newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

తహసిల్దారును చంపి.. తానూ చచ్చి... ఏం సాధించినట్లు?

08-11-201908-11-2019 11:46:04 IST
2019-11-08T06:16:04.747Z08-11-2019 2019-11-08T06:15:58.658Z - - 22-02-2020

తహసిల్దారును చంపి.. తానూ చచ్చి... ఏం సాధించినట్లు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మండల రెవెన్యూ అధికారిణి విజయా రెడ్డిని హైదరాబాద్‌ శివార్లలోని తన ఆపీసు గదిలోనే తగులబెట్టి చంపేసిన కేసులో నిందితుడు కె. సురేష్ తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ గురువారం ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో చనిపోయాడు.  తన భూమికి సొంత పట్టా ఇవ్వలేదనే కసితో విజయారెడ్డిపై పెట్రోలు పోసి తగులబెట్టిన సందర్భంలో సురేష్‌కి కూడా 60 శాతం గాయాలు తగిలాయి. బుధవారం రాత్రి సురేష్ పరిస్థితి విషమించిందని, గాయాలు తగ్గని స్థితిలో గురువారం మధ్యాహ్నం తర్వాత 3.30 గంటలకు సురేష్ చనిపోయాడని ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. 

ఆసుపత్రిలో చేరినప్పుడే సురేష్ పరిస్థితి విషమించింది. గురువారం అతడిని వెంటిలేటర్‌లో ఉంచామని కానీ కాలిన గాయాలకు తట్టుకోలేక సురేష్ చనిపోయాడని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ చెప్పారు.

అయితే సురేష్ ఎందుకంత ఘాతుకానికి పాల్పడ్డాడో, తన ఉద్దేశమేమిటో ఇంకా స్పష్టం కాలేదని పోలీసులు చెప్పారు. అబ్దుల్లాపుర్ మెట్ ఇన్‌స్పెక్టర్ ఎస్ దేవేందర్ మీడియాతో మాట్లాడుతూ విచారణ కొనసాగుతోందని చెప్పారు. వివాదానికి కారణమైన భూమిని పరిశీలిస్తున్నామని, ఈ కేసుతో సబంధం  ఉన్న వ్యక్తులతో మాట్లాడుతున్నామని పేర్కొన్నారు. సురేష్ చనిపోవడానికి ముందుగా మేజిస్ట్రేట్ అతడి వాంగ్మూలాన్ని తీసుకున్నారని, ఆ వివరాలు కూడా త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. 

తన భాగానికి చెందిన భూమికి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వనందుకు పూర్తిగా నిరాశలో మునిగిపోయాయని సురేష్ తన మరణ వాంగ్మూలంలో చెప్పినట్లు తెలుస్తోంది. సురేష్ చేసిన పనికి తన కుటుంబం షాక్‌కు గురైంది. తహసిల్దార్‌పై దాడి చేయవలిసిందిగా అతడిని ఎవరైనా పురికొల్పి ఉంటారని వారు ఆరోపించారు. మరిన్ని ఆధారాల కోసం సురేష్ ఫోన్ కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పారు

దాడిలో మృతి చెందిన తహసిల్దార్ విజయారెడ్డికి భర్త, ఇద్దరు పిల్లలున్నారు. ఆమె మూడేళ్ల క్రితం ప్రారంభించిన అబ్దుల్లాపుర్మెట్ ఆపీసులో తొలి తహసిల్దారుగా నియమితులయ్యారు. ఆమెపై దాడి జరిగినప్పుడు ఆమెను కాపాడాలని ప్రయత్నించిన ఆమె డ్రైవర్ గురునాథం శరీరం కూడా అంటుకుని తర్వాతరోజున అసుపత్రిలో మరణించాడు.

విజయారెడ్డి దారుణ హత్య రెవెన్యూ ఉద్యోగులలో తీవ్రమైన నిరసనను రేకెత్తించింది. గత కొన్ని నెలలుగా రెవెన్యూ ఉద్యోగులను అనేక సందర్భాల్లో అవమానించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వారు ధ్వజమెత్తారు. మూడురోజులపాటు విధులకు బాయ్ కాట్ చేయడమే కాకుండా తప్పు చేసిన వాడిని, పురికొల్పినవారిని కూడా పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.

ఇవన్నీ పక్కనబెడితే ఈ మొత్తం ఉదంతంలో అమూల్యమైన ప్రాణాలను కోల్పోవడం తప్పిస్తే ఎవరికీ ఏమీ ఒరగకపోవడం విచారకరం. తాను చే్స్తున్న ఘాతుక చర్య వల్ల ప్రభుత్వ అధికారిణి భర్తకు, పిల్లలకు తీరని శోకం మిగిలించడం తప్పితే నిందితుడు సురేష్ సాధించేమీ లేదు. పైగా సంవత్సరాలుగా భూమిపై పట్టా సాధించుకోవడంలో విఫలమైన బాదితుడిగా తనమీద ఉన్న సానుభూతి కూడా కరిగిపోయింది. తన కుటుంబం పరువు ఇవాళ నడిబజారులో నిలబడింది. చివరకు తన ప్రాణాలూ హరీమన్నాయి. 

ఈ భయానక పాశవిక కాండలో ఎవరు ఏం మిగిల్చుకున్నట్లు.. క్షణికావేశంలో ఏం చేస్తున్నదీ కూడా తెలియని ఉద్రేకంలో మనుషులు తెగిస్తే ఎన్ని దారుణ ఫలితాలు సంభవిస్తాయో తహసిల్దారు నుంచి సురేష్ దాకా జరుగుతూ వచ్చిన ప్రాణ హరణ చర్యలు సమాజానికి కనువిప్పుగా అయినా మిగులుతాయా.. అనేది సమాధానం లేని ప్రశ్నగానే మిగులుతోంది

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   2 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   3 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   4 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   5 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   6 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   6 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   8 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   8 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   8 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   9 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle