newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తడిసి ముద్దయిన హైదరాబాద్.. ముంబైకి రెడ్ అలర్ట్

15-07-202015-07-2020 18:52:36 IST
2020-07-15T13:22:36.336Z15-07-2020 2020-07-15T13:22:20.745Z - - 23-04-2021

తడిసి ముద్దయిన హైదరాబాద్.. ముంబైకి రెడ్ అలర్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్ లో బుధవారం మధ్యాహ్నం నుంచి భారీవర్షం పడుతోంది. దీంతో వీధులన్నీ వాననీటితో నిండిపోయాయి. మూడుగంటలుగా వర్షం కురుస్తుండడంతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. నగరం అంతా కుండపోత వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, కూకట్‌పల్లి, మూసాపేట, జేఎన్‌టీయూ, ప్రగతినగర్‌, ఉప్పల్‌, నాగోల్‌, ఈసీఐఎల్‌, చిక్కడపల్లి, బాలానగర్‌లో భారీ వర్షం పడుతోంది. భారీ వర్షం కారణంగా పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలోకి కూడా భారీగా నీరు చేరడంతో రోగులు నానా అవస్థలు పడ్డారు. నిలబడడానికి కూడా అవకాశం లేదు. 

మోకాలి వరకూ ఉస్మానియా వార్డుల్లోకి నీరు చేరింది. తెలంగాణ జిల్లాల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. మధ్యాహ్నం మూడు గంటల వరకు సంగారెడ్డి జిల్లా అన్నసాగర్‌లో 15.3 సెం.మీ, సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో 12 సెం.మీ, కామారెడ్డి జిల్లా సోమూర్‌లో 10.6 సెం.మీ, భద్రాద్రి జిల్లా సీతారామపట్నంలో 9.6 సెం.మీ, మేడ్చల్‌ జిల్లా బాలానగర్‌లో 8.7 సెం.మీ, సంగారెడ్డి జిల్లా కాంగెటిలో 8.7 సెం.మీ, కామారెడ్డి బిచుకుందా 8.6 సెం.మీల వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. 

ఇటు కరోనా వైరస్ మహమ్మారితో సతమతం అవుతున్న ముంబైని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముంబైకి భారత వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. ముంబైతో పాటు థానే, రాయ్‌గఢ్‌, రత్నగిరి జిల్లాల్లో రానున్న 18 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు మంగళవారం నాటి ఆరెంజ్‌ అలెర్ట్‌ను రెడ్‌ అలెర్డ్‌గా మారుస్తూ బుధవారం ప్రత్యేక బులెటిన్‌ విడుదల చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.

గురువారం కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు వెళ్లవద్దని సూచించింది. మంగళవారం రాత్రి నుంచి ముంబైలో కుండపోతగా వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యుత్‌, మంచినీటి సరఫరా, రవాణా వ్యవస్థకు అంతరాయం కలిగే అవకాశం ఉందని బీఎంసీ అధికారులు తెలిపారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మునిసిపల్ కార్పోరేషన్ అధికారులను సీఎం ఉద్దవ్ థాకరే ఆదేశించారు. 

 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   2 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   4 hours ago


ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

   15 minutes ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   3 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   5 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   5 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   6 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle