newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

తెరాస అసంతృప్తులను టార్గెట్ చేసిన రేవంత్!

11-01-202011-01-2020 02:20:06 IST
2020-01-10T20:50:06.362Z11-01-2020 2020-01-10T20:50:01.624Z - - 22-02-2020

తెరాస అసంతృప్తులను టార్గెట్ చేసిన రేవంత్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఆశించిన మేర పోరాటం చేయడం లేదన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాలలో సాధారణంగానే వినిపిస్తుంది. ఎవరికి వారు స్థానిక నేతలు తమ వర్గానికి చెందిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారే తప్ప రాష్ట్ర పార్టీ హైకమాండ్ మాత్రం అధికార పార్టీతో పోటాపోటీగా టఫ్ ఫైట్ ఇచ్చేందుకు ప్రయత్నించడం లేదు.

అయితే, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మాత్రం ఒకింత కసితో పనిచేస్తున్నట్లుగా వినిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ కంచుకోటకి వెళ్లి తెరాస పార్టీ అయనను ఓడించింది. అనంతరం పార్లమెంట్ ఎన్నికలలో రేవంత్ మల్కాజిగిరి నుండి పోటీచేసి ఎంపీ కాగలిగారు. అయితే ఇప్పుడు మున్సిపల్ బరిలో మల్కాజిగిరిలో రేవంత్ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇందులో భాగంగా రేవంత్ అక్కడ తెరాస పార్టీలో అసంతృప్తులను టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తుంది. తెరాసలో కీలక నేతలుగా ఉండి, ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న నేతలే టార్గెట్‌గా రేవంత్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. తాజాగా తెరాస నుండి మేయర్ స్థానాన్ని ఆశించి భంగపడ్డ దర్గ దయాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ బీ-ఫామ్ అందజేశారు.

దయాకర్ రెడ్డి పీర్జాధిగూడ ప్రాంతంలో మంచి పట్టున్నట్లు నేతగా చెప్పుకుంటారు. గత ఎన్నికలలో మంత్రి మల్లారెడ్డి గెలుపు ఆయన క్రీయాశీలకంగా వ్యవహరించారు. అయితే కొత్తగా వచ్చి, ఎన్నికలలో ఖర్చు పెట్టగలిగిన నేతలకు ప్రాధాన్యత కల్పించిన తెరాస పార్టీ పట్టున్న నేతలకు మొండి చేయి మిగిల్చింది. దానిని అనుకూలంగా మార్చుకోనందుకు పావులు కదిపారు.

ఇప్పటికే జిల్లాలో మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి.. మల్లారెడ్డి మధ్య విభేదాలున్నాయి. తన వర్గం నేతలకు టికెట్స్ ఇవ్వటం లేదని సుధీర్ రెడ్డి గుర్రుగా ఉండగా మల్లారెడ్డి మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన వర్గానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వినిపిస్తుంది. ఈ క్రమంలో దుర్గ దయాకర్ రెడ్డి పార్టీకి దూరమవడంతో తెరాసకి నష్టంగానే మారనుంది.

కాగా రేవంత్ సంప్రదింపుల అనంతరం మంత్రి మల్లారెడ్డి కూడా దుర్గ దయాకర్ ఇంటికి వెళ్లి సంప్రదింపులు జరిపారని వినిపించింది. తెరాసలోనే కొనసాగాలని కోరినట్లుగా తెలుస్తుండగా అందుకు దయాకర్ ససేమీరా అన్నారని.. అయితే రేవంత్ వర్గం కూడా దయాకర్ ఇంటికి వస్తున్నారన్న సమాచారంతో అయనను మంత్రి దయాకర్ ను తనతో పాటు తీసుకెళ్లారని ప్రచారం జరుగుతుంది. మరి ఈ వ్యవహారం ఏ మలుపులు తిరుగుతుందో కానీ రేవంత్ మాత్రం గట్టి ప్రయత్నాలలోనే ఉన్నట్లుగా కనిపిస్తుంది.

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   5 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   6 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   7 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   8 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   8 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   9 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   10 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   11 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   11 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   12 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle