newssting
BITING NEWS :
*హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో కారు బీభత్సం. అదుపుతప్పి హోటల్ లోకి దూసుకెళ్లిన కారు. తప్పిన ప్రమాదం, కారు వదలి పరారైన యువకులు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లుగా అనుమానం * అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న ట్రంప్. ఎయిర్ పోర్ట్ నుంచి ర్యాలీగా మొతేరా స్టేడియానికి ట్రంప్. మధ్యాహ్నం 12:30 గంటలకు నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగం*విశాఖ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌పై స్పందించిన నేవీ..మిలీనియం టవర్స్‌లో సచివాలయం పెట్టుకోవడానికి అనుమతి నిరాకరించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం*జనవరి 10న అమరావతి రైతుల మీద జరిగిన లాఠీఛార్జ్‌పై విచారణ ప్రారంభం..హైకోర్టు ఆదేశాల మేరకు తుళ్లూరులో విచారణ ప్రారంభించిన పోలీసులు..గుంటూరు అడిషనల్‌ ఎస్పీ స్వామిశేఖర్‌ నేతృత్వంలో కొనసాగుతున్న ఎంక్వైరీ *సికింద్రాబాద్ : బోయిన్ పల్లిలోనీ ఓ కెమికల్ గో డౌన్ లో భారీ అగ్నిప్రమాదం*చైనాలో 2400 పైగా చేరిన కోవిద్ 19 వైరస్ మృతులు. 78 వేలకు చేరిన వైరస్ బాధితుల సంఖ్య. ఇటలీలో కరోనా వైరస్ కారణంగా ఇద్దరు మృతి

తప్పయింది సారూ అన్నా కనికరించలే.. పైగా మూకుమ్మడి అరెస్టులు

27-11-201927-11-2019 09:51:37 IST
Updated On 27-11-2019 15:51:13 ISTUpdated On 27-11-20192019-11-27T04:21:37.229Z27-11-2019 2019-11-27T04:21:24.995Z - 2019-11-27T10:21:13.960Z - 27-11-2019

తప్పయింది సారూ అన్నా కనికరించలే.. పైగా మూకుమ్మడి అరెస్టులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మంగళవారం నిజంగానే తెలంగాణ ఆర్టీసీ సిబ్బందికి, వారి కుటుంబాలకు అమావాస్యనే మిగిల్చింది. తెలంగాణ గడ్డపై ఎన్నడూ చూడని భయానక దృశ్యాలకు నిన్నటి దినం వేదికై నిలిచింది. ఆర్టీసీ సమ్మె విరమించినందున తమను విధుల్లోకి తీసుకోవాలంటూ మంగళవారం సూర్యోదయానికి ముందే వచ్చి డిపో గేట్ల వద్ద ఎదురుచూసిన కార్మికులకు  నిరాశే ఎదురైంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేనందున తాము విధుల్లోకి తీసుకోబోమని డిపో మేనేజర్లు తెగేసి చెప్పటంతో వారిలో తీవ్ర ఆవేదన వ్యక్తమైంది. ముఖ్యంగా మహిళా కండక్టర్లు, సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. 2 నెలలుగా వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నామని, కుటుంబం గడవటమే కష్టంగా ఉన్నందున కనికరించాలంటూ కాళ్లావేళ్లా పడ్డా అధికారులు స్పందించని దుస్థితి ఎదురైంది. 

మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్మికులు డిపోల వద్దే పడిగాపులు కాశారు. కొందరు ఆవేదనతో ఆవేశానికి లోనై అధికారులతో వాదనకు దిగారు. వారు డిపోలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుని చివరకు అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. పిల్లలతో వచ్చిన కొందరు మహిళా సిబ్బందిని పోలీసులు అలాగే స్టేషన్లకు తరలించారు. ఇలాగే వ్యవహరిస్తే ఆత్మహత్యలే తమకు శరణ్యమంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ సహా రాష్ట్ర వ్యాప్తంగా 97 డిపోల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రికార్డు స్థాయిలో 52 రోజులపాటు నిర్వహించిన సమ్మెను విరమిస్తున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. కార్మికులందరూ మంగళవారం ఉదయం 6 గంటలకే విధుల్లో చేరేందుకు డిపోలకు వెళ్లాల్సిందిగా జేఏసీ నేతలు సూచించారు. దీంతో చాలా డిపోల వద్ద ఉదయం 5 గంటలకే కార్మికుల రాక మొదలైంది. సమ్మెను విరమించినా, కోర్టులో కేసు తేలే వరకు విధుల్లోకి తీసుకోవటం సాధ్యం కాదని సోమవారం రాత్రే ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 

ఎవరినీ డిపోల్లోకి కూడా రానీయొద్దని, విధుల్లో చేరతామంటూ ఇచ్చే లేఖలు కూడా తీసుకోవద్దంటూ అధికారుల నుంచి డిపో మేనేజర్లకు రాత్రే ఆదేశాలు అందాయి. మూకుమ్మడిగా కార్మికులు వచ్చే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసు భద్రత ఏర్పాటు చేసుకోవాలని కూడా సూచించారు. దీంతో డిపో మేనేజర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సోమవారం అర్ధరాత్రి నుంచి డిపోలు, బస్టాండ్ల వద్ద భద్రత కల్పించాల్సిందిగా కోరారు. దీంతో అన్ని చోట్లకు పోలీసులు చేరుకున్నారు. ఉదయం వచ్చే కార్మికులు డిపోల వద్దకు చేరుకోకుండా ముందే అడ్డుకున్నారు. తాము గొడవ చేయటానికి రాలేదని, తాము సమ్మెలోనే లేమని, డిపో మేనేజర్లను కలసి డ్యూటీ కేటాయించాలని కోరుతామని అడిగినా పోలీసులు వినిపించుకోలేదు. 

దీంతో పలు డిపోల్లో మహిళా సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. కొన్ని చోట్ల పోలీసులతో కార్మికులు వాదనకు దిగారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బలప్రయోగం చేశారు. దీంతో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేదాకా తాము చేసేదేమీ లేదని డిపో మేనేజర్లు స్పష్టం చేయటంతో వారు నిరాశతో వెనుదిరిగారు. బుధవారం ఉదయం కూడా కార్మికులంతా డిపోల వద్దకు వెళ్లి డ్యూటీలు వేయాలని కోరాల్సిందిగా జేఏసీ నేతలు మంగళవారం సూచించారు. పోలీసులు అరెస్టు చేసినా వెనుకంజ వేయొద్దని చెప్పారు.

Image result for TSRTC Strike Call Off Strike But Management Talks Tough

రాజధానిలో వందలాది మంది కండక్టర్లు, డ్రైవర్లు, సిబ్బందిని అరెస్టు చేశారు. మేడ్చల్‌ డిపోలో కార్మికులు పోలీసులను ప్రతిఘటించారు. మహిళా కండక్టర్లు బోరుమని విలపించారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో మంగళవారం ఆర్టీసీ బస్సు డిపోల ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉదయం 5 గంటల నుంచి డిపోల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్‌ విధించారు. డిపోల ముందుకు వచ్చిన కార్మికులతో పాటు పరిసరాల్లో గుంపులుగా ఉన్న ఆర్టీసీ కార్మికులను గుర్తించి స్టేషన్‌లకు తరలించారు. మహిళా కండక్టర్లను సైతం పోలీసులు వదల్లేదు. ఉదయం 6.30 గంటలకు అదుపులోకి తీసుకున్న పోలీసులు సరైన భోజన వసతి కల్పించలేదని, దీంతో మధుమేహ వ్యాధి ఉన్న కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆర్టీసీ జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

‘మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇంటి అద్దే. ఇతర అవసరాలకు డబ్బులు లేక కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. దయచేసి మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి.. అయ్యా కేసీఆర్‌ సార్‌ తప్పయ్యింది.. మరో సారి సమ్మె చెయ్యం.. నువ్వు చెప్పినట్టే వింటాం’అంటూ ఆర్టీసీ కార్మికులు నిజామాబాద్‌ డిపో మేనేజర్‌ కాళ్లపై పడి వేడుకున్నారు. బోధన్, ఆర్మూర్, నిజామాబాద్‌ డిపో–1, నిజామాబాద్‌ డిపో–2లకు కార్మికులు ఉదయం 5 గంటలకు విధుల్లో చేరడానికి వచ్చారు. కార్మికులను లోనికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కామారెడ్డిలో 120 మంది, బాన్సువాడలో 80, బోధన్‌లో 29 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

సమ్మె విరమించినా ఆర్టీసీ కార్మికులను అధికారులు విధులకు అనుమతించట్లేదని మనస్తాపం చెంది ఓ ఆర్టీసీ డ్రైవర్‌ గుండెపోటుతో మృతి చెందాడు. నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం మంగళపాడ్‌కు డ్రైవర్‌ కర్ణం రాజేందర్‌ (52) సోమవారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స కోసం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

మరోవైపున విధుల్లో చేరేందుకు వచ్చిన కార్మికులను అరెస్టు చేయటాన్ని జేఏసీ తీవ్రంగా ఖండించింది. నెలన్నర ముందే సమ్మె నోటీసు ఇచ్చినా స్పందించకుండా కాలయాపన చేసి, సమ్మెలోకి వెళ్లేలా చేసి ఇప్పుడు నెపాన్ని కార్మికులపై నెట్టడం సరికాదని జేఏసీ మండిపడింది. ప్రభుత్వం చెబుతున్న లెక్కలేవీ సరి కావని, ఆర్టీసీ నిర్వహణ కష్టమని చెప్పటం తప్పేనని పేర్కొంది. ప్రభుత్వం ఇవ్వాల్సిన రీయింబర్స్‌ మొత్తాన్ని ఎప్పటికప్పుడు ఇస్తూ, నష్టాల రూట్లలో పన్ను మినహాయింపు ప్రకటించి తమకు అప్పగిస్తే ఆర్టీసీని కాళ్లమీద నిలబడేలా చేస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది. 

 

రుణమాఫీలు శాశ్వత పరిష్కారం కాదు. గిట్టుబాటు ధరలే సమస్య: ఉపరాష్ట్రపతి

రుణమాఫీలు శాశ్వత పరిష్కారం కాదు. గిట్టుబాటు ధరలే సమస్య: ఉపరాష్ట్రపతి

   10 hours ago


తెలంగాణలో కలకలం రేపిన 'దొంగలతో దోస్తీ' కథనం!

తెలంగాణలో కలకలం రేపిన 'దొంగలతో దోస్తీ' కథనం!

   14 hours ago


‘‘ఈజీవో నాపై వేధింపులకు పరాకాష్ట’’బాబు ట్వీట్

‘‘ఈజీవో నాపై వేధింపులకు పరాకాష్ట’’బాబు ట్వీట్

   15 hours ago


నూజివీడు ఘటనపై మంత్రి సురేష్ సీరియస్

నూజివీడు ఘటనపై మంత్రి సురేష్ సీరియస్

   15 hours ago


మిలీనియం టవర్స్ చుట్టూ అల్లుకున్న రాజకీయం!

మిలీనియం టవర్స్ చుట్టూ అల్లుకున్న రాజకీయం!

   15 hours ago


భూములు లాక్కోవడంలేదు.. తప్పుచేయకుంటే ఎందుకంత భయం?

భూములు లాక్కోవడంలేదు.. తప్పుచేయకుంటే ఎందుకంత భయం?

   16 hours ago


విద్యార్ధుల భవిష్యత్తే మాకు ముఖ్యం... నూజివీడు ట్రిపుల్ ఐటీ వీసీ హేమచంద్రారెడ్డి

విద్యార్ధుల భవిష్యత్తే మాకు ముఖ్యం... నూజివీడు ట్రిపుల్ ఐటీ వీసీ హేమచంద్రారెడ్డి

   16 hours ago


సిట్‌కు స‌హ‌క‌రించే సీన్ ఉందా..?

సిట్‌కు స‌హ‌క‌రించే సీన్ ఉందా..?

   16 hours ago


12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   22-02-2020


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   22-02-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle