newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తల్లిదండ్రుల కళ్లెదుటే తిరిగిరాని లోకాలకు....

25-08-202025-08-2020 08:53:31 IST
Updated On 25-08-2020 09:16:46 ISTUpdated On 25-08-20202020-08-25T03:23:31.749Z25-08-2020 2020-08-25T03:23:23.908Z - 2020-08-25T03:46:46.066Z - 25-08-2020

తల్లిదండ్రుల కళ్లెదుటే తిరిగిరాని లోకాలకు....
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సరదా ఒక్కోసారి తీరని విషాదానికి కారణం అవుతుంది. విహారానికి వెళ్లిన కూతురు జలపాతంలో కొట్టుకుపోవడంతో ఆ తల్లిదండ్రుల శోకానికి అంతే లేకుండా పోయింది. బయ్యారంలో జరిగిన ఈ ఘటన అందరినీ కలిచివేసింది.  సరదాగా జలపాతం వద్దకు వెళ్లిన ఆ తల్లిదండ్రులకు ఊహించిన సంఘటన ఎదురైంది.  కళ్లెదుటే కూతురు కన్నుమూసి తీరని వేదన మిగిల్చింది.

మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. బయ్యారానికి చెందిన అంబటి సతీష్‌ కుటుంబంతో కలిసి మండలంలోని చింతోనిగుంపు జలపాతానికి వెళ్లారు. ఆయన కుమార్తె పూజిత(18) నీటిలోకి దిగగా.. కుమారుడు శివాజీ ఫొటో తీసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో పూజిత ఒక్కసారిగా నీటిలో పడిపోవడంతో.. చేయి పట్టుకొని పైకిలాగేందుకు యత్నించిన శివాజీ కూడా జారిపోయాడు. సతీష్‌.. శివాజీని బయటకు లాగారు. 

పూజిత కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. భారీగా వరద రావడంతో జలపాతంలో ఆ యువతి గల్లంతైంది. పోలీసులు స్థానిక యువకుల సాయంతో గాలించగా.. పూజిత మృతదేహం లభ్యమైంది. అప్పటివరకూ తమతో గడిపిన కూతురు క్షణాల్లోనే తిరిగిరాని లోకాలకు చేరడంతో వారు గుండెలవిసేలా రోదించారు. ఇంటర్‌ చదివిన పూజిత వెటర్నరీ కోర్సు పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉంది. త్వరలో తమ చేతికి అందుతుందని, కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటుందని భావించిన తల్లిదండ్రుల ఆశల్ని జలపాతం మింగేసింది. ఆ జలపాతం తల్లిదండ్రులకు కూతురిని, సోదరుడికి సోెదరిని దూరం చేసింది. అందుకే, జలపాతాలు, నదుల వద్ద సెల్ఫీల కోసం ప్రయత్నించి ప్రాణాలకు మీదకు తెచ్చుకోవద్దు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle