newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

తుమ్మల వర్సెస్‌ కందాల! సీఎం కేసీఆర్‌ వద్దకు వివాదం?

21-11-201921-11-2019 11:47:38 IST
2019-11-21T06:17:38.352Z21-11-2019 2019-11-21T06:17:36.035Z - - 25-02-2020

తుమ్మల వర్సెస్‌ కందాల!  సీఎం కేసీఆర్‌ వద్దకు వివాదం?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ అధికార పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్సెస్‌ ప్రస్తుత ఎమ్మెల్యే కందాల ఉపేంద్ర రెడ్డిల మధ్య విబేధాలు భగ్గుమంటున్నాయి. పాలేరు నియోజకవర్గంలో పార్టీ కమిటీల్లోనూ, కార్యక్రమాల్లోనూ కందాల తమకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని తుమ్మల వర్గీయులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కేవలం కాంగ్రెస్‌ నుంచి తనవెంట వచ్చిన వారికే ప్రాధాన్యతను ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లి ఎన్నికల్లో ఓటమి తరువాత క్యాడర్‌కు కొంతదూరంగా ఉన్న తుమ్మల.. తన వర్గీయులకు అన్యాయం జరుగుతుండటంతో నియోజకవర్గ బాటపట్టారు. దీంతో తుమ్మల వర్సెస్‌ కందాల మధ్య రాజకీయ పోరు తారాస్థాయికి చేరింది.

ఖమ్మం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనూ చక్రంతిప్పిన నేత తుమ్మల నాగేశ్వరరావు. ఎన్టీఆర్‌ హయాం నుండి చంద్రబాబు హయాంలో నిన్నటివరకు కేసీఆర్‌ హయాంలో మంత్రిగా పనిచేశారు. అలాంటి తుమ్మలకు తాజాగా కందాల ఉపేంద్రరెడ్డి కొత్త తలనొప్పులు తెస్తున్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన తుమ్మల.. తరువాత టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కొద్దిరోజులకు పాలేరు నియోజకవర్గం నుండి ఉపఎన్నికల్లో పోటీచేసి గెలుపొందారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీచేసిన తుమ్మల ఓటమిపాలయ్యాడు. దీంతో అప్పటి నుండి నియోజకవర్గానికి, జిల్లా రాజకీయాలకు తుమ్మల కొంత దూరంగా ఉంటూ వస్తున్నారు.

కాంగ్రెస్‌ నుంచి బరిలో నిలిచి తుమ్మలపై గెలిచిన కందాల ఉపేంద్రరెడ్డి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. అప్పటి నుండి నియోజకవర్గంలో అంతాతానై పర్యటిస్తున్నారు. ఇటీవల జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి తన వెంట వచ్చిన వారికే అధికంగా టికెట్లు కేటాయించారని, ఇన్నాళ్లు పార్టీలో ఉన్న తమను విస్మరిస్తున్నారని తుమ్మల వర్గీయులు ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు కూడా తుమ్మల వర్గీయులు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలను పిలిపించిన కేటీఆర్‌.. అందరు కలిసి పార్టీ అభివృద్ధికోసం పనిచేయాలని సూచించారు.

కేటీఆర్‌ సూచనలతో కొంతకాలం వరకు నియోజకవర్గంలో ఎవరిపని వారుచేసుకుంటూ వెళ్లారు. తాజాగా పార్టీ కమిటీల ఏర్పాటుతో మళ్లిd విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎ మ్మెల్యే కందాల ఉపేంద్రరెడ్డి ఏకపక్షంగా పార్టీ కమిటీలు నియమిస్తున్నాడని, తుమ్మల వర్గీయులు ఆందోళనకు దిగారు. ఈ విషయాన్ని తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. ఇలా అయితే పార్టీలో ఉండలేమని, పొమ్మన కుండా పొగబెట్టినట్లుగా కందాల తీరు ఉందని తుమ్మల వద్ద ఆయన వర్గీయులు వాపోయారు. దీంతో ఓటమి తరువాత నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వస్తున్న తుమ్మల నియోజకవర్గంలో పర్యటనలు ప్రారంభించారు. దీంతో తుమ్మల వర్సెస్‌ కందాలగా పాలేరు నియోజకవర్గ రాజకీయాలు మారిపోయాయి.

ఇటీవల నియోజకవర్గంలో పర్యటించిన తుమ్మలకు ఆయన వర్గీయులు భారీగా స్వాగతం పలికారు. దీనిని చూసిన కందాల వర్గీయులుసైతం కందాల నియోజకవర్గ పర్యటనల సమయంలో అదేస్థాయిలో స్వాగతం పలుకుతూ హడావుడి చేస్తున్నారు. ఇలా ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో వర్గవిభేదాలు చేరాయి. కందాల తీరుపై ఇటీవల తుమ్మల వర్గీయులు సమావేశమయ్యారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో కాంగ్రెస్‌ నుంచి వచ్చిన వారికే అధిక ప్రాధాన్యత లభిస్తుందని, ఈ విషయాన్ని కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాలని వారు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మరోవైపు మంత్రిగా పలుసార్లు పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావుకు సీఎం కేసీఆర్‌కు అత్యంత దగ్గరి వ్యక్తి. కేసీఆర్‌ వద్దకు నేరుగా వెళ్లగలిగే చనువు తుమ్మలకు ఉంది. దీంతో తుమ్మల పాలేరు నియోజకవర్గంలో కందాల వ్యవహరిస్తున్న తీరును సీఎం కేసీఆర్‌ వద్దకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో వర్గాలను తయారు చేయటం వల్ల పార్టీకి నష్టం చేకూరుతుందని తుమ్మల సీఎంకు వివరించినట్లు సమాచారం. దీంతో సీఎం కేసీఆర్‌ కందాల ఉపేంద్ర రెడ్డిని మందలించినట్లు నియోజకవర్గంలో ప్రచారం సాగుతుంది. పార్టీకి చేటుతెచ్చే కార్యక్రమాలు చేపట్టవద్దని, అందరినీ కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సీఎం కేసీఆర్‌ కందాలకు చురకలంటించినట్లు తెలుస్తోంది. మరి ఇప్పటికైనా పాలేరు నియోజకవర్గంలో తుమ్మల, కందాల వర్గీయుల మధ్య విభేదాలు సర్దుమణిగి ఏమేరకు కలిసి పనిచేస్తారో వేచిచూడాల్సిందే.  


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle