newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తలుపు తీస్తే తలసాని.. షాక్ తిన్న భట్టి

17-09-202017-09-2020 14:29:14 IST
Updated On 17-09-2020 14:37:31 ISTUpdated On 17-09-20202020-09-17T08:59:14.788Z17-09-2020 2020-09-17T08:59:11.737Z - 2020-09-17T09:07:31.644Z - 17-09-2020

తలుపు తీస్తే తలసాని.. షాక్ తిన్న భట్టి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రతిపక్షాలు సవాల్ చేస్తే ప్రభుత్వాలు వాటిని ఒంటిచేత్తో తోసేసి తమ తీరున తాము సాగటం మనందరికీ తెలిసిన విషయమే. అసెంబ్లీ వేదికగా కానీ, బయటగాని రాజకీయ నాయకులు సవాళ్లు చేసుకుంటే, వాటి నిరూపణకు ఎప్పుడూ ఎవరూ ప్రయత్నించరు. కానీ ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తెలంగాణలో ఎవరూ ఊహించని ఒక అనూహ్య ఘటన జరిగింది. ప్రతిపక్ష పార్టీ ఆరోపణలకు చెక్ పెడుతూ, అధికార పార్టీ చేసిన అభివృద్ధిని చూపించడం కోసం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లడంతో ఈ వ్యవహారంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

గురువారం హైదరాబాద్‌లో కనీవినీ ఎరుగని ఒక అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. శాసనసభలో కాంగ్రెస్‌పక్ష నేత మల్లుభట్టి విక్రమార్క గురువారం ఉదయం తన ఇంటి తలుపును ఎవరో తట్టినట్లు వినిపించడంతో తలుపు తీశారు. చూస్తే ఎదురుగా రాష్ట్ర మంత్రి, ప్రత్యర్థి తలసాని యాదవ్ ఉన్నారు. తన గుమ్మంలో మంత్రి నిలబడి ఉండటం చూసి ఖంగుతున్న భట్టివిక్రమార్క తేరుకుని సాదరంగా లోపలికి ఆహ్వానించారు. పరామర్శలయ్యాక తలసాని అసలు విషయం చెప్పేశారు. బుధవారం శాసనసభలో భట్టి తనకు విసిరిన సవాలును స్వీకరించేందుకే ఇప్పుడు ఆయన ఇంటికి వచ్చాననీ, పోదాం పదండి అంటూ భట్టిని మంత్రి తలసాని ఆహ్వానించారు.

వివరాల్లోకి వెళితే.. శాసనసభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లుభట్టి విక్రమార్క విసిరిన సవాలును మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్వీకరించారు. మహానగరంలో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం జరిపితే తమకు చూపించాలని భట్టి డిమాండ్‌ చేయగా.. దానికి తలసాని అంగీకరించారు. దీంతో గురువారం ఉదయం మంత్రి తలసాని అధికారులతో నేరుగా భట్టి విక్రమార్క ఇంటికి చేరుకున్నారు. తమ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను చూపిస్తామని తమతో రావాలని డిమాండ్‌ చేశారు. దీనికి అంగీకరించిన భట్టి, తలసానితో కలిసి ఒకే కారులో బయలుదేరారు. 

అయితే తొలుత మంత్రిని చూసి షాక్‌ అయిన భట్టి.. తలసానిని సాదరంగా లోపలకి ఆహ్వానించారు. ఇద్దరు కలిసి కాసేపు సరదాగా చర్చించుకుని అనంతరం బయలుదేరి వెళ్లారు. అధికారులతో కలిసి ఇద్దరూ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించనున్నారు. బుధవారం శాసనసభలో అసలు ఏం జరిగింది అంటే.. రాష్ట్ర శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడేందుకు కొద్దినిమిషాల ముందు కాంగ్రెస్‌ శాసనసభా పక్షనేత భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ల మధ్య వాడీవేడీ వాగ్వాదం జరిగింది. టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలకు భట్టి కౌంటర్‌ చేయడం, దాన్ని తప్పుపడుతూ మంత్రులు వ్యాఖ్యలు చేయడంతో కొద్దిసేపు సభ వేడేక్కింది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీనేనని భట్టి చెబితే.. తెలంగాణ మాటెత్తే అర్హత లేదని మంత్రులు తీవ్ర స్ధాయిలో విరుచుకుపడటంతో కొద్దిసేపు సభ వాడివేడిగా సాగింది.

చర్చలు, వాదోపవాదాలు తీవ్రంగా సాగుతున్న సమయంలో జోక్యం చేసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి.. అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు నిర్మించి ఇస్తామని అన్నారని, ఎన్నికలప్పుడే ఇళ్లు గుర్తొస్తాయంటూ చురకలంటించారు. అసలు లక్ష ఇళ్లు ఎక్కడున్నాయో చూపించాలన్నారు. ఈ సమయంలో మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ కల్పించుకుంటూ ‘రేపు ఉదయం మీ ఇంటికి వస్తా. హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు నిర్మించారో స్వయంగా చూపిస్తా’ అన్ని గట్టిగా అన్నారు. దానికి భట్టి స్పందిస్తూ, ‘టైం చెబితే మంత్రి ఇంటికి వస్తా..లక్ష ఇళ్లు ఎక్కడ ఇచ్చారో, కట్టారో చూయించాలి’ అని కౌంటర్‌ ఇచ్చారు. 

అనంతరం చివరలో మళ్లీ మాట్లాడిన మంత్రి కేటీఆర్‌, భట్టి విమర్శలను దీవెనలుగా తీసుకుంటానని, ఆయన తనకు మంచి మిత్రుడేనని నవ్వుతూ అనడంతో అంతా శాంతించారు. ఏదేమైనా ప్రతిపక్ష సభ్యుడు సవాలు విసరటం.. 24 గంటలు పూర్తి కాకముందే ఆ సవాలును సాక్షాత్తూ మంత్రే స్వీకరించి నేరుగా ప్రతిపక్ష సభ్యుడి ఇంటికే వచ్చ లక్ష ఇళ్లు చూపిస్తా పదా అంటూ ఆహ్వానించడం వినడానిక సరదాగానే ఉంది కానీ అధికార, ప్రతిపక్షాల మధ్య సంబంధాలు ఉండాల్సింది ఇలా కదా అంటూ అందరూ చర్చించుకుంటున్నారు.

నా రూటే సెప‌రేటు

నా రూటే సెప‌రేటు

   28 minutes ago


బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   14 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   15 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   14 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   18 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   19 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   18 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   20 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   21 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle