తగ్గుతున్న కూరగాయల ధరలు.. జనం హ్యాపీ
24-01-202024-01-2020 09:22:39 IST
2020-01-24T03:52:39.897Z24-01-2020 2020-01-24T03:52:36.927Z - - 16-04-2021

తెలంగాణలో రెండునెలల పాటు కూరగాయల ధరలు ఠారెత్తించాయి. ముఖ్యంగా ఉల్లి ధరలకు కోయకుండానే కన్నీళ్ళు వచ్చాయి. క్రికెట్ మ్యాచ్ లో స్కోరులాగా సెంచరీలు దాటేసింది ఉల్లి. దీంతో ఉల్లిని కొనేందుకు జనం ఇబ్బంది పడ్డారు. రాష్ట్రప్రభుత్వాలు ఉల్లిని సబ్సిడీ ధరలకు అందించాయి. గత వారం రోజులుగా కూరగాయల ధరలు దిగి వచ్చాయి. కూరగాయల ధరలు గత నెల రోజుల క్రితంతో పోలిస్తే బాగా తగ్గాయి. తెలంగాణ జిల్లాల నుంచి భారీఎత్తున కూరగాయలు ఉత్పత్తి అయి మార్కెట్‌ను ముంచెతత్డంతో ధరలు తగ్గుముఖం పట్టాయని వ్యాపారులు చెబుతున్నారు. వానాకాలంలో కురిసిన భారీ వర్షాలతో రైతులు కూరగాయల పంటలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. దీనికి తోడు ధరలు బాగుండడంతో లాభసాటిగా కూడా ఉండడంతో వారు ప్రత్యేకశ్రద్ధ కనబరిచారు. ముఖ్యంగా టమాటా, బెండకాయ, బీరకాయతో పాటు మిగిలిన కూరగాయల దిగుబడి భారీగా పెరిగాయి. గతంలో టమాటా విషయానికి వస్తే ధరలు కూడా ఉల్లిగడ్డ మాదిరిగానే భారీగా పెరిగాయి. కానీ ప్రస్తుతం టమాటా దిగుబడి ఊహించని రీతిలో పెరిగింది. దీంతో నగరానికి రోజుకు 150 నుంచి 200 లారీల మేరకు దిగుమతి అవుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి కూఢా భారీగా టమాట దిగుమతి అవుతుండడంతో ధరలు దిగి వచ్చాయి, మహారాష్ట్ర నుంచి ఆలుగడ్డ, కర్నాటక నుంచి క్యాప్సికం, పచ్చిమిర్చి వంటివి కూడా భారీగాదిగుమతి అవుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్ కేంద్రంగానే భారీగా కూరగాయల దిగుమతులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్ లు, రిటైల్ వ్యాపారాలు, రైతుబజార్లు, సూపర్ మార్కెట్లలో కూరగాయలతో కళకళలాడుతున్నాయి. టమాటా రేటు పడిపోవడంతో గృహిణులు, హోటల్స్ వారు టమోటాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. టమాటా ధరలు రిటైల్ మార్కెట్లోనే కేజీ 10 రూపాయల నుంచి 15రూపాయల లోపే దొరుకుతున్నాయి. ఇక ఆలుగడ్డ కిలోకు 20 రూపాయలు, బీరకాయ కేజీ 20 రూపాయలు, బెండకాయ కిలో 20 రూపాయలు, పచ్చిమిర్చి కేజీకి 30 నుంచి 40 రూపాయలు, క్యాప్సికం 30 రూపాయలు, చిక్కుడుకాయ 25 నుంచి 30 రూపాయలు, గోకరకాయ కిలో 20 రూపాయలు పలుకుతోంది. కూరగాయల ధరలు మరో నెల రోజుల పాటు ఇలాగే ఉంటాయని వ్యాపారులు అంటుంటే.. కూరగాయలపై పెట్టే ఖర్చు తగ్గడంతో కిచెన్ బడ్జెట్ అదుపులో ఉందని గృహిణులు, మధ్యతరగతి వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
42 minutes ago

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
14 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
10 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
12 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
15 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
17 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
19 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
20 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
21 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
a day ago
ఇంకా