తక్కువ ఖర్చుతో కరోనా టెస్టింగ్ కిట్.. ఐఐటీ హైదరాబాద్ ఘనత
07-06-202007-06-2020 12:46:33 IST
Updated On 07-06-2020 17:33:37 ISTUpdated On 07-06-20202020-06-07T07:16:33.728Z07-06-2020 2020-06-07T07:15:38.894Z - 2020-06-07T12:03:37.698Z - 07-06-2020

కరోనా వైరస్ వీరవిహారం చేస్తున్న వేళ ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు శుభవార్త వినిపించారు. తక్కువ ఖర్చుతో కరోనా వైరస్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఐఐటీ హైదరాబాద్ విద్యార్ధులు ఎంతో కృషిచేశారు. అతి తక్కువ ఖర్చుతోనే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్ష కిట్‌ను అభివృద్ధి చేశారు హైదరాబాద్ ఐఐటీ రీసెర్చర్లు. టెస్టు రిజల్టు కూడా 20 నిమిషాల్లోనే తెలుస్తుందని రీసెర్చర్లు చెబుతున్నారు. క్లినికల్ ట్రయల్స్ పూర్తయిన ఈ కిట్‌కు భారత వైద్య పరిశోధన మండలి నుంచి అనుమతి లభించడంతో ప్రస్తుతం పేటెంట్ కోసం దరఖాస్తు చేశారు. ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిపార్టుమెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శివ్‌గోవింద్‌సింగ్, రీసెర్చర్లు సూర్యస్నాత త్రిపాఠి, సుప్రజా పట్టా ఈ కిట్ ను అభివృద్ధి చేశారు. శరీరంలో కరోనా వైరస్ ఉందా? లేదా? తక్కువ ఖర్చుతోనే కనిపెట్టేందుకు హైదరాబాద్ ఐఐటీ స్టూడెంట్స్ ఓ సరికొత్త టెస్టింగ్ కిట్ ను అభివృద్ధి చేశారు. ఈ కిట్ ద్వారా కేవలం 20 నిమిషాల్లోనే ఫలితం తెలుసుకోవచ్చు. ఇది రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ పాలీమెర్స్ చైన్ రియాక్షన్-RT-PCRకు ప్రత్యామ్నాయ విధానమని ఐఐటీ రీసెర్చర్లు చెబుతున్నారు. ఈ కిట్ ఖరీదు కూడా తక్కువే. కేవలం 550 రూపాయిలకే దీన్ని తయారు చేశామని, పెద్దఎత్తున కిట్లను తయారు చేస్తే, రూ. 350కే అందించవచ్చని రీసెర్చర్లు వెల్లడించారు. టెస్టింగ్ కిట్లకు సంబంధించిన పరీక్షలకు మెడికల్ కాలేజీలో పరీక్షించారు. ఈ పరీక్షల్లో సక్సెస్ అవ్వడంతో ICMR కు పంపించి అనుమతుల కోసం వేచి చూస్తున్నామని ఐఐటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ శివ్ గోవింద్ సింగ్ తెలియజేశారు. ఈ టెస్టింగ్ కిట్ చాలా సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఏ సమయంలోనైనా వినియోగించవచ్చు. ఇది ప్రస్తుతమున్న పరీక్షా విధానాలకు ప్రత్యామ్నాయం. కొవిడ్-19 జీనోమ్ ను ఇది సులువుగా కనుగొంటుందని రీసెర్చర్లు చెబుతున్నారు. కరోనా వైరస్ టెస్టింగ్ కిట్ ను అభివృద్ధి చేసిన రెండో భారత ఐఐటీ హైదరాబాద్ ఐఐటీ. ఇంతకుముందు ఢిల్లీ ఐఐటీ ఇలాంటి కిట్ ఒకదాన్ని అభివృద్ధి చేసింది.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
9 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
12 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
15 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
5 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
16 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
13 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
16 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
16 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
10 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
19 hours ago
ఇంకా