసం పనిచేసిన నేతలు.. ఉద్యమం సమయం నుండి పోరాటం చేసిన మరికొందరు అసంతృప్తులు ఆవేదనలో కండువాలు కూడా మార్చేస్తున్నారు. దీనికోసం తెరాస బుజ్జగింపులు మొదలు పెట్టింది. కాగా, తెరాస టికెట్ల పోటీలో ఏపీ మంత్రులు, అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్యేల నుండి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఫోన్లు చేసి లాబీయింగ్ ప్రయత్నాలు కూడా జరిగినట్లు తెలుస్తుంది.

హైదరాబాద్ నగరంలో ఏపీ ప్రజలు కీలకంగా ఉంటారని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అది కూడా హైదరాబాద్ చుట్టూ కొత్తగా ఏర్పడిన 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 17 మున్సిపాల్టీలలో ఏపీ ప్రజల శాతం ఇంకా ఎక్కువ. ఇందులో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో మెజార్టీ ప్రజలు ఏపీ వాళ్లే ఉండగా ఇక్కడ గెలుపు, ఓటములను డిక్లేర్ చేసేది కూడా వాళ్లే. వీళ్ళలో కోట్లకి పడగలెత్తిన వాళ్ళు ఉన్నారు.

ఇక సిటీకి దగ్గరలోని మణికొండ, తెల్లాపూర్, అమీన్పూర్, నార్సింగ్, పెద్ద అంబర్ పేట, బడంగ్ పేట, మీర్ పేటలో కొన్ని వార్డుల్లోనూ ఏపీకి చెందినవాళ్లే ఎక్కువ. ఇక్కడ ఉన్నవాళ్ళలో కూడా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మొదలుపెట్టి ఆ తర్వాత నాయకులుగా ఎదిగారు. గత ప్రభుత్వంలో వ్యాపారాల కోసం తెరాస పార్టీలో చేరి అక్కడ పార్టీలో కీలక నేతలుగా ఎదిగారు.

ఈక్రమంలోనే మున్సిపల్ టికెట్ల కోసం ఇక్కడి నేతలతో పాటు ఏపీలో తమకి అనుకూలమైన నేతలతో కూడా కేటీఆర్ కు రికమెండ్ చేయించారట. ఏపీ నేతలకు కూడా స్థానికంగా వీళ్ళతో పనులు ఉండడం.. అక్కడ కూడా ఆర్ధికంగా ప్రభావితం చేసే వ్యక్తులకి టికెట్లు కేటాయించాలని కేటీఆర్ తో లాబీయింగ్ ప్రయత్నాలు చేశారట. ఆర్ధిక కెపాసిటీ ఉన్నవాళ్లకే ప్రాధాన్యతగా పెట్టుకున్న తెరాస కూడా వీళ్ళలో కొందరు టికెట్లు కేటాయించినట్లుగా తెలుస్తుంది.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle